India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీలో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ వెనుకంజలో ఉంది. పోటీ చేసిన 80 స్థానాల్లో ఏ ఒక్క చోట మెజారిటీలో లేకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో BSP ఎన్డీఏతో గానీ INDIA కూటమితో గానీ పొత్తు లేకుండా బరిలోకి దిగింది. దీంతో ప్రధాన కూటముల వైపు మొగ్గు చూపిన ఓటర్లు బీఎస్పీని పట్టించుకోనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకున్న BSP ఈసారి సున్నాకే పరిమితమవుతుందని ట్రెండ్‌ను చూస్తే అర్థమవుతోంది.
వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీకి ఆశించిన మెజారిటీ రావడం లేదు! అజయ్ రాయ్ ఆయనకు గట్టి పోటీనే ఇచ్చారు. ఈసీ ప్రకారం మోదీ 1,53,989 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 5,85,561 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి 4,31,572 ఓట్లు రావడం విశేషం. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి జమాల్ లారీకి 32 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. ఇంకా ఇక్కడ ఎన్ని రౌండ్ల లెక్కింపు ఉంటుందో తెలియాల్సి ఉంది.
AP: బాపట్లలో టీడీపీ అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ 26,800 మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 88,827 ఓట్లు పోలయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 20,480 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 1,11,175 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు తూర్పులో టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ 31351 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వెళ్లారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలపై ఆయనతో మాట్లాడారు. మరోసారి అధికారం చేపట్టేందుకు ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో సమన్వయంపై వారు ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం వీరంతా పార్టీ సెంట్రల్ ఆఫీస్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
AP: హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి దీపికపై 31,602 ఓట్ల తేడాతో గెలిచారు. ఇది ఆయనకు హ్యాట్రిక్ విజయం.
APలో మెజార్టీ సీట్లలో విజయంతో ప్రభుత్వ ఏర్పాటుకు NDA కూటమి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థ్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. NDA కూటమి రాష్ట్రంలో ఘన విజయం సాధించడంపై CBNను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 1.38 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ లభించింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BRS నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేశారు.
సికింద్రాబాద్‌లో వరుసగా రెండోసారి కిషన్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుపై 65వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
మహారాష్ట్రలో 6 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ నెలకొంది. అమరావతి, బీడ్, భండారా-గోండియా, ముంబై నార్త్-వెస్ట్, సతారా, హత్కనంగలే స్థానాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 48 సీట్లలో ఇండియా కూటమి 27, NDA 20 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన విజయం దిశగా దూసుకెళ్తున్నారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి ఆయన పోటీ చేశారు. 3 గంటల ప్రాంతంలో 6,50,399 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ప్రకారం ఆయనకు 8,58,197 ఓట్లు వచ్చాయి. మరికొద్ది సేపట్లో ఆయన గెలుపు వార్తలు రావొచ్చు. కాగా గుజరాత్‌లో బీజేపీ 26కు 25 సీట్లలో దుమ్మురేపుతోంది.
Sorry, no posts matched your criteria.