News June 9, 2024

బీజేపీకి చంద్రబాబు మద్దతు సరికాదు: కూనంనేని

image

TG: ఎన్డీయే ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు జోస్యం చెప్పారు. BJPకి సంపూర్ణ మెజార్టీ లేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన BJPకి చంద్రబాబు మద్దతు తెలపడం సరైన నిర్ణయం కాదని చెప్పారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారికి కాకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీలకు సపోర్టు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

News June 9, 2024

ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం

image

T20WCలో ఇంగ్లండ్‌పై ఆసీస్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు 7 వికెట్లు కోల్పోయి 201 స్కోర్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు. హెడ్ 34, వార్నర్ 39, మార్ష్ 35, మ్యాక్సీ 28, స్టొయినిస్ 30, టిమ్ డేవిడ్ 11, వేడ్ 17 రన్స్ చేశారు. తర్వాత ENG 20 ఓవర్లలో 165/6 స్కోర్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. సాల్ట్ 37, బట్లర్ 42, అలీ 25 మినహా అందరూ విఫలమయ్యారు.

News June 9, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

ఎద్దుకైనగాని యేడాది తెల్పిన
మాట దెలిసి నడచు మర్మమెఱిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: ఎద్దులకు ఏడాది శిక్షణ ఇస్తే మన మాటలను అర్థం చేసుకుని పనిచేస్తాయి. అయితే మూర్ఖుడికి 30 ఏళ్లు నేర్పినా బుద్ధి రాదు. వాడి మూఢత్వాన్ని మార్చుకోలేడు.

News June 9, 2024

జీవిత కాల గరిష్ఠానికి ఫారెక్స్ నిల్వలు

image

మే 31తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు $4.8 బిలియన్లు వృద్ధి చెంది $651.5 బిలియన్లకు చేరాయి. ఇది జీవితకాల గరిష్ఠం. గోల్డ్ రిజర్వు నిల్వల మొత్తం $212 మిలియన్ డాలర్లు తగ్గి $56.501 బిలియన్లకు పడిపోయాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(SDR) కూడా $17 మిలియన్లు తగ్గి $18.118 బిలియన్లకు చేరాయి.

News June 9, 2024

రేసులో ముందున్న ఈటల, డీకే అరుణ?

image

TG: కేంద్రంలో నరేంద్ర మోదీ కేబినెట్ రేపు కొలువుదీరే అవకాశముంది. పీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రి వర్గ కూర్పు చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్ కేంద్ర మంత్రుల రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కిషన్ రెడ్డికి మరోసారి బెర్త్ కన్ఫామ్ చేస్తారా లేదా ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లవైపు అధిష్ఠానం మొగ్గు చూపుతుందా అనేది రేపు క్లారిటీ రానుంది.

News June 9, 2024

జూన్ 9: చరిత్రలో ఈ రోజు

image

1947: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు జననం
1949: దేశంలో తొలి మహిళా ఐపీఎస్ కిరణ్‌ బేడీ జననం
1959: మాజీ ఎంపీ GV హర్షకుమార్ జననం
1964: భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రమాణం
1995: సమరయోధుడు, రైతు నేత NG రంగా మరణం
2011: ప్రముఖ చిత్రకారుడు MF హుస్సేన్ మరణం
2017: రాజకీయ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మరణం

News June 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 9, 2024

రేవ్ పార్టీ కేసు.. స్నిఫర్ డాగ్స్‌కి సన్మానం

image

సినీ ప్రముఖులు పాల్గొన్న బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్‌ను పట్టించిన స్నిఫర్ డాగ్స్‌కు పోలీసులు సన్మానం చేశారు. హెబ్బాగోడిలో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌హౌస్‌లో మే 19న ఈ పార్టీ జరిగింది. దీనిని భగ్నం చేసిన పోలీసులు డాగ్స్‌ని రంగంలోకి దింపారు. అవి ఆ వాసన పసిగట్టి చెట్ల పొదల్లో దాచిన డ్రగ్స్‌ను కనిపెట్టాయి. దీంతో వాటిని ఇవాళ ప్రత్యేకంగా అభినందించారు.

News June 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 9, 2024

చంద్రబాబు ప్రమాణం 12న ఉ.11.27 గంటలకే

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయం విషయంలో ఏపీ సీఎంవో X అకౌంట్‌లో పొరపాటు జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ నెల 12న ఉ.9.27 గంటలకు CBN ప్రమాణం చేస్తారని తొలుత ట్వీట్ చేశారు. కాసేపటికి దాన్ని డిలీట్ చేసి ఉ.11.27 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.