News June 13, 2024

బక్రీద్‌కు గోవధ జరగకుండా చూడండి: హైకోర్టు

image

బక్రీద్ వేళ గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గోవుల తరలింపును అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించింది. అక్రమంగా గోవులను చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. జంతువధ చట్టం అమలులో ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. బక్రీద్ వేళ గోవధను అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఇలా స్పందించింది.

News June 13, 2024

ఈరోజూ మంత్రుల శాఖల ప్రకటన లేనట్లేనా?

image

AP: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో అందరి దృష్టి మంత్రి వర్గ కూర్పుపై పడింది. ఎవరికి ఏ శాఖలు ఇస్తారనే ఉత్కంఠ నిన్నటి నుంచి కొనసాగుతోంది. బుధవారం రాత్రే శాఖలు ప్రకటిస్తారని చాలామంది భావించారు. కానీ ప్రకటించలేదు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. తాజా పరిస్థితి చూస్తుంటే ఈరోజు కూడా అందరూ ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేలా కనిపించడం లేదు.

News June 13, 2024

మా నేతలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది: సుబ్బారెడ్డి

image

AP: టీడీపీ నేతల దాడులకు భయపడొద్దని పార్టీ శ్రేణులకు భరోసా ఇస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని అన్నారు. విశాఖలో కార్పొరేటర్లతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కార్పొరేషన్, స్థానిక సంస్థల్లో తమ ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అన్నారు. వాటికి లొంగకుండా అందరం కలిసి సమష్టి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News June 13, 2024

‘అమిత్‌షా వార్నింగ్’ వార్తలపై తమిళిసై క్లారిటీ

image

మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసైకి నిన్న హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారనే వార్తలపై ఆమె స్పష్టత ఇచ్చారు. ‘నిన్న నేను హోంమంత్రి అమిత్ షాను కలిశాను. 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి, ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన నన్ను అడిగారు. రాజకీయంతో పాటు నియోజకవర్గ పనులను చూసుకోవాలని సూచించారు. నా గురించి వస్తున్న ఊహాగానాలకు స్పష్టత ఇవ్వడానికి ఈ పోస్టు’ అని ట్వీట్ చేశారు.

News June 13, 2024

రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిది: వెంకయ్యనాయుడు

image

AP: రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిందని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం ఓ విలువైన పాఠమన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేదేం లేదని అమరావతి రైతులు నిరూపించారని అన్నారు. 1631 రోజుల శాంతియుత ఉద్యమం గొప్పదని పేర్కొన్నారు. చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషకరమని అన్నారు.

News June 13, 2024

వింబుల్డన్‌కు దూరం కానున్న నాదల్

image

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఈ ఏడాది వింబుల్డన్‌కు గైర్హాజరు కానున్నట్లు ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వింబుల్డన్ టోర్నమెంట్ వచ్చే నెల 1నుంచి లండన్‌లో ప్రారంభం కానుండగా 26నుంచి ఒలింపిక్స్ మొదలవుతాయి. కార్లోస్ అల్కరాజ్‌తో కలిసి నాదల్ డబుల్స్ ఆడతారని స్పెయిన్ తాజాగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News June 13, 2024

ఇక నుంచి ఫోన్ నంబర్లపై ఛార్జీ?

image

ఫోన్ నంబర్లపై టెలికాం సంస్థల నుంచి ఫీజు వసూలు చేసేందుకు TRAI సిద్ధమైంది. అలాగైతే ఆ సంస్థలు తమ యూజర్లపై ఛార్జీ వేసే అవకాశం ఉంది. ఫోన్ నంబర్లు అపరిమితం కాదని, అవీ విలువైన వనరులేనని భావిస్తోన్న TRAI నంబర్లపై ఛార్జీ‌తో పాటు వినియోగంలో లేని నంబర్లపైనా పెనాల్టీలు విధించేందుకు సిద్ధమైందని సమాచారం. డ్యుయల్ సిమ్ యూజర్లకు ఇది ఎఫెక్టవుతుంది. ఛార్జీ ఒకసారి వేయాలా? ఏడాదికోసారి వేయాలా? అనేది నిర్ణయించలేదట.

News June 13, 2024

కంగ్రాట్స్ అన్నా: బండి సంజయ్

image

కేంద్ర బొగ్గు&గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన BJP MP కిషన్‌రెడ్డికి ఆ పార్టీ హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పారు. ‘ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి అన్నకు శుభాకాంక్షలు. మన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకోవడం, స్థిరమైన వృద్ధి సాధించడంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

News June 13, 2024

శాసనమండలిలో వైసీపీ బలం ఎంతంటే?

image

AP: అసెంబ్లీలో బలం లేని వైసీపీ శాసనమండలిలో బలంగా పోరాడాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు YS జగన్ ఆ పార్టీ ఎమ్మెల్సీలకు సైతం దిశానిర్దేశం చేశారు. అయితే శాసనమండలిలో బలాబలాలు చూస్తే YCPకి ఎక్కువ మంది సభ్యులున్నారు. మొత్తం 58 సీట్లకు గాను YCPకి 38 మంది(8 మంది నామినేటెడ్ సభ్యులతో కలిపి) ఎమ్మెల్సీలున్నారు. TDP నుంచి 8 మంది, నలుగురు ఇండిపెండెంట్లు, PDF నుంచి ఇద్దరు సభ్యులున్నారు. ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి.

News June 13, 2024

నా ప్రాణం చంద్రబాబు: భువనేశ్వరి

image

AP: సీఎం చంద్రబాబుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం.. నా ప్రాణం నారా చంద్రబాబు నాయుడు గారు’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. కాగా చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో తీవ్ర మనోవేదనకు గురైన భువనేశ్వరి తొలిసారి ప్రజల్లోకి వచ్చి భర్త మళ్లీ సీఎం కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఆ కోరిక నెరవేరిన వేళ ఆమె భావోద్వేగం చెందారు.