India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BJP జాతీయాధ్యక్షుడు <<13412351>>జేపీ నడ్డా<<>> కేబినెట్‌లోకి వెళ్లడంతో ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రేసులో ఐదుగురు ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుత జనరల్ సెక్రటరీలు సునీల్ బన్సల్(UP), వినోద్ తావ్డే(మహారాష్ట్ర), BL సంతోశ్(కర్ణాటక), లోక్‌సభ స్పీకర్ బాధ్యతలు నిర్వర్తించిన ఓం బిర్లా(రాజస్థాన్), BJP సీనియర్ లీడర్ ఓం మాథుర్(రాజస్థాన్)లు ఉన్నట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. సఫారీ జట్టు 5.3 ఓవర్లకే 25 రన్స్ మాత్రమే చేసి కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. డికాక్(18), హెన్రిక్స్(0), మార్క్‌రమ్(4), స్టబ్స్(0) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో క్లాసెన్(0), మిల్లర్(2) ఉన్నారు.
AP: ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి IT పార్కు వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందుకోసం ఉ.8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి ఉ.10.40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకుని, ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు కార్యక్రమంలో పాల్గొంటారు. మ.12.45 గంటలకు విమానంలో భువనేశ్వర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు.
AP: విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పడంపై టీడీపీ స్పందించింది. కృష్ణా జిల్లాలో 60శాతం టీడీపీని ఖాళీ చేస్తామంటూ గతంలో కేశినేని నాని చేసిన పోస్టుకు Xలో రిప్లై ఇచ్చింది. ‘ప్రజల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడం, శవాల మీద పుట్టిన వైసీపీ వల్ల కాదు’ అని ట్వీట్ చేసింది.
తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించారు. ఆయన 2019లో హోంశాఖ సహాయమంత్రిగా, ఆ తర్వాత పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచి కీలకశాఖ పొందారు. ఈ ఎన్నికల్లో BJPకి 8 MP సీట్లు రావడంలో కీలకంగా మారిన కిషన్‌రెడ్డి ఏకంగా కేబినెట్‌లో చోటు సాధించారు.
* వ్యక్తిగత, ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్
* అన్ని ముఖ్యమైన పాలసీ వ్యవహారాలు
* ఇతరులెవ్వరికీ కేటాయించని శాఖలు
*సీఆర్ పాటిల్- జలశక్తి మంత్రిత్వ శాఖ
*చిరాగ్ పాస్వాన్- ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ,
*సర్బానంద్ సోనోవాల్- ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా
*అన్నపూర్ణ దేవీ- మహిళా శిశు సంక్షేమ శాఖ
*జితిన్ రామ్ మాంఝీ- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
*జ్యోతిరాదిత్య సింధియా- కమ్యూనికేషన్స్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ
* ప్రహ్లాద్ జోషి- ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు
* గిరిరాజ్ సింగ్- టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ
తెలంగాణ ఎంపీ బండి సంజయ్‌కి హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం దక్కింది. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన ఆయనకు తొలిసారి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కింది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, పార్టీ బలోపేతం కోసం బండి కృషి చేశారు.
AP: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కేంద్రం శాఖలు కేటాయించింది. సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖలను అప్పగించింది. అటు నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించింది.
ఆన్‌లైన్‌లో సిలబస్, శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని CBSE హెచ్చరించింది. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ పేరుతో పాత లింకులు, వార్తలు ప్రచారంలో ఉన్నాయని తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. అనధికార సోర్స్‌ల నుంచి వచ్చే సమాచారం స్కూళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయవచ్చని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
Sorry, no posts matched your criteria.