News June 9, 2024

కోహ్లీ అనుభవాన్ని మించింది ఏదీ లేదు: రోహిత్ శర్మ

image

వార్మప్ మ్యాచ్‌లో ఆడకపోయినా పాక్‌తో మ్యాచుకు ముందు కోహ్లీకి తగినంతగా ప్రిపరేషన్ టైమ్ దొరికిందని రోహిత్ శర్మ తెలిపారు. అతనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద టోర్నమెంట్‌లలో ఆడిన అనుభవం ఉందని, దానికి మించింది ఏదీ లేదని హిట్‌మ్యాన్ పేర్కొన్నారు. టీమ్‌లో ఏ ఒక్కరిపైనా తాము ఒత్తిడి పెట్టాలనుకోవట్లేదని, ఆటగాళ్లందరూ జట్టుకు తమ వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.

News June 9, 2024

రాజకీయం అరంగేట్రంలోనే శ్రీమంతుడికి అదృష్టం

image

AP: ఈ ఎన్నికల్లో పదునైన మాటలతో YCPని ఉక్కిరిబిక్కిరి చేసి TDP ఫైర్ బ్రాండ్‌‌గా పేరు తెచ్చుకున్నారు గుంటూరు MP పెమ్మసాని చంద్రశేఖర్. ఎన్నికైన తొలిసారే కేంద్ర సహాయమంత్రి పదవికి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈయన స్వస్థలం గుంటూరు(D) బుర్రిపాలెం. వైద్య (M.D)విద్యకై US వెళ్లిన ఆయన మెడికల్ స్టూడెంట్స్ కోసం ‘యూ వరల్డ్’ ఆన్‌లైన్ శిక్షణ సంస్థను స్థాపించారు. ఆ సంస్థ అనతి కాలంలోనే రూ.వేల కోట్లను ఆర్జించింది.

News June 9, 2024

ప్రమాణస్వీకారం ఎక్కడ జగన్: టీడీపీ సెటైర్లు

image

AP: ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని వైసీపీ చేసిన ప్రచారంపై టీడీపీ Xలో సెటైర్లు వేసింది. జూన్ 9న వైజాగ్‌లో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు YCP చేసిన పోస్టును షేర్ చేసింది. ‘ఎక్కడికి రావాలో చెప్తే మేం కూడా వస్తాం జగన్.. అసలుకే బస్సు, రైలు, ఫ్లైట్ టికెట్లు దొరకడం లేదు, హోటల్స్ అన్ని బుక్ అయిపోయాయని మీ బులుగు మీడియానే చెప్పింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

News June 9, 2024

తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు వీరేనా?

image

TG: కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కినట్లు సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు చోటు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరికీ PMO నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

News June 9, 2024

రాజ్‌ఘాట్‌లో మోదీ నివాళులు

image

మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ముందుగా ఆయన సైనిక అమరవీరులకు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించారు. అనంతరం మాజీ ప్రధాని వాజ్‌పేయీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. కాగా రాత్రి 7.15 గంటలకు మోదీ పీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

News June 9, 2024

మోదీ కేబినెట్‌లోకి అన్నామలై?

image

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీఎంవో అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో అన్నామలై ఓటమిపాలైనా రాష్ట్రాధ్యక్షుడిగా తమిళనాడులో పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించారు. గతంలో 3 శాతం మేర ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్‌ను 11 శాతానికి చేర్చారు. దీంతోనే ఆయనకు కేబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

News June 9, 2024

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి ఫోన్ కాల్స్

image

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన వారికి PMO నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌‌తో పాటు నితిన్ గడ్కరీ, మేఘ్‌వాల్, శర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్, షిండే వర్గం శివసేన నేత ప్రతాప్ రావ్ జాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామికి ఫోన్ కాల్స్ వచ్చాయి. నేడు వీరంతా ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News June 9, 2024

OFFICIAL.. OTTలోకి వచ్చేస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

image

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ ఈ నెల 14న OTTలోకి వస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. కృష్ణచైతన్య తెరకెక్కించిన ఈ మూవీ మే 31న విడుదలై 14 రోజుల్లోనే OTTలోకి రావడం గమనార్హం. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు.

News June 9, 2024

మారిన ఏపీ సీఎంవో ప్రొఫైల్ పిక్

image

AP: ట్విటర్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎంవో ప్రొఫైల్ పిక్ మారింది. మొన్నటి వరకు ఉన్న వైఎస్ జగన్ ఫొటోను అధికారులు తొలగించారు. కాబోయే సీఎం చంద్రబాబు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్‌గా మార్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుండటంతో ఏపీ సీఎంఓ ట్విటర్‌లో ఈ మార్పులు చేసింది. మార్పుల అనంతరం చంద్రబాబు ప్రమాణ స్వీకారంపైనే తొలి పోస్ట్ పెట్టారు.

News June 9, 2024

చంద్రబాబుకి ఒడిశా మాజీ సీఎం అభినందనలు

image

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ చీఫ్ చంద్రబాబుకి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఫోన్లో అభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన Xలో వెల్లడించారు. రాజకీయంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచి చంద్రబాబుతో తనకు అనుబంధం ఉందని రాసుకొచ్చారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ ప్రగతి సాధిస్తుందని ఆశిస్తున్నట్లు నవీన్ పేర్కొన్నారు.