India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్ణాటక మాజీ సీఎం, BJP సీనియర్ నేత యడియూరప్ప పోక్సో కేసులో CID విచారణకు హాజరయ్యారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని కర్ణాటక హైకోర్టు గత శుక్రవారం CIDని ఆదేశించిన నేపథ్యంలో తాజాగా విచారణకు వెళ్లారు. యడియూరప్ప సీఎంగా ఉండగా సహాయం కోసం కార్యాలయానికి వచ్చిన ఓ 17ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారని మార్చి 14న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
త్వరలో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్-హరియాణా, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్రయాదవ్-మహారాష్ట్ర, శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వశర్మను ఝార్ఖండ్ ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌ను విస్తరించేందుకు అదానీ పోర్ట్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రూ.45వేలకోట్లు వెచ్చించి పోర్టు సామర్థ్యాన్ని సంస్థ రెండింతలు చేయనుంది. 2025కి ముంద్రా పోర్టును 500 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించగలిగే సామర్థ్యం గల పోర్టుగా తీర్చిదిద్దుతామని సంస్థ తెలిపింది. FY24లో అదానీకి చెందిన ముంద్రా పోర్టు దేశంలోని 27% కార్గోను హ్యాండిల్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రావాల్సిన సినిమా క్యాన్సిల్ అయినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అట్లీ తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తీసేందుకు సిద్ధమయ్యారట. షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ బ్లాక్ బస్టర్ అవడంతో మరోసారి బాలీవుడ్ సినిమావైపే ఆయన మొగ్గుచూపారట. సల్మాన్ కూడా మూవీకి ఓకే చెప్పారని, వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులతో ఈ నెల 19న వైసీపీ అధినేత జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఎంపీ అభ్యర్థులూ హాజరుకానున్నారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో ఇప్పటికే సమావేశమైనందున వారికి మినహాయింపునిచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం జరగనుంది. ఎన్నికల్లో ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
దేశ వ్యాప్తంగా అన్ని రకాల కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధరలైతే కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దిగుబడులు తగ్గి మార్కెట్లో సరిపడినంత స్టాక్ లేకపోవడంతో కిలో రూ.100కు చేరువలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.80 వరకు పలుకుతోంది. కొరత ఇలానే ఉంటే ₹100 వరకూ చేరొచ్చు. APలో ₹60 ఉండగా, TGలో ₹70-80 మధ్య ఉంది. మీ ప్రాంతంలో టమాటా ధరలు ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి.
AP: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను వేధించిన పాపం తాలూకు కర్మ మాజీ సీఎం జగన్‌ను వెంటాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రూ.కోట్ల విలువైన ఫర్నిచర్‌ను ఇంట్లో పెట్టుకోవడం దారుణమని మండిపడ్డారు. ‘ఒప్పుకొంటే తప్పు ఒప్పవుతుందా? దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం, రేటు కడతాం అంటే చట్టం ఎలా ఒప్పుకొంటుంది? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వైఎస్ జగన్ సమాధానమివ్వాలి’ అని డిమాండ్ చేశారు.
టీ20 WCలో కీలకమైన రెండో దశకు తెర లేవనుంది. రేపటి నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. ఇందులో జట్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-1లో భారత్, AUS, అఫ్గానిస్థాన్, బంగ్లా చోటు సంపాదించాయి. ఇక గ్రూప్-2లో USA, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు చేరుతాయి. భారత్ 20న ఆఫ్గానిస్థాన్, 22న బంగ్లా, 24న AUSతో ఆడనుంది.
ప్రధాని మోదీపై సెటైరికల్‌గా చేసిన <<13452857>>ట్వీట్‌ను<<>> కేరళ కాంగ్రెస్ డిలీట్ చేసింది. ఆ ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ క్రైస్తవులను అవమానించిందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కే.సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. పలువురు క్రైస్తవ నాయకులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆ ట్వీట్ డిలీట్ చేసింది. ‘దీని వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరుతున్నాం’ అని ప్రకటించింది.
AP: మరో రెండ్రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్ర సృష్టించిన వైసీపీ ఈసారి 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదానూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాని పక్షంలో సమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
Sorry, no posts matched your criteria.