News June 11, 2024

పారిస్‌లో ధోనీ, అశ్విన్ సందడి

image

క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, మరో ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తమ కుటుంబాలతో కలిసి పారిస్‌లో విహరిస్తున్నారు. వారు ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ధోనీ మెరిశారు. కాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో అశ్విన్‌కు చోటు దక్కలేదు.

News June 11, 2024

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి

image

ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా <<13417665>>విమాన<<>> ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.

News June 11, 2024

పెళ్లి చేసుకున్న కోలీవుడ్‌ హీరో, హీరోయిన్

image

నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ హీరో ఉమాపతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో ఇవాళ వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏడడుగులు నడిచారు.

News June 11, 2024

EAPCET RESULTS.. టాప్ ర్యాంక్ ఎవరికంటే?

image

AP EAPCET ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరుకు చెందిన మాకినేని జిష్ణుసాయి తొలి ర్యాంక్ సాధించారు. కర్నూలుకు చెందిన మురసాని యశ్వంత్ రెడ్డి 2వ ర్యాంక్, ఆదోనికి చెందిన బోగాలపల్లి సందేశ్ 3, అనంతపురానికి చెందిన సతీశ్ రెడ్డి 4, గుంటూరుకు చెందిన కోమటినేని మనీశ్ 5వ ర్యాంక్ సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది, అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది అర్హత సాధించారు.

News June 11, 2024

సూపర్‌-8కి సౌతాఫ్రికా?

image

T20WC సూపర్-8లో సౌతాఫ్రికాకు దాదాపు బెర్తు ఖరారైంది. ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన సఫారీ టీమ్ 6 పాయింట్లతో గ్రూప్-D టాపర్‌గా ఉంది. అదే గ్రూప్‌లో రెండేసి పాయింట్లతో 2&3 స్థానాల్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ ఉన్నా ఆ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. అందులో ఒక జట్టే SAతో సూపర్-8 చేరే ఛాన్స్ ఉంది. నేపాల్‌‌ 3 మ్యాచుల్లోనూ గెలిస్తేనే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆడిన రెండింట్లోనూ ఓడిన శ్రీలంక దాదాపు నిష్క్రమించినట్లే.

News June 11, 2024

మితిమీరిన నమ్మకమే బీజేపీని ముంచింది: RSS

image

మితిమీరిన విశ్వాసంతో ఉన్న BJP నేతలకు ఈ ఎన్నికల ఫలితాలు బుద్ధి చెప్పాయని RSS తన మ్యాగజైన్ ‘ఆర్గనైజర్’లో విమర్శించింది. ఆ పార్టీ కార్యకర్తలు సహా చాలా మంది నేతలు మోదీ క్రేజ్ చూసి సంతోషించారే తప్ప ప్రజల గొంతుక వినిపించుకోలేదని పేర్కొంది. తమ వాలంటీర్ల సహాయం తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘400 పార్’ అని ప్రధాని మోదీ ఇచ్చిన నినాదాన్ని కార్యకర్తలు/నేతలు సీరియస్‌గా తీసుకోలేదని తెలిపింది.

News June 11, 2024

వొడాఫోన్‌ ఐడియాకు ఊరట.. రూ.14వేల కోట్ల లోన్‌కు గ్రీన్ సిగ్నల్!

image

సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాకు ఊరట కలిగేలా భారీ మొత్తంలో లోన్ మంజూరు అయినట్లు తెలుస్తోంది. SBI, PNB, యూనియన్ బ్యాంక్ సహా పలు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు రూ.14వేలకోట్ల అప్పు ఇచ్చేందుకు ఓకే చెప్పాయట. Vi 5జీ నెట్‌వర్క్ లాంచ్ చేయడం, అదనపు స్పెక్ట్రమ్ కొనుగోలు, పాత బాకీలు తీర్చేందుకు ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. కాగా మరో రూ.25వేలకోట్ల నిధులు సమకూర్చుకునేందుకు కూడా సంస్థ ప్లాన్ చేస్తోంది.

News June 11, 2024

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన 29,463 మంది విద్యార్థుల్లో 28,549 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. అందులో 4769 మంది పురుషులు, 23,780 మంది మహిళలు ఉన్నారు. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన నవీన్ కుమార్ తొలి ర్యాంక్ సాధించగా, HYDకు చెందిన ఆశిత రెండో ర్యాంక్ పొందారు. WAY2NEWS యాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చు.

News June 11, 2024

EAPCET ఫలితాలు విడుదల

image

AP EAPCET-2024 ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. WAY2NEWSలో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

News June 11, 2024

ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు: మంత్రి రాజనర్సింహా

image

TG: ఆహార నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. హోటళ్లు, బార్లు, బేకరీ నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని.. హోటల్స్ యజమానులు బాధ్యతతో నడుచుకోవాలన్నారు. HYDను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒకసారి వర్క్ షాప్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు.