News June 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 10, 2024

పెట్టుబడి సాయంపై నోరు మెదపరేం?: హరీశ్ రావు

image

TG: ఎన్నికలకు ముందు అన్ని రకాల వడ్లకూ క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్ ఇస్తామనడం సరికాదన్నారు. సిద్దిపేట జిల్లా అక్కేనపల్లిలో మాట్లాడుతూ.. వానా కాలం వచ్చినా రైతుల పంటల పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ పంటను ప్రోత్సహించాలని సూచించారు.

News June 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 10, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 10, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:52 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:50 గంటలకు
ఇష: రాత్రి 8.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 10, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 10, సోమవారం
జ్యేష్ఠమాసం
శు.చవితి: మ.4.15 గంటలకు
పుష్యమి: రాత్రి 9:39 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:32 నుంచి 1:24 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3:08 నుంచి 4:00 వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 4.47 నుంచి ఉ.6.28 వరకు

News June 10, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* భారత ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం
* మోదీ 3.0 కేబినెట్‌లో 72 మందికి చోటు
* తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ఐదుగురు ఎంపీలు ప్రమాణస్వీకారం
* ఈనాడు అధినేత రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
* TG: గ్రూప్-4 మెరిట్ జాబితా విడుదల
* ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

News June 10, 2024

మోదీ 3.0: రికార్డు సృష్టించిన నిర్మల

image

బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. మోదీ కేబినెట్‌లో మూడు సార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళా ఎంపీగా నిలిచారు. 2014లో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా చేశారు. 2019లో గెలిచాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మరోసారి మంత్రి పదవి దక్కింది.

News June 9, 2024

చెలరేగిన పాక్ బౌలర్లు.. భారత్ 119 ఆలౌట్

image

T20WCలో పాక్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయ్యారు. పంత్ 42, అక్షర్ పటేల్ 20, రోహిత్ శర్మ 13 మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు. కోహ్లీ 4, సూర్య 7, దూబే 3, హార్దిక్ 7, జడేజా 0 నిరాశపర్చారు. నసీమ్ షా, హారిస్ రౌఫ్ చెరో 3 వికెట్లు, అమీర్ 2, షాహీన్ అఫ్రిదీ ఒక వికెట్ తీశారు.

News June 9, 2024

ఒకే ఫ్రేమ్‌లో 70,343 పరుగులు!

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న భారత్-పాక్‌ మ్యాచ్‌లో భారత దిగ్గజ క్రికెటర్లు మెరిశారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ ఆట ప్రారంభానికి ముందు మైదానంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరు ముగ్గురూ కలిసి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 70,343 పరుగులు సాధించారు. అలాగే 165 సెంచరీలు, 2 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ (వన్డే WC) అవార్డులు పొందారు

News June 9, 2024

రోహిత్ శర్మ అరుదైన ఘనత

image

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. వన్డేల్లో, T20ల్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షాహీన్ అఫ్రీది బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఇంతవరకూ రోహిత్ తప్ప మరే బ్యాటర్ అఫ్రీది వేసిన తొలి ఓవర్లో సిక్సర్ కొట్టలేదు. కాగా అంతర్జాతీయ మ్యాచుల్లో 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.