India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచి సూపర్-8కు చేరిన ఏడో అసోసియేట్ జట్టుగా USA చరిత్ర సృష్టించింది. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో USA నేరుగా సూపర్-8కు చేరుకుంది. అంతకుముందు ఐర్లాండ్ (2009), నెదర్లాండ్స్ (2014), అఫ్గానిస్థాన్ (2016), నమీబియా (2021), స్కాట్లాండ్ (2021), నెదర్లాండ్స్ (2022) ఉన్నాయి. కాగా 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే T20 WCకు కూడా USA అర్హత సాధించినట్లు తెలుస్తోంది.
AP: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు తీసుకొచ్చిన ‘స్పందన’ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ పేరుతో ఫిర్యాదులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2024-25 ఎగ్జామినేషన్ <
తిరుమల శ్రీవారి ఆలయంలోని ఏర్పాట్లపై భక్తులు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్, అన్నప్రసాదం, లడ్డూల నాణ్యత సరిగా లేకపోవడం ఎంతో ఇబ్బందికరంగా ఉందంటున్నారు. ఏడుకొండలపై అన్యమతస్థులు పెరిగిపోయారని వారిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నిసార్లు క్యూకాంప్లెక్సుల్లో ఉచిత భోజనాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరి తిరుమలలో మీకెదురైన సమస్య ఏంటో కామెంట్ చేయండి.
ఈనెల 18న జరిగే UGC NET 2024 అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. https://ugcnet.nta.ac.in/లో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్లను <
సునీతా విలియమ్స్ ఈనెల 22న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదకు రానున్నట్లు నాసా వెల్లడించింది. బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈనెల 5న బుచ్ విల్మోర్‌తో కలిసి ఆమె ISSకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు ISS నుంచి భూమిపైకి రావడానికి దాదాపు 6hrs పట్టొచ్చని, వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఉటా, న్యూ మెక్సికో లేదా ఇతర బ్యాకప్ స్థానాల్లో ఓ చోట ల్యాండ్ అవుతారని నాసా పేర్కొంది.
ORS, ORSL పేర్లు ఒకే విధంగా ఉండటంతో చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. ORSతో పోలిస్తే యాపిల్, ఆరెంజ్, లెమన్ ఫ్లేవర్లలో లభ్యమయ్యే ORSLలో 10 రెట్ల షుగర్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు, వృద్ధులు రీహైడ్రేషన్ కోసం ORSకు బదులు పొరపాటున ORSL తాగితే షుగర్ లెవెల్స్ భారీగా పెరుగుతాయన్నారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ నుంచి అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వైదొలిగారు. చేతి వేలి గాయంతో బాధపడుతూ ఆయన టోర్నీ నుంచి తప్పుకున్నారు. ముజీబ్ స్థానంలో బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ జట్టులో చేరనున్నారు. కాగా ముజీబ్ ఇదే కారణంతో ఐపీఎల్ 17 సీజన్‌కు కూడా దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ వేలి నొప్పి తిరగబెట్టడంతో ఆయన మెగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. కీలక దశలో మెయిన్ స్పిన్నర్ తప్పుకోవడం AFGకు పెద్ద దెబ్బే!!
AP: ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడంతో రెండు గవర్నర్ పదవులు దక్కుతాయని సమాచారం. సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శాసన సభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు, చీఫ్ విప్‌గా ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఇస్తారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మంత్రి పదవులు ఆశించిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రంలో గతేడాది ప్రసూతి మరణాలు తగ్గినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదు కాగా, 2023-24లో 260కి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో TG మూడో స్థానంలో ఉంది. ప్రసూతి మరణాల్లో అత్యధిక శాతం ప్రసవించిన వారంలోపే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గుండె సమస్యలు, ఊబకాయం, రక్తస్రావం, అబార్షన్ వంటివి కారణాలుగా చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.