News June 16, 2024

SBI లోన్లు తీసుకున్నవారికి షాక్

image

అన్ని కాలవ్యవధుల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్(MCLR)ను SBI 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 1-3నెలల వడ్డీ రేటు 8.20% నుంచి 8.30%కి, 6 నెలల వడ్డీ రేటు 8.55% నుంచి 8.65%కి పెరిగింది. ఏడాదికి వడ్డీ రేటు 8.65% నుంచి 8.75%కి, రెండేళ్లకు 8.75% నుంచి 8.85%కి చేరింది. దీంతో ఏడాది MCLRకు అనుసంధానమై ఉన్న గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం పెరగనుంది.

News June 16, 2024

పాక్ జట్టులో ఆ ఐదుగురిని పీకేయండి: అహ్మద్ షెహజాద్

image

T20 WCలో పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు మాజీ ప్లేయర్ అహ్మద్ షెహజాద్ మండిపడ్డారు. పాక్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లను వెంటనే తప్పించాలని డిమాండ్ చేశారు. ‘నాలుగైదేళ్లుగా బాబర్, రిజ్వాన్, ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రీది, హారీస్ రవూఫ్ రెగ్యులర్‌గా ఆడుతున్నారు. వీరంతా వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే పాక్ క్రికెట్ నాశనమైంది. వీరిని జట్టు నుంచి తప్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News June 16, 2024

‘కల్కి’ ప్రీ రిలీజ్ అతిథులుగా బాబు, పవన్?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీరితోపాటు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్‌ను కూడా ఆహ్వానిస్తున్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.

News June 16, 2024

నేటి నుంచి SAతో భారత్ వన్డే సిరీస్

image

నేటి నుంచి భారత మహిళల జట్టు SAతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇవాళ బెంగళూరు వేదికగా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మూడు మ్యాచులు ఇదే వేదికలో జరగనున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఇటీవల బంగ్లాదేశ్‌‌ను టీ20ల్లో హర్మన్ సేన 5-0తో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

News June 16, 2024

CPGET దరఖాస్తులకు రేపే లాస్ట్ డేట్

image

TG: ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే CPGET దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా రేపటి లోగా <>దరఖాస్తు<<>> చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 52వేల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://cpget.tsche.ac.in/

News June 16, 2024

త్వరలోనే మహిళలకు నెలకు రూ.2,500: మంత్రి

image

TG: మహిళలకు ప్రతి నెలా ₹2,500 సాయం అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ₹5లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.

News June 16, 2024

YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై రౌడీ షీట్?

image

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాచర్ల పీఎస్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. పాల్వాయి గేటులో ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో అల్లర్ల ఘటనకు సంబంధించి వీరిపై హత్యాయత్నం, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పిన్నెల్లి బ్రదర్స్‌పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేసినట్లు టాక్.

News June 16, 2024

ఫాదర్స్ డే వెనుక.. నాన్న గారాల పట్టి

image

ఇవాళ ఫాదర్స్‌డే జరుపుకోవడం వెనుక ఓ కూతురి కృషి ఉంది. USకు చెందిన సొనోరా స్మార్ట్ తండ్రి విలియం ఓ సైనికుడు. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆరుగురు బిడ్డలను కంటికిరెప్పలా పెంచాడట. దీంతో ఆమె తండ్రి విలియం పుట్టినరోజు జూన్ 5న ఫాదర్స్ డే నిర్వహించాలనుకుంది. ఏర్పాట్లకు తగిన సమయం లేకపోవడంతో జూన్ మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డేగా చేసుకున్నారట. ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ దీన్ని జాతీయ సెలవుదినంగా ప్రకటించారు.

News June 16, 2024

గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయండి: నిరుద్యోగ జేఏసీ

image

AP: గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ JAC నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించిందని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉండటంతో సన్నద్ధం కాలేకపోయామన్నారు. కాగా జులై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహిస్తామని APPSC పేర్కొన్న సంగతి తెలిసిందే.

News June 16, 2024

మూత్ర విసర్జనకు 21 సెకన్లే మేలు

image

మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి మన ఆరోగ్య పరిస్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. 21 సెకన్లలో యూరిన్ చేయడం ఆరోగ్యకరమని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని విద్యార్థుల బృందం తెలిపింది. రోజుకు 8 గ్లాసుల వాటర్ తాగితే 8 సార్లు మూత్ర విసర్జన చేయాలని యూరాలజిస్ట్ నికల్ ఐసెన్‌బ్రౌన్ తెలిపారు. కాగా పదేపదే మూత్రవిసర్జన చేసినా, తక్కువ సార్లు చేసినా ఆరోగ్యానికి నష్టమేనని పరిశోధనలో తేలింది.