News June 6, 2024

జూన్ 6: చరిత్రలో ఈరోజు

image

1877: మలయాళ కవి ఉళ్లూర్ పరమేశ్వర అయ్యర్ జననం
1890: అస్సాం తొలి సీఎం గోపినాథ్ బొర్దొలాయి జననం
1915: కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జననం
1926: రచయిత, కవి గోపగారి రాములు జననం
1929: సినీ నటుడు, రాజకీయవేత్త సునీల్ దత్ జననం
1936: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జననం
1947: హాస్యనటుడు సుత్తి వీరభద్రరావు జననం
2015: సినీనటి ఆర్తీ అగర్వాల్ మరణం

News June 6, 2024

బోయింగ్ ప్రయోగం సక్సెస్.. రోదసిలోకి సునీత

image

భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఆధ్వర్యంలోని బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగం ఎట్టకేలకు సక్సెస్ అయింది. సాంకేతిక కారణాలతో రెండుసార్లు ప్రయోగం వాయిదా పడగా బుధవారం స్పెస్‌క్రాఫ్ట్ విజయవంతంగా లాంచ్ అయింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను చేరుకోనుంది. కాగా బోయింగ్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగంలో పాల్గొన్న తొలి మహిళగా సునీత నిలిచారు.

News June 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 6, 2024

రాహుల్ గాంధీ ఏ సీటును వదులుకుంటారు?

image

వయనాడ్, రాయ్‌బరేలీలో రాహుల్ ఏ స్థానాన్ని వదులుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. వయనాడ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF బలంగా ఉండగా, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోంది. రాహుల్ రాయ్‌బరేలీ వదులుకుంటే ఉపఎన్నికలో ప్రియాంకను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ఎన్నికల ముందు జైరాం రమేశ్ కూడా ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించడంతో రాహుల్ ఈ స్థానాన్నే వదులుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News June 6, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 6, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:15 గంటలకు అసర్: సాయంత్రం 4:51 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:49 గంటలకు ఇష: రాత్రి 8.10 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 6, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 6, గురువారం
బ.అమావాస్య: రాత్రి 07.55 గంటలకు
రోహిణి: రాత్రి 10:16 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.09:56 నుంచి 10:48 వరకు తిరిగి మధ్యాహ్నం గం.03.07 నుంచి 03.59 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.12.36 నుంచి 02.08 వరకు

News June 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 6, 2024

TODAY HEADLINES

image

*NDA పక్షనేతగా మోదీ.. చంద్రబాబు సహా 20 మంది నేతల మద్దతు
*ఈ నెల 9న మోదీ, 12న చంద్రబాబు ప్రమాణం!
*మోదీ నైతికంగా ఓడిపోయారు: ఖర్గే
*చంద్రబాబు పిలిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తా: సీఎం రేవంత్
*అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటాం: పవన్
*సజ్జల సహా 20 మంది సలహాదారుల రాజీనామా
*ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి BRS సపోర్ట్: అసదుద్దీన్
*లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ రద్దు

News June 5, 2024

బోయపాటికి CBN ప్రమాణ స్వీకార ఈవెంట్ బాధ్యతలు?

image

AP: ఏపీ సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ బాధ్యతలను డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ఆయన ప్రారంభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా బాలయ్య, చంద్రబాబుకి బోయపాటి సన్నిహితుడనే విషయం తెలిసిందే.

News June 5, 2024

NOTAకు 63 లక్షల ఓట్లు!

image

లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బిహార్‌లో 8.97లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34లక్షలు, మధ్యప్రదేశ్‌లో 5.32L, ప.బెంగాల్‌లో 5.22L, తమిళనాడులో 4.61లక్షలు, గుజరాత్ లో 4.49లక్షలు, మహారాష్ట్రలో 4.12L, ఏపీలో 3.98L, ఒడిశాలో 3.24లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. 2019 ఎన్నికల్లో 65.22L ఓట్లు పడగా, ఈసారి ఆ సంఖ్య 2L తగ్గింది.