News June 4, 2024

ప.గో.లో కూటమి క్లీన్‌స్వీప్

image

AP: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు చరిత్ర సృష్టించారు. ఉమ్మడి జిల్లాలోని 15 స్థానాల్లో అన్నిచోట్ల విజయదుందుభి మోగించారు. జనసేన 6 చోట్ల, టీడీపీ 9 చోట్ల పోటీచేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ 13, టీడీపీ 2 చోట్ల గెలుపొందింది.

News June 4, 2024

తెలంగాణలో బీజేపీ టార్గెట్ 2029!

image

TGలో BJP అంచలంచెలుగా ఎదుగుతోంది. రాజకీయంగా తన ఓటు బ్యాంకును మరింత పెంచుకుంటోంది. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టు బిగిస్తోంది. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని పటిష్ఠం చేసి ప్రస్తుత ఎన్నికల్లో 8 సీట్లను గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుస్తుందని భావించినప్పటికీ వ్యూహాత్మక తప్పిదాలతో అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుని 2029 లక్ష్యంగా ముందుకు వెళ్లాలనుకుంటోంది.

News June 4, 2024

మంత్రి బొత్స సత్యనారాయణ ఓటమి

image

AP: ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్సపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు 11,527 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,498 ఓట్ల తేడాతో బొత్స విజయం సాధించారు. చీపురుపల్లి నుంచి 2004, 2009, 2019లో విజయం సాధించిన బొత్సకు ఈసారి ఓటమి తప్పలేదు.

News June 4, 2024

మంత్రి రోజా ఓటమి

image

AP: కూటమి సునామీలో మంత్రి రోజా కొట్టుకుపోయారు. సొంత పార్టీలోనే వ్యతిరేకత మధ్య నగరి బరిలో నిలిచిన ఆమె టీడీపీ అభ్యర్థి భాను ప్రకాశ్ చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి రౌండ్ నుంచీ మంత్రి రోజాపై భాను ప్రకాశ్ ఆధిక్యం చూపారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతితో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన భాను తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

News June 4, 2024

తెలంగాణలో MPలుగా గెలిచింది వీరే..

image

BJP: G.నగేశ్(ADB), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), బండి సంజయ్(KNR), ఈటల రాజేందర్(మల్కాజిగిరి), డీకే అరుణ(MBNR), విశ్వేశ్వర్‌రెడ్డి(చేవెళ్ల), రఘునందన్(మెదక్), కిషన్‌రెడ్డి(సికింద్రాబాద్).
కాంగ్రెస్: రఘువీర్‌రెడ్డి(NLG), రఘురామ్ రెడ్డి(KHM), కడియం కావ్య(WGL), బలరామ్ నాయక్(MHBD), మల్లు రవి(నాగర్ కర్నూల్), కిరణ్ కుమార్(భువనగిరి), సురేశ్ షెట్కార్(జహీరాబాద్), వంశీకృష్ణ(పెద్దపల్లి)
MIM: అసదుద్దీన్(HYD)

News June 4, 2024

ఇండియా కూటమి వెనుక యూట్యూబర్స్!

image

ఇండియా కూట‌మి ఈ స్థాయిలో ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌డం వెనుక సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కీల‌క‌పాత్ర పోషించారు. NDA ప్ర‌జా వ్య‌తిరేక విధానాల్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డంలో యూట్యూబ‌ర్‌ ధృవ్ రాఠీ కీల‌క‌ంగా వ్యవహరించారు. ప్రజా స‌మ‌స్య‌లు, పాల‌నా వైఫ‌ల్యాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో డా.మెడూసా, ర్యాంటింగ్ గోలా, క‌బీరాన్‌, గ‌రీమా, నేహా సింగ్, అర్పిత్ శ‌ర్మ‌, ముఖేష్ మోహ‌న్ ముందున్నారు.

News June 4, 2024

BIG SHOCK: అయోధ్యలో BJP ఓటమి

image

UPలో BJPకి ఆదరణ తగ్గింది. 80 MP స్థానాలున్న ఈ రాష్ట్రంలో కమలం వరుసగా రెండోసారి అధికారంలో ఉన్నా ఇప్పుడు 45 స్థానాలకు పరిమితమైంది. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా పార్టీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారిన అయోధ్య రామ మందిరం గల ఫైజాబాద్ MP స్థానంలోనూ పరాభవం ఎదురైంది. అక్కడ కమలం గుర్తుతో బరిలోకి దిగిన లల్లూ సింగ్ SP అభ్యర్థి అవదీశ్ ప్రసాద్ చేతిలో ఓడారు. సమాజ్‌వాదీ నేత 45 వేల ఓట్లకు పైగా మెజార్టీలో గెలుపొందారు.

News June 4, 2024

గాయపడిన రాష్ట్రాన్ని గాడిన పెట్టండి: చిరంజీవి

image

AP: చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ‘ఈ మహత్తర విజయం రాష్ట్రానికి గత వైభవం తిరిగి తెచ్చిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీరు, పవన్, ప్రధాని మోదీపై ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్-1గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News June 4, 2024

చంద్రబాబు, పవన్‌కు నాని విషెస్

image

ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌కి హీరో నాని విషెస్ తెలిపారు. ‘ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్‌కి అభినందనలు. అవమానాలను ఎదుర్కొంటూ పోరాడి గెలిచిన తీరు ఎంతో మందికి పాఠం. మీ విజయం చూస్తుంటే గర్వంగా ఉంది సర్. మీరు మరింత ఎత్తుకు చేరుకోవాలని, మీ పనితో పలువురికి ఉదాహరణగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 4, 2024

డియర్ కళ్యాణ్ బాబు.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: చిరంజీవి

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ కళ్యాణ్ బాబు.. నువ్వు తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే అన్నగా గర్వంగా వుంది. నువ్వు Game Changerవే కాదు, Man of the matchవి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.