India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: భూముల మార్కెట్ విలువను ఏ మేరకు పెంచవచ్చనే దానిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. ఈ నెలాఖరులోగా కొత్త ధరలను నిర్ణయించనున్నట్లు సమాచారం. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచే అవకాశం ఉండగా, అపార్టుమెంట్ల విలువను పెద్దగా పెంచకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ స్థలాల విషయానికి వస్తే HYD పరిసర జిల్లాల్లో వాస్తవ ధరలు ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట పెంపు ఉండొచ్చంటున్నారు.
TG: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ్టి నుంచి మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, సిద్దిపేట, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో వానలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 30-40Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది.
T20 WCలోని గ్రూప్-Aలో అజేయంగా ఉన్న భారత్-అమెరికా మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయంపై ఇరు జట్లూ గురిపెట్టాయి. కెనడా, పాకిస్థాన్‌పై US గెలిచినప్పటికీ సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన ముందు నిలబడటం కష్టమే. ఇవాళ విజయం సాధించిన జట్టు గ్రూప్-8 బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
AP: స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటివరకు వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను ముద్రించగా.. ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు. అలాగే వాటిపై ‘జగనన్న గోరుముద్ద’ అని ఉండగా దాన్ని తొలగించారు. రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీలతో పాటు కోడిగుడ్లు, రాగిపిండి సరఫరా చేయనున్నారు.
TG: వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు పాఠశాలల కమిటీలు ఏర్పాట్లు చేశాయి. తొలి రోజే స్టూడెంట్లకు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయనున్నాయి. సీఎం రేవంత్ కొన్ని స్కూళ్లు సందర్శించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. కాగా ఈ విద్యాసంవత్సరం స్కూళ్ల <<13422366>>టైమింగ్స్<<>> మారాయి.
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 2,36,487 మంది హాజరయ్యారు. ఈ నెల 3న ప్రాథమిక కీని రిలీజ్ చేసి అభ్యంతరాలను స్వీకరించారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
AP: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం ఏ అంశంపై చేస్తారోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై తొలి సంతకం పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వృద్ధాప్య, వితంతు పింఛన్లు రూ.4వేలకు, దివ్యాంగులకు రూ.6వేలకు పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపైనా సైన్ చేసే అవకాశం ఉందంటున్నాయి.
పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఓపెనర్‌గా రోహిత్ రికార్డును పాక్ క్రికెటర్ రిజ్వాన్ సమం చేశారు. హిట్ మ్యాన్ 118 ఇన్నింగ్సుల్లో 30 హాఫ్ సెంచరీలు చేయగా, రిజ్వాన్ 71 ఇన్నింగ్సుల్లోనే ఆ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్-28( 84 inns), వార్నర్-27(98 inns) ఉన్నారు. అలాగే T20 WCలో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ(52 బంతులు) చేసిన ప్లేయర్‌గా రిజ్వాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.
AP: మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, GV ఆంజనేయులు తదితరులు ఉన్నారు. అలాగే JC అస్మిత్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకూ అవకాశం దక్కలేదు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హిట్‌తో జోరుమీదున్న విశ్వక్ సేన్ మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో ‘మెకానిక్ రాకీ’ అనే మూవీలో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఈ ఏడాదే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.