India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ఆదిపురుష్’లో రావణుడిని ఓ రౌడీలా చూపడం బాధించిందని రామాయణ్ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా అన్నారు. ‘శివ భక్తుడైన రావణుడిలో చాలా మంచి లక్షణాలున్నాయి. సీతను అపహరించడమే ఆయన చేసిన తప్పు. సీతను గులాబీ రంగు చీరలో చూపడం, రావణుడిని భిన్నమైన ఆహార్యంలో చూపడం నచ్చలేదు. సినిమాను కొంత చూసేసరికే తట్టుకోలేకపోయా. రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.
TG: గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారని TG CMO ట్వీట్ చేసింది. ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని తెలిపారని, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొంది. కాగా ఉదయం 10 గంటలలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TGPSC సూచించింది. రేపు జరిగే పరీక్ష కోసం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఎంపీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీపీ ఛైర్‌పర్సన్‌గా ఆమె పేరుతో పాటు గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, సుదర్శన్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో నేతలంతా సోనియావైపు మొగ్గుచూపారు.
NDA ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో చూస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, CAAను ఎత్తివేయాలని పార్లమెంటులో డిమాండ్ చేస్తామని మీడియాతో చెప్పారు. అన్ని రాష్ట్రాలకు పెండింగ్ నిధులను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేంద్రంలో INDIA కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా.. రేపు పరిస్థితి మారవచ్చని పేర్కొన్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో చిన్న జట్లు సంచలనాలు సృష్టిస్తున్నాయి. నాలుగు గ్రూపుల్లో మూడు చిన్న జట్లే టేబుల్ టాపర్లుగా ఉండటం దీనికి నిదర్శనం. గ్రూప్-ఏలో USA(4P), గ్రూప్-బీలో స్కాట్లాండ్(3P), గ్రూప్-సీలో అఫ్గానిస్థాన్(4P) టాపర్లుగా ఉన్నాయి. గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా(2P) తొలి స్థానంలో ఉంది. అయితే మ్యాచులు జరిగే కొద్ది టేబుల్ టాపర్లు మారే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
రామోజీరావు ఈనాడు పత్రికను 1974లో ప్రారంభించారు. అదే ఏడాది AUG 10న తొలి సంచిక వెలువడింది. రామోజీ మరణంతో ఈనాడు తొలి సంచిక ఫొటోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. USలో సంచలనం సృష్టించిన వాటర్ గేట్ వివాదంతో ఆ దేశ అధ్యక్షుడు నిక్సన్ రాజీనామా చేసిన వార్తను ’ఎట్టకేలకు నిక్సన్ నిష్క్రమణ‘ అంటూ తొలి పేజీలో ప్రధానంగా ప్రచురించారు. మరో 2 నెలల్లో ఈ పత్రిక ప్రచురణ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తి కానుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నెల జీతం రూ.1.66 లక్షలు. ఇందులో బేసిక్ పే రూ.50 వేలుగా ఉంది. అదనంగా.. ప్రధానికి ఖర్చుల నిమిత్తం రూ.3 వేలు, పార్లమెంటరీ భత్యం కింద రూ.45 వేలు చెల్లిస్తారు. వీటితో పాటు దినసరి భత్యం కింద రోజుకు రూ.2 వేలు అందుకుంటారు. ఉచిత నివాస సౌకర్యం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. ఆయన ప్రయాణాల ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. ప్రధాని రక్షణ బాధ్యతను SPG పర్యవేక్షిస్తుంది.
బెంగాల్‌లో BJP కార్యకర్తలపై దాడులు కలకలం రేపుతున్నాయి. TMC కార్యకర్తలు ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నట్లు BJP నేతలు వాపోతున్నారు. దాదాపు 10 వేల మంది BJP కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు పార్టీ ఆఫీసుల్లో తలదాచుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఎన్నికల్లో TMC 29, BJP 12 సీట్లలో నెగ్గాయి.
సీనియర్ నటుడు అర్జున్ సర్జా ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె ఐశ్వర్య ఈ నెల 10న పెళ్లి పీటలెక్కనున్నారు. పెళ్లి సంబరాల్లో భాగంగా ఇవాళ హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ డ్రెస్‌లతో అర్జున్ ఫ్యామిలీ సభ్యులు సందడి చేశారు. తమిళ నటుడు ఉమాపతి రామయ్యను ఐశ్వర్య పెళ్లాడుతున్నారు.
మోదీ 3.0 కేబినెట్‌లో JDU నుంచి ఇద్దరికి స్థానం కల్పించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. లలన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో లలన్ సింగ్(ముంగర్-బిహార్) MPగా గెలిచారు. రాజ్యసభ ఎంపీ అయిన రామ్‌నాథ్ భారతరత్న గ్రహీత కర్పూరి ఠాకూర్ కుమారుడు. కాగా రేపు మోదీ ప్రమాణస్వీకారానికి ముందు జరిగే సమావేశంలో వీరి ఎంపికపై క్లారిటీ రానుంది.
Sorry, no posts matched your criteria.