News June 5, 2024

528 రోజుల తర్వాత భారత జెర్సీలో పంత్

image

భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 528 రోజుల తర్వాత టీమ్ ఇండియా జెర్సీలో మెరిశారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. కాగా 2022 డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత ఆయన దాదాపు ఏడాదిన్నరపాటు క్రికెట్‌కు దూరమయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో మళ్లీ బ్యాట్ పట్టారు. ఆ తర్వాత వరల్డ్ కప్‌నకు ఎంపికయ్యారు.

News June 5, 2024

YCP ఘోర ఓటమి.. టీడీపీ సెటైరికల్ ట్వీట్

image

AP: వైసీపీ ఘోర ఓటమిపై తెలుగుదేశం పార్టీ సెటైరికల్ ట్వీట్ చేసింది. గులకరాయి డ్రామా విఫలమైందంటూ ఓ ఫొటోను పోస్ట్ పెట్టింది. ‘గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆ పార్టీకి మధ్యలో 5 పోయి 11 సీట్లే మిగిలాయి. ఇది ప్రజల స్క్రిప్ట్’ అని పేర్కొంది.

News June 5, 2024

జనసేనకు 6 మంత్రి పదవులు?

image

AP: రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో జనసేనకు 6 మంత్రి పదవులు దక్కవచ్చని తెలుస్తోంది. జనసేన చీఫ్ పవన్‌ను డిప్యూటీ CM పదవి వరించవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేనానితోపాటు మరో ఐదుగురికి మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. మంత్రి పదవుల రేసులో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేశ్, బుద్ధ ప్రసాద్, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం.

News June 5, 2024

భూగర్భజలాలు 3.5డిగ్రీలు వేడెక్కుతాయి: అధ్యయనం

image

శతాబ్ధం చివరినాటికి భూగర్భ జలాలు 2-3.5డిగ్రీల వరకు వేడెక్కుతాయని ఓ పరిశోధన తెలిపింది. దీనివల్ల నీటినాణ్యత, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. జర్మనీలోని కార్ల్స్‌రుహ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం భూగర్భ జలాలపై ఎలా ఉంటుందో వివరించింది.

News June 5, 2024

ఈ నెల 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం

image

ఈ నెల 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొత్త మంత్రివర్గంతో ప్రమాణం చేయించనున్నారు. బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని పలు పార్టీల ఎంపీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

News June 5, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?

image

ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 9నే ప్రమాణం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అటు ఈ నెల 9న ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది.

News June 5, 2024

కోహ్లీకి ఇదే లాస్ట్ ఛాన్స్ కాదు: క్రిస్ శ్రీకాంత్

image

విరాట్ కోహ్లీ 2026 T20 WCలో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ‘విరాట్ ఫిట్‌నెస్ బాగుంది. అతనికి ఇదే లాస్ట్ ఛాన్స్ కాదు. 2026 WCలోనూ ఆడగలడు. ఆ టోర్నీ ఇండియాలో జరగనుంది. కాబట్టి స్వదేశంలో ఆడేందుకు ఏ ఆటగాడైనా ఆసక్తి చూపుతారు. కోహ్లీ ఖాతాలో ఇప్పటివరకు T20 WC లేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని రోహిత్‌తో పాటు అతను కూడా కసిగా ఉన్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

News June 5, 2024

T20 WC: టాస్ గెలిచిన భారత్.. టీమ్ ఇదే

image

టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్: రోహిత్ (C), కోహ్లీ, పంత్, సూర్య, శివమ్ దూబే, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బుమ్రా, అర్ష్‌దీప్.
ఐర్లాండ్: ఆండీ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (C), టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, మెక్‌కార్తీ, బెన్ వైట్, జోష్ లిటిల్.

News June 5, 2024

ఎల్లుండి మరోసారి NDA భేటీ

image

ఎల్లుండి మరోసారి భేటీ కావాలని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు హాజరుకానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత ఈ మీటింగ్ ఉండనుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీయే నేతలు ఎల్లుండి రాష్ట్రపతిని కోరనున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకారం, 10 లేదా 11న చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉంది.

News June 5, 2024

కూటమి సునామీలోనూ గెలవలేని దురదృష్టవంతులు వీరే!

image

AP: కూటమి ప్రభంజనంలోనూ కొందరిని దురదృష్టం వెంటాడింది. ఇంతటి వేవ్‌లోనూ వారు YCP అభ్యర్థులపై ఓటమి చవిచూశారు. వారిలో ఎరిక్షన్ బాబు (Y.పాలెం), గొట్టిపాటి లక్ష్మీ (దర్శి), బీటెక్ రవి (పులివెందుల), రామచంద్రారెడ్డి (పుంగనూరు), జయచంద్రారెడ్డి (తంబళ్లపల్లి), బాలసుబ్రమణ్యం (రాజంపేట), బొజ్జ రోషన్న (బద్వేలు), వీరభద్రగౌడ్ (ఆలూరు), రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), రాజారావు (అరకు), గిడ్డి ఈశ్వరి (పాడేరు ) ఉన్నారు.