India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రభుత్వ యూనివర్సిటీల ఉపకులపతులు హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించింది. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, ఎస్పీలను సంప్రదించి పరిష్కరించుకోవాలంది. శాఖాపరమైన సమస్యలకు ఉన్నత విద్యాశాఖను సంప్రదించాలంది. ఇటు ఆంధ్ర వర్సిటీలో కీలక దస్త్రాలు మాయం అని పత్రికల్లో వచ్చిన వార్తలను అవాస్తవమని రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
TG: రాష్ట్రంలో CS సహా IAS, IPS అధికారులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. CS శాంతికుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అటు డీజీపీ రవిగుప్తాను కొనసాగించే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన్ను కూడా బదిలీ చేయాలని భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, శివధర్ రెడ్డి ఉన్నారు. వారంలో బదిలీల జీవో రావొచ్చు.
T20WCలో భాగంగా నేడు ఇండియా, పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రా.8కు మ్యాచ్ ప్రారంభం కానుంది. US చేతిలో ఓడి పాక్ నిరాశలో ఉండగా, ఐర్లాండ్‌పై గెలుపుతో భారత్ ఉత్సాహంగా ఉంది. WCలో దాయాదిపై ఉన్న గెలుపు రికార్డును కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. అక్షర్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వస్తారని తెలుస్తోంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
TG: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు 3 నెలల్లో 140కిపైగా దరఖాస్తులు వచ్చాయని TGIIC వెల్లడించింది. ఎన్నికల కోడ్ ఎత్తేయగానే వాటిలో 113 కంపెనీలకు భూములు కేటాయించినట్లు తెలిపింది. ఈ సంస్థలతో రూ.2,200 కోట్ల పెట్టుబడులు, 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. వీటిలో మానే(ఫ్రాన్స్), APC(హాంకాంగ్), మలబార్ గోల్డ్ వంటి కంపెనీలున్నాయంది. మొత్తం భూకేటాయింపుల్లో 70% MSMEలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించింది.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ఇవాళ RFCలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఏర్పాట్లను పరిశీలించారు. పలువురు సీఎంలు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నందున పటిష్ఠ భద్రత కల్పించాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. కాగా ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు హాజరై నివాళులర్పించనున్నారు.
AP: నూతన CSగా బాధ్యతలు స్వీకరించిన నీరభ్ కుమార్ తన పని మొదలుపెట్టారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేసి తనకు సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు CMగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల భద్రత, వారి వాహనాల పార్కింగ్ సదుపాయాలపై దృష్టిపెట్టాలన్నారు.
TG: ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఇవాళ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. 31 జిల్లాల్లోని 897 కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. ఉ.10.30 నుంచి మ.ఒంటి గంట వరకు జరిగే ఈ ఎగ్జామ్‌ను 4.03 లక్షల మంది రాయనున్నారు. ఉ.10 తర్వాత పరీక్ష సెంటర్‌లోకి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలని <<13403624>>సూచించారు.<<>>
AP: సీఎంగా చంద్రబాబు 12న ప్రమాణస్వీకారం చేయనుండగా, మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, పయ్యావుల, నిమ్మల, నారాయణ, అయ్యన్, కొండ్రు మురళి, అనిత, గొట్టిపాటి రవి, డీబీవీ స్వామి పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి నాదెండ్ల, కొణతాల, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్, సుజనా పేర్లు పరిశీలనలో ఉన్నాయట. పవన్ కేబినెట్‌లో చేరుతారా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ఇవాళ రాత్రి 7.15 నుంచి 8 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు బీజేపీతో సహా ఎన్డీఏ పక్షాల నుంచి దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని NDTV వెల్లడించింది. హోమ్, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశాంగ మంత్రులుగా బీజేపీ నేతలే ఉంటారని తెలిపింది. మొత్తంగా కేంద్ర కేబినెట్ 78 నుంచి 81 మందితో కొలువుదీరనుందని పేర్కొంది.
అప్పుల్లో కూరుకుపోయి వడ్డీలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న వాటిని జాంబీ కంపెనీలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంస్థల సంఖ్య పదేళ్లలో 7వేలకు(USలోనే 2,000) చేరిందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. వీటి రుణాలు $1.1 ట్రిలియన్లని పేర్కొంది. ఈ కంపెనీలను రుణాల ఊబి నుంచి బయటపడేసేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభం వస్తుందంటున్నారు.
Sorry, no posts matched your criteria.