News June 8, 2024

రామోజీ మనందరికీ మార్గనిర్దేశకులు: ఎడిటర్స్ గిల్డ్

image

మీడియా మొఘల్ రామోజీరావు మృతి పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘రామోజీ మరణం విచారకరం. ఎన్నో విషయాల్లో ఆయన మనందరికీ మార్గనిర్దేశకులు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుంది’ అని ప్రకటనలో పేర్కొంది. కాగా రామోజీ 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

News June 8, 2024

రేపే గ్రూప్-1 ఎగ్జామ్.. అభ్యర్థులకు సూచనలివే..

image

TG: ఉదయం 10:30గంటల నుంచి 1గంట వరకు పరీక్ష జరుగుతుంది. 10 గంటలలోపు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు
➦ID కార్డు, హాల్‌టికెట్, ఫొటో తప్పనిసరి
➦అభ్యర్థులు చప్పల్స్‌లోనే రావాలి. బూట్లు ధరించకూడదు
➦బయోమెట్రిక్ వేలిముద్ర వేయాల్సి ఉండటంతో వేళ్లపై మెహెందీ/ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు
➦ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
➽➽మొత్తం 4.03 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.

News June 8, 2024

మేమేం తప్పు చేశామో అర్థం కావడం లేదు: భరత్

image

AP: రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని సంపాదించలేకపోయామని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ వాపోయారు. అసలు మేమేం తప్పు చేశామో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి మరోసారి జగనే సీఎం అవుతారని అనుకున్నాం. కానీ అనూహ్యంగా ఓటమిపాలయ్యాం. మా వ్యక్తిగత పనులను పక్కనపెట్టి మరీ ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడ్డాం’ అని ఆయన పేర్కొన్నారు.

News June 8, 2024

‘నీట్‌’ రిజల్ట్‌పై దుమారం.. NTA కీలక నిర్ణయం

image

దేశవ్యాప్తంగా నీట్-2024 ఫలితాలపై వివాదం ముదురుతుండటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. రిజల్ట్‌పై 1,600 మంది విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించాలని నిర్ణయించింది. దీని కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ వారి ఫిర్యాదులను విశ్లేషించనుంది. ఒకే సెంటర్‌లో ఆరుగురు టాపర్లు కావడం, 67 మందికి టాప్‌ ర్యాంకు రావడంతో ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

News June 8, 2024

మోదీ ప్రమాణ స్వీకారానికి ముయిజ్జు

image

ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి పలువురు విదేశీ అతిథులు హాజరుకానున్నారు. వారిలో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు, బంగ్లా ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ ప్రచండ, భూటాన్ ప్రధాని సెరింగ్ టోబ్గే, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్ తదితరులు ఉన్నారు. ఇప్పటికే వీరిలో కొంతమంది ఇండియాకు చేరుకున్నారు.

News June 8, 2024

BJP అట్టిపెట్టుకునే కీలక శాఖలు ఇవేనా?

image

కేంద్రంలో బీజేపీ కొన్ని కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. హోమ్, ఫైనాన్స్, డిఫెన్స్, విదేశాంగ, రైల్వేలు, రోడ్లు రవాణా, న్యాయ, ఐటీ, విద్యాశాఖలను తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు దాదాపు 12 నుంచి 15 మంత్రిత్వ శాఖలను కేటాయించనున్నట్లు టాక్. జేడీయూ పార్టీకి 2, తెలంగాణ బీజేపీకి 3, ఒడిశాకు 6 నుంచి 7 మంత్రి పదవులు కేటాయించనుందట.

News June 8, 2024

అమెరికా క్రికెటర్ సౌరభ్‌పై ఒరాకిల్ స్పెషల్ ట్వీట్

image

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు ‘సూపర్’ షాకిచ్చిన USA క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ హీరో అయ్యారు. దీంతో అతడి పేరు నెట్టింట మార్మోగుతోంది. తాజాగా సౌరభ్ పనిచేస్తున్న ఒరాకిల్ సంస్థ సైతం స్పందించింది. ‘అమెరికా క్రికెట్ జట్టుకు శుభాకాంక్ష‌లు. మా ఇంజినీర్‌, క్రికెట్ స్టార్ సౌర‌భ్ ప్రదర్శనపై గర్వంగా ఉంది’ అని ఒరాకిల్ ట్వీట్ చేసింది. ముంబైకి చెందిన సౌరభ్ 2010లో భారత్ తరఫున U-19 వరల్డ్ కప్‌లో ఆడారు.

News June 8, 2024

నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదు: డీజీ సుబోధ్

image

నీట్ పరీక్ష పేపర్ లీక్ అవ్వలేదని NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ పునరుద్ఘాటించారు. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 కేంద్రాల్లో కొందరికి ప్రశ్నాపత్రాలు తప్పుగా పంపిణీ చేసినట్లు గుర్తించామన్నారు. అభ్యర్థుల గ్రేస్ మార్కులు అర్హతను ప్రభావితం చేయలేదన్నారు. దీనిపై ప్యానెల్ సమీక్ష నిర్వహిస్తోందని, వారం రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.

News June 8, 2024

రాష్ట్రంలో 2 రోజులు సంతాప దినాలు

image

AP: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి నివాళిగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రామోజీ అంత్యక్రియలు రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనుంది.

News June 8, 2024

రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: CBN

image

యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మరారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. ’40 ఏళ్లుగా నాకు ఆయన పరిచయం. మీరు ఏం చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పని చేస్తానని చెప్పేవారు. ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతం. నాకు క్లిష్టమైన సమస్య వస్తే రామోజీ ధైర్యం చెప్పేవారు’ అని గుర్తు చేసుకున్నారు.