News June 6, 2024

వైసీపీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం

image

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని వేరే చోటుకు మార్చాలని జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలో తన నివాసం పక్కనున్న క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చాలని సూచించారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని జగన్ వైసీపీ ముఖ్య నేతలను ఆదేశించారు.

News June 6, 2024

EMIల రూపంలో లంచాలు

image

గుజరాత్‌లో కొందరు అధికారులు లంచాలను EMIల రూపంలో స్వీకరిస్తున్నారని ఆ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో DGP షంషేర్ సింగ్ చెప్పారు. ‘CID క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఓ వ్యక్తి నుంచి నెలకు ₹10వేల చొప్పున ₹50 వేలు కోరాడు. మరో అధికారి ఓ కాంట్రాక్టర్ నుంచి నెలకు ₹30 వేల చొప్పున ₹1.20 లక్షలు ఇవ్వాలన్నారు. బాధితులు పలు కేసుల్లో నిందితులుగా ఉండటంతో ఫిర్యాదు చేయలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు.

News June 6, 2024

తెలుగు రాష్ట్రాల ఎంపీల వద్దే అత్యధిక ఆస్తులు

image

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీల్లో 93 శాతం మిలియనీర్లు ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 543 మంది ఎంపీల్లో ఈ సంఖ్య 504గా ఉందని తెలిపింది. టాప్-3లో టీడీపీ ఎంపీ చంద్రశేఖర్(AP-రూ.5,705 కోట్లు), బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(TG-రూ.4,568 కోట్లు), నవీన్ జిందాల్(హరియాణా-రూ.1,241 కోట్లు) ఉన్నారని పేర్కొంది. 2019లో 475 మంది మిలియనీర్లు MPలుగా ఉండగా, 2014లో 443 మంది ఉన్నారు.

News June 6, 2024

బీజేపీ కొత్తగా గెలిచిన 32 సీట్లు ఎక్కడంటే?

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 32 సీట్లను కొత్తగా గెలుచుకుంది. ఒడిశాలో 12, తెలంగాణలో 4, మహారాష్ట్ర, ఏపీలో 3 చొప్పున, బెంగాల్‌లో 2, బిహార్, దాద్రా నగర్ హవేలీ, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఒక్కో స్థానంలో విజయం సాధించింది. కాగా ఈసారి బీజేపీ 240 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే.

News June 6, 2024

ఎన్నికైన 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు: ADR

image

ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. అందులో 170 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు(అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు) ఉన్నాయంది. అలాగే మొత్తం 543 మంది ఎంపీలనుగాను 504(93 శాతం) మంది కోటీశ్వరులని పేర్కొంది. ఎన్నికైన మొత్తం ఎంపీల సగటు ఆస్తి రూ.46.34 కోట్లని తెలిపింది.

News June 6, 2024

T20WC: భారత్-పాక్ వేదిక మార్పు: ఐసీసీ క్లారిటీ?

image

T20WCలో భాగంగా ఈ నెల 9న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగే వేదికను మారుస్తారని.. న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా లేదా టెక్సాస్‌కు తరలిస్తారని వదంతులు వస్తున్నాయి. దీనిపై ICC స్పందించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్‌లను తరలించే అవకాశమే లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వేదికలను మార్చే ప్రణాళికలు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా న్యూయార్క్ పిచ్‌పై BCCI ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

News June 6, 2024

BREAKING: TDP దాడులను అడ్డుకోండి.. CJIకి బాధితుల లేఖ

image

AP: కౌంటింగ్ తర్వాత టీడీపీ, జనసేన నేతలు తమపై దాడులు చేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలు CJI చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఎక్కడెక్కడ దాడులు జరిగాయనే దానిపై ఫొటోలు, వీడియో ఆధారాలను జత చేశారు. తక్షణమే ఈ అంశాలపై సుమోటోగా విచారించాలని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 48 గంటలుగా విపరీతంగా దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని లేఖలో పేర్కొన్నారు. దాడులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News June 6, 2024

శరద్ పవార్‌తో టచ్‌లోకి అజిత్ వర్గ ఎమ్మెల్యేలు?

image

మహారాష్ట్రలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన, NCPలను చీల్చిన శిండే, అజిత్ పవార్‌లకు ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు <<13389216>>షాకివ్వడంతో<<>> ఆ వర్గ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. అజిత్ వర్గానికి చెందిన 10-15 మంది MLAలు శరద్ పవార్‌తో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. శిండే వర్గ నేతలు కూడా ఉద్ధవ్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది OCT-SEPలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆలోపు ఏమైనా జరగొచ్చని విశ్లేషకుల అంచనా.

News June 6, 2024

గవర్నర్‌ను కలిసిన YCP నేతలు

image

AP: గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. కౌంటింగ్ తర్వాత వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News June 6, 2024

ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి

image

AP: మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ నరసరావుపేటలోని SP ఆఫీసుకు వచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ సంతకం చేసి వెళ్లారు. EVM ధ్వంసంతో పాటు 3 కేసుల్లో అరెస్టు నుంచి పిన్నెల్లికి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై TDP సుప్రీంకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్‌ పొడిగించకుండా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి.