News June 18, 2024

మాడవీధుల్లో భక్తుల కోసం కూల్ పెయింట్

image

తిరుమల మాడవీధుల్లో ఎండలో నడిచేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో జే శ్యామలరావు ఆదేశాలతో భక్తులకు ఉపశమనం కలిగించేలా రోడ్డుపై కూల్ పెయింట్ వేశారు. ప్రధాన ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపంతో పాటు ఇతర ప్రాంతాల్లో వైట్ కూల్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 18, 2024

ఒక్క రైలు ప్రమాదానికే రిజైన్ చేసిన రైల్వే మంత్రి!

image

పశ్చిమ బెంగాల్‌ రైలు ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలోనే ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. 1999లో జరిగిన గైసల్ రైలు ప్రమాదంలో 290 మంది మరణించారని, దీనికి బాధ్యత వహిస్తూ అటల్ బిహారి వాజ్‌పేయి క్యాబినెట్‌లో రైల్వే మంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ రాజీనామా చేశారని గుర్తుచేస్తున్నారు.

News June 18, 2024

పౌర సరఫరాల శాఖలో అక్రమాలపై కేసులు: మంత్రి నాదెండ్ల

image

AP: రాష్ట్రంలోని 253 మండల లెవల్ స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేసి 2 రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 62 కేంద్రాల్లో తనిఖీలు పూర్తవగా, 24 చోట్ల అక్రమాలను గుర్తించినట్లు తెలిపారు. కందిపప్పు, పంచదార, పామాయిల్ తూకాల్లో తేడా కనిపించిందన్నారు. దీనికి బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

News June 18, 2024

సంగారెడ్డి వరకు మెట్రో విస్తరించాలి: MP రఘునందన్

image

TG: మెట్రో రైలు సేవలను మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు, ఆ తర్వాత సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ MP రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మెట్రో MD NVS రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన MD త్వరలో గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. 6 నెలల్లోపు శంకుస్థాపన కోసం కేంద్రాన్ని ఒప్పించాలని MP లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి?

News June 18, 2024

‘ఫ్లయింగ్ స్కూల్’కు ఎయిర్ ఇండియా శ్రీకారం

image

విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా ‘ఫ్లయింగ్ స్కూల్‌’కు శ్రీకారం చుడుతోంది. భవిష్యత్తులో పైలట్ల కొరత ఉంటుందనే ఉద్దేశంతో పైలట్లను తయారు చేసేందుకు మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పుతోంది. ఏడాదికి 180మందికి పైలట్ శిక్షణ ఇవ్వనుంది. అనుభవం లేకున్నా ఆసక్తి ఉన్నవారు ఇందులో ప్రవేశం పొందవచ్చట. ప్రస్తుతం ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలు ఇండియా, విదేశాల్లో ట్రైనింగ్ స్కూళ్లను నడిపిస్తున్నాయి.

News June 18, 2024

‘టైం ఇవ్వండి’.. ఇండియా కూటమి నేతలకు స్వాతి మాలీవాల్ లేఖ

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తనపై దాడికి పాల్పడటంపై ఇండియా కూటమి నేతలకు AAP ఎంపీ స్వాతి మాలీవాల్ లేఖ రాశారు. ఈ విషయం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నేతలను కోరారు. ‘ఈ వ్యవహారంపై మాట్లాడినందుకు నాకు అండగా నిలవాల్సిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే నన్ను దూషిస్తున్నారు. 8ఏళ్ల పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌గా సేవలు అందించిన నాకు ఇలా జరగడం బాధాకరం’ అని పేర్కొన్నారు.

News June 18, 2024

తను నాకు క్రమశిక్షణ నేర్పింది: ఫెదరర్

image

రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వ్యక్తిగా, ఆటగాడిగా తాను మెరుగవడంలో భార్య మిర్కా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఆమె వల్లనే తనకు క్రమశిక్షణ అలవడిందన్నారు. కష్టకాలంలో తన వెంటే ఉండి ప్రోత్సహించిందన్నారు. టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కాను 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో రోజర్ తొలిసారి కలుసుకున్నారు.

News June 18, 2024

NEETపై మోదీ మౌనం.. రాహుల్ విమర్శలు

image

NEET వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. బిహార్, గుజరాత్, హరియాణాల్లోనే అరెస్టులు జరిగాయని, పేపర్ లీకులకు BJP పాలిత రాష్ట్రాలు కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. 24లక్షల విద్యార్థుల భవిష్యత్తు తారుమారవుతున్నా మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారన్నారు. తమ పార్టీ పేపర్ లీకులకు వ్యతిరేకంగా కఠిన చట్టాలను రూపొందించేలా మేనిఫెస్టోలో పెట్టిందన్నారు.

News June 18, 2024

స్పీకర్ రేసులో దగ్గుబాటి పురందీశ్వరి?

image

AP: లోక్‌సభ స్పీకర్ రేసులో రాజమండ్రి BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు కటక్ BJP MP భర్తృహరి మహతాబ్ పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు ఓం బిర్లానే స్పీకర్‌ అభ్యర్థిగా నిలబెట్టవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. కాగా స్పీకర్ పదవి కోసం TDP, JDU తీవ్రంగా పోటీ పడుతున్నాయి. కానీ కమలం నాయకత్వం మాత్రం ఒడిశా లేదా ఏపీ BJP MPలనే స్పీకర్‌ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు టాక్.

News June 18, 2024

రైతుల ఖాతాల్లోకి డబ్బు.. PM కిసాన్ విడుదల

image

PM కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి వేదికగా ఆయన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి నిధులు విడుదల చేశారు. ఈ విడతలో భాగంగా 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల నిధులు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో రూ.2వేలు క్రెడిట్ అవుతాయి.