News June 21, 2024

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

image

AP: నేటి నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన గోరంట్ల బుచ్చయ్య కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత సభలో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండో రోజు సభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఈ సమావేశాలకు స్థలాభావంతో సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు. కాగా ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ వస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

News June 21, 2024

ఇటలీపై స్పెయిన్ విజయం

image

యూరో ఛాంపియన్‌షిప్-2024లో గ్రూప్-Bలో ఇటలీతో జరిగిన మ్యాచులో స్పెయిన్ 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ నాకౌట్‌కు చేరువైంది. మరోవైపు గ్రూప్-సీలో స్లోవేనియాతో సెర్బియా, డెన్మార్క్‌తో ఇంగ్లండ్ మ్యాచులు 1-1తో డ్రాగా ముగిశాయి.

News June 21, 2024

జయశంకర్ సేవలు మరవలేనివి: కేసీఆర్

image

TG: తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలక పాత్ర పోషించారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు మరవలేనివని బీఆర్ఎస్ చీఫ్ స్మరించుకున్నారు. BRS పదేళ్ల పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News June 21, 2024

రూ.224 కోట్లు దానం చేయనున్న యువతి

image

ఆస్ట్రియాకు చెందిన మార్లిన్ ఎంగెల్ హార్న్(31) తనకు వారసత్వంగా వచ్చిన సంపద రూ.224 కోట్లు దానం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై గుటెర్ ర్యాట్ అనే నిపుణుల బృందాన్ని మార్లిన్ సంప్రదించారు. ఆ డబ్బును 77 సంస్థలకు పంచుతామని గుటెర్ ర్యాట్ తెలిపింది. సంపద పున:పంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తానని మార్లిన్ తెలిపారు.

News June 21, 2024

సిద్ధరామయ్య రాజీనామా చేయాలి: బొమ్మై

image

ఇంధన, నిత్యావసరాల ధరలు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిందని కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై దుయ్యబట్టారు. దీనికి బాధ్యత వహిస్తూ సీఎం సిద్ధరామయ్య వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధరల పెంపుతో సామాన్యుల జీవితాలు దారుణంగా మారాయని దావణగిరెలో మీడియాతో చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌పై తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

News June 21, 2024

హిట్‌మ్యాన్ ఖాతాలో చెత్త రికార్డు

image

టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌ స్కోరుకు పరిమితమైన భారత బ్యాటర్‌గా రోహిత్ (11) నిలిచారు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఆయన 8 పరుగులే చేశారు. హిట్‌మ్యాన్ తర్వాత యువరాజ్ సింగ్ (8), సురేశ్ రైనా (7), గౌతమ్ గంభీర్ (5), విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు.

News June 21, 2024

జూన్ 21: చరిత్రలో ఈరోజు

image

1940: RSS స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ మరణం
1992: తెలుగు కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి మరణం
2011: తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ మరణం
2015: అంతర్జాతీయ యోగ దినోత్సవం
2016: జానపదగేయ రచయిత గూడ అంజయ్య మరణం
☛ ప్రపంచ సంగీత దినోత్సవం

News June 21, 2024

BREAKING: కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

image

TG: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్‌లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. సూసైడ్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 21, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:21 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:43 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:18 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.