News November 1, 2025

IVFలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా..?

image

సహజంగా తల్లిదండ్రులు కాలేని దంపతులకు IVF ఒక వరం. ఇందులో 45-50% సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తి మందుల కారణంగా మానసికకల్లోలం, తల, కడుపు నొప్పి, వేడిఆవిర్లు, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్(OHSS) వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మహిళల అండాశయాలు ఉబ్బి శరీరంలోకి ద్రవాన్ని లీక్ చేయవచ్చు.

News November 1, 2025

ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు

image

✦ ఆధార్‌లో పేరు, అడ్రస్, DOB, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌(₹75 ఛార్జీ)లో మార్చుకోవచ్చు. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫొటో అప్‌డేట్ కోసం మాత్రం వెళ్లాలి.
✦ UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు ₹75, బయోమెట్రిక్స్‌కు ₹125 చెల్లించాలి. 2026, JUN 14 వరకు ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేషన్ ఫ్రీ
✦ 2025, DEC 31లోపు ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి

News November 1, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

✦ జూబ్లీహిల్స్ బైపోల్: ఇవాళ రాత్రి బోరబండ, ఎర్రగడ్డలో CM రేవంత్ ప్రచారం
✦ నేడు సా.6 గంటలకు రహమత్ నగర్‌లో KTR రోడ్ షో
✦ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్తగా 75 PG సీట్లు మంజూరు చేసిన NMC.. 1390కి చేరిన సీట్ల సంఖ్య
✦ భవిత కేంద్రాల్లో పని చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ TET మినహాయింపు కుదరదు: హైకోర్టు
✦ గద్వాల(D) ధర్మవరం BC హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 86 మంది విద్యార్థులకు అస్వస్థత

News November 1, 2025

పంటకు ఎరువులను ఇలా అందిస్తే ఎక్కువ లాభం

image

అవసరాన్ని బట్టి మాత్రమే యూరియాను పంటకు వేసుకోవాలి. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడల ఉద్ధృతి ఎక్కువై పంటల దిగుబడి తగ్గుతుంది. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా 3 దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు.
సూక్ష్మపోషకాలను పంటలకు స్ప్రే రూపంలో అందిస్తే మొక్క వేగంగా గ్రహిస్తుంది.

News November 1, 2025

IUCTEలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(IUCTE)10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: www.iucte.ac.in

News November 1, 2025

భారత్ ఓటమి.. గంభీర్‌పై విమర్శలు

image

AUS టూర్‌లో భారత పేలవ ప్రదర్శన పట్ల కోచ్ గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. నిన్నటి మ్యాచులోనూ టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్‌ను తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని AUS మాజీ ఓపెనర్ ఫించ్ అన్నారు. అర్ష్‌దీప్‌ను పక్కన పెట్టడంపై అశ్విన్ సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే అతడి ప్లేస్‌లో వచ్చిన హర్షిత్ నిన్న బ్యాటుతో రాణించాడని, గంభీర్ నిర్ణయం సరైనదేనని ఆయన ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News November 1, 2025

మహిళా లెక్చరర్ వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య

image

AP: విశాఖలో సాయితేజ్(21) అనే డిగ్రీ స్టూడెంట్ ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సమతా కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ వేధింపులే కారణమని అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లెక్చరర్ మార్కులు సరిగా వేయకపోవడం, రికార్డులు రిపీటెడ్‌గా రాయించడం, మరో మహిళా లెక్చరర్‌తో కలిసి లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 1, 2025

258 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.E./B.Tech/M.Tech పూర్తి చేసిన వారు అర్హులు. గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. వెబ్‌సైట్: https://www.mha.gov.in/ మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 1, 2025

నవంబరులో మామిడి తోటల పెంపకంలో జాగ్రత్తలు

image

అక్టోబరు ఆఖరు నుంచే మామిడి చెట్లకు నీరు పెట్టడం పూర్తిగా ఆపేయాలి. లేకుంటే చెట్ల రెమ్మల్లో కొత్త ఇగుర్లు వచ్చి పూత రాకుండా పోతుంది. పూత సరిగా రాని మామిడి చెట్లలో, పూత రావడానికి ఎథ్రిల్ అనే హార్మోను మందును సిఫారసు చేస్తారు. ఈ హార్మోనును నవంబరు నెల నుంచి డిసెంబర్ వరకు 2 వారాలకు ఒకసారి చొప్పున 4 సార్లు లీటరు నీటికి 2ml చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పూత సరిగా రాని చెట్లలో ఇది మంచి ఫలితాలనిస్తుంది.

News November 1, 2025

యూరియాకు గుళికలు కలిపి వాడుతున్నారా?

image

వరి సాగులో చాలా మంది రైతులు మొదటి దఫా యూరియా వేసేటప్పుడు బస్తా యూరియాకు 4-5 కిలోల గుళికల మందును కలిపి చల్లుతారు. పైరు బాగా పెరగడానికి యూరియా.. పురుగుల నివారణకు గుళికల మందు ఉపయోగపడుతుందనేది రైతుల భావన. కానీ పురుగుల కట్టడికి ఎకరాకు మందు రకాన్ని బట్టి 8-10 కిలోల గుళికలు అవసరం. తక్కువ వేస్తే పురుగులు వాటిని తట్టుకొని నిలబడతాయి. అందుకే రైతులు గుళికల మందు వాడకంలో వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం.