India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొత్త ఎన్డీఏ సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ సెటైర్లు వేసింది. కమలం పువ్వును జేడీయూ, టీడీపీ అనే రెండు జాకీలు పెట్టి లేపుతున్నట్లు ఉన్న ఫొటోను ఆ పార్టీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. దీనికి ‘అబ్‌కీ బార్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈసారి ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేడీయూ, టీడీపీ మద్దతుతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
TG: యాసంగి సీజన్‌లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 3 రోజుల్లోనే దాదాపు 8.35లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,355కోట్లు జమ చేసినట్లు తెలిపింది. చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజులపాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావొచ్చని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు అవసరమైన ప్రాంతాల్లో కేంద్రాలను తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.
కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని అందించి రికార్డు సృష్టించిన సురేశ్ గోపికి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. త్రిశ్శూర్ నుంచి MPగా పోటీ చేసిన ఈ నటుడు.. CPI నేత సునీల్ కుమార్‌పై 74వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఇక కేరళ నుంచి మరో BJP నేత అయిన జార్జ్ కురియన్‌కు సైతం మంత్రివర్గంలో అవకాశం దక్కింది. ఈయన ప్రస్తుతం కేరళ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు.
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో 37 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీ షూటింగ్ 60% పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 40 రోజుల్లో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో లోకనాయకుడు త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
మోదీ 2.0 ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 37మందికి ఈసారి కేబినెట్‌లో చోటు దక్కలేదు. వీరిలో స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకుర్, నారాయణ్ రాణె, పరుషోత్తం రూపాలా, అర్జున్ ముండా, RK సింగ్, మహేంద్రనాథ్ కేబినెట్ ర్యాంక్ మంత్రులుగా పని చేశారు. మిగతా 30మంది సహాయమంత్రులు. వీరిలో 18మంది ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓడినప్పటికీ కేబినెట్‌లో తిరిగి చోటు దక్కించుకున్న నేతగా L.మురుగన్ నిలిచారు.
AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్టు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాగా పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. రేపు NDA ఎమ్మెల్యేల <<13411781>>భేటీలో<<>> ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
భారత ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్‌గా గోల్ కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు. సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొత్త కెప్టెన్‌ను నియమించింది. ఫిఫా WC క్వాలిఫయర్స్‌లో భాగంగా రేపు ఖతర్‌తో జరిగే మ్యాచులో గుర్‌ప్రీత్ కెప్టెన్సీ చేయనున్నారు. గతంలో ఛెత్రి ఆడని మ్యాచుల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం అతనికి ఉంది. ఇప్పటివరకు భారత్ తరఫున గుర్‌ప్రీత్ 71 మ్యాచులు ఆడారు.
ఎన్డీఏ పక్షాల <<13390967>>డిమాండ్ల<<>> నేపథ్యంలో అగ్నిపథ్ స్కీమ్‌లో భారీ మార్పులకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న సర్వీసును 7-8 ఏళ్లకు పెంచనుందట. వారిలో 60-70% మందిని(గతంలో 25%) పర్మినెంట్ చేస్తుందని తెలుస్తోంది. అలాగే టెక్నికల్ గ్రేడుల్లో ప్రవేశాలకు వయసు 23 ఏళ్లకు పెంచడం, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి భారీ పరిహారం, దేశ సేవలో చనిపోతే కుటుంబానికి భత్యం తదితర అంశాలూ ఉన్నాయట.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై మ్యాచ్. అదీ వరల్డ్ కప్. కానీ భారత్ చేసింది 119 రన్సే. లక్ష్య ఛేదనలో తొలి 10 ఓవర్లు పాక్ బ్యాటింగ్ సజావుగానే సాగింది. దీంతో టీమ్ ఇండియాకు భంగపాటు తప్పదని అంతా భావించారు. ఒకానొక సమయంలో భారత్ విజయావకాశాలు 8%కి పడిపోయాయి. కానీ ఒక్కసారిగా భారత పులులు పంజా విసిరాయి. వరుసగా వికెట్లు తీస్తూ, సింగిల్స్ కూడా ఇవ్వకుండా దాయాదులపై ఒత్తిడి తెస్తూ.. అద్భుత విజయం సాధించింది భారత్.
నరేంద్రమోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు(36). ఈయన 2014, 19, 24లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. రామ్మోహన్ నాయుడు తర్వాత అత్యంత పిన్న వయస్కులుగా మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే (37), లోక్ జన్‌శక్తి పార్టీ ఎంపీ చిరాగ్ పాస్వాన్ (41), రాష్ట్రీయ లోక్‌దళ్ ఎంపీ జయంత్ చౌదరి (45) ఉన్నారు. అతి పెద్ద వయస్కుడిగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ (79) ఉన్నారు.
Sorry, no posts matched your criteria.