India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నికోలస్ పూరన్ (1904) నిలిచారు. T20 WCలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచులో ఆయన ఈ ఘనతను సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ (1899) పేరిట ఉండేది. వీరిద్దరి తర్వాతి స్థానాల్లో వరుసగా శామ్యూల్స్ (1611), కీరన్ పొలార్డ్ (1569), సిమ్మన్స్ (1527) ఉన్నారు.
తెలంగాణ BJP చీఫ్ కిషన్ రెడ్డి నేడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో తాను నేడు ఉ.10 గంటలకు ఢిల్లీలోని శాస్త్రిభవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
TG: రైతు రుణమాఫీకి పీఎం కిసాన్ స్కీమ్ నిబంధనలను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, IT చెల్లించేవారు తదితరులకు కేంద్రం పీఎం కిసాన్ అమలు చేయడం లేదు. దీంతో రుణమాఫీకి కూడా ఇవే మార్గదర్శకాలు అనుసరిస్తే అర్హులైన వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఇప్పటివరకు మనం మార్వెల్, డీసీ సినిమాలకు సపోర్ట్ చేశాం. ఇక నుంచి KALKI 2898ADని ప్రమోట్ చేద్దాం. బాహుబలితో ప్రభాస్ తెలుగు సినిమా ప్రమాణాలను దేశవ్యాప్తం చేశారు. ఇప్పుడు కల్కితో నేను, ప్రభాస్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తాను చాటుతాం. ఇది మన ప్రభాస్ సినిమా. మన తెలుగు సినిమా’ అని ఇన్‌స్టా స్టోరీ పెట్టారు.
AP: రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నిన్న వారితో భేటీలో మాట్లాడుతూ.. ‘శాఖల్లో ఫైళ్లను ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తాం’ అని తెలిపారు. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సంతకాలు చేయాలని, ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు.
ICC ఈవెంట్లలో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరారు. ధోనీ 58 మ్యాచ్‌లలో 41 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు. హిట్ మ్యాన్ 20 మ్యాచ్‌లలో 17 గెలుపులు, గంగూలీ 22 మ్యాచ్‌లలో 16 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ సారథ్యంలో WTC ఫైనల్, ODI WC ఫైనల్, T20WC సెమీ ఫైనల్‌లో భారత్ ఓడింది. ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
AP: విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని VMRDA భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు భావిస్తున్నారు. ఆ భవనంలోని ఐదో అంతస్తును కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునను ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ కోరారు. కాగా ప్రతి రాష్ట్రంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఉంటుంది. దీంతో రాష్ట్రంలోనూ ఈ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు.
TG: రైతులకు ఆగస్టు 15లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఈ నెల 15 లేదా 18న మంత్రివర్గ భేటీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రుణ మాఫీకి ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి? అర్హుల గుర్తింపునకు విధివిధానాల రూపకల్పన, నిధుల సమీకరణ మార్గాలపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికారులు పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసినట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్ ఉగ్రవాద ఘటనపై పాక్ క్రికెటర్ హసన్ అలీ స్పందించారు. ‘ఆల్ ఐస్ ఆన్ వైష్ణోదేవీ అటాక్’ అంటూ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. హసన్ అలీ భార్య సమియా అర్జూ భారత్‌కు చెందినవారే. కాగా, వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 9 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ పోస్టు పెట్టినందుకు అలీపై సోషల్ మీడియాలో పలువురు మండిపడుతున్నారు.
TG: 1 నుంచి 10 తరగతుల తెలుగు వాచకం పాఠ్య పుస్తకాల్లోని ముందుమాట పేజీలో పొరపాటు జరిగింది. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారుల పేర్లతో ముద్రించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పేజీ తొలగించి విద్యార్థులకు ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. దీంతో ఆ పేజీ తొలగింపుతో వెనుకవైపు ఉన్న వందేమాతరం, జాతీయ గీతం, సామూహిక ప్రతిజ్ఞ కూడా పుస్తకంలో ఉండవు.
Sorry, no posts matched your criteria.