News April 18, 2025

రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు: NTA

image

జేఈఈ మెయిన్-2025 సెషన్-2 ఫలితాలను రేపు వెల్లడిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. ఫైనల్ ఆన్సర్ కీలను ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అధికారిక <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. నిన్న ఫైనల్ ‘కీ’ని రిలీజ్ చేసి, మళ్లీ వెబ్‌సైట్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

News April 18, 2025

హ్యాపీ బర్త్ డే ఐపీఎల్

image

భారతదేశపు అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నమెంట్ ఐపీఎల్ మొదలై నేటికి 18 ఏళ్లు పూర్తవుతోంది. 2008 ఏప్రిల్ 18న BCCI & లలిత్ మోడీ ఈ టోర్నీని ప్రారంభించారు. ప్రతి ఏటా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించే ఈ IPLకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ టోర్నమెంట్ ఎంతో మంది టాలెంటెడ్ యంగ్ ప్లేయర్స్‌ను భారత క్రికెట్ జట్టుకు సేవలందించే అవకాశాన్నిచ్చింది. ఇన్నేళ్లలో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేయండి.

News April 18, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ REVIEW

image

సొంతంగా అన్యాయాలను ఎదిరించే కుమారుడు, చట్టప్రకారం వెళ్లే తల్లి మధ్య జరిగే సంఘర్షణే ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ స్టోరీ. కళ్యాణ్ రామ్, విజయశాంతి యాక్షన్ సీన్స్, శ్రీకాంత్ నటన ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, ఊహకందని క్లైమాక్స్ మూవీకి ప్లస్. అయితే రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ముందే ఊహించే సీన్లు మైనస్. పాటలు ఆకట్టుకునేలా లేవు. హీరోయిన్ సయీ మంజ్రేకర్ పాత్రకు ప్రాధాన్యత లేదు.
RATING: 2.5/5

News April 18, 2025

మే నుంచి ‘రామాయణ’ పార్ట్-2 షూటింగ్?

image

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా పార్ట్-1 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో అశోక వాటిక సీన్లు, రెండు పాటలతో పాటు పలు కీలక సీన్లు చిత్రీకరిస్తారని సమాచారం. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.

News April 18, 2025

సమ్మర్‌లో తలనొప్పి రావొద్దంటే..

image

☞ తరచుగా తాగునీటిని తీసుకోవాలి. దాహం వేయకపోయినా తాగడం మంచిది
☞ బయటకు వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్, టోపీ ధరించాలి
☞ 11am-4pm మధ్య నీడపట్టున ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్లాలి
☞ పుచ్చకాయ, నారింజ, దోసకాయ వంటి నీటిశాతం ఎక్కువ ఉండే వాటిని ఆహారంగా తీసుకోవాలి
☞ స్క్రీన్ టైమ్ తగ్గించాలి
☞ సమయానికి భోజనం చేయాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా తలనొప్పికి దారితీస్తుంది
☞ 5-10min మెడిటేషన్ చేయాలి

News April 18, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

image

ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్‌లో ‘Quality for downloaded photos and videos’ ఫీచర్ రానుంది. దీని ద్వారా మీడియా ఫైల్స్‌ను నచ్చిన క్వాలిటీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ లేదా హై క్వాలిటీ ఆప్షన్‌లలో నచ్చిన దానిని ఎంచుకోవాలి. మీరు స్టాండర్డ్ క్వాలిటీ పెట్టుకుంటే అవతలి వ్యక్తి HDలో పంపినా మీకు స్టాండర్డ్ క్వాలిటీలోనే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. తద్వారా డేటా సేవ్ అవుతుంది. డౌన్‌లోడ్ స్పీడూ పెరుగుతుంది.

News April 18, 2025

పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య.. కారణమిదేనా?

image

TG: నిన్న మేడ్చల్ (D) గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆశిష్(7), హర్షిత్(4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ‘మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. భర్త కోపంతో కసురుకుంటాడు’ అని సూసైడ్ నోట్ రాసింది.

News April 18, 2025

మూడు రోజుల్లో రూ.2400 పెరిగిన బంగారం ధర

image

బంగారం ధరలు స్వల్పంగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.89,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.97,580 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.2400 పెరగడం గమనార్హం.

News April 18, 2025

IPL: RCB vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

IPLలో నేడు బెంగళూరు వేదికగా RCB, PBKS తలపడనున్నాయి. అయితే, ఆ నగరంలో ఇవాళ ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీంతో మ్యాచ్‌కు ఆటంకం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వరుణుడు అడ్డుపడకుంటే మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సుంది. ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా.. PBKS(17), RCB(16) మ్యాచుల్లో విజయం సాధించాయి.

News April 18, 2025

నారాయణ మూర్తి మనవడికి రూ.3.3కోట్ల డివిడెండ్

image

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి మనవడు ఏకగ్రహ్ రోహన్ మూర్తి 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.3.3 కోట్ల డివిడెండ్ అందుకున్నారు. 2023లో రోహన్ జన్మించినప్పుడు బహుమతిగా రూ.240కోట్లు విలువ గల 15లక్షల షేర్లను నారాయణ మూర్తి ఇచ్చారు. దీంతో యంగ్ మిలియనీర్‌గా ఏకగ్రహ్ అవతరించారు. కాగా ఈ షేర్లకు గతేడాది రూ.7.35కోట్ల డివిడెండ్ అందుకున్నారు. ఇప్పటి వరకూ ఈ షేర్లపై మెుత్తంగా రూ.10.65కోట్ల డివిడెండ్ అందుకున్నారు.

error: Content is protected !!