India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చంద్రబాబు కేంద్రంలో మళ్లీ కింగ్ మేకర్ అయ్యే అవకాశముందని జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇండియా కూటమి 250 సీట్ల వద్ద ఆగిపోతే తదుపరి ప్రభుత్వం సహా ప్రధాన మంత్రిని నిర్ణయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించవచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన డిమాండ్లను సాధించుకొని ఒక వేళ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపితే ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందనుండటంతో టాలీవుడ్ హీరో నితిన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి నేను ఓ అభిమానిగా, సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నా. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మా పవర్ స్టారే.. మీకిప్పుడు మరింత పవర్ లభించనుంది’ అని ట్వీట్ చేశారు.
ఉమ్మడి విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో YCP 9 స్థానాలకు 9 స్థానాలను కైవసం చేసుకోగా.. టీడీపీకి శూన్య హస్తమే మిగిలింది. 2024లో ఇక్కడి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. YCP అభ్యర్థులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకతకు కారణం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల పట్టుదల, ప్రణాళిక ఇప్పుడు అధికారం తెచ్చి పెడుతోందని క్రికెటర్ హనుమా విహారి తెలిపారు. ‘ఘన విజయం దిశగా సాగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌కు అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘కర్మ ఎప్పుడూ విఫలం కాదు’ అంటూ వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు.
AP: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకబడ్డారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 64,953 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 5,281 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఈసారి ఏపీలో వైసీపీ గెలుస్తుందన్న ఆరా మస్తాన్ ఉన్నట్లుండి మాయమైనట్లు సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఫలితాల ఆరంభంలో ఓ ఛానల్ లైవ్‌లో పాల్గొన్న ఆరా సర్వే సారథి ఉన్నట్లుండి కన్పించకుండాపోయారు. దీంతో సమాధానం చెప్పుకోలేకనే బయటకు వెళ్లిపోయినట్లు టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ఇస్తే ప్రస్తుతం వైసీపీ 14 సీట్లలోనే ఆధిక్యంలో ఉంది.
AP అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో టీడీపీ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీని పార్టీ నేతలు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 9న రాజధాని అమరావతి కేంద్రంగా సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ, విభజిత రాష్ట్రం కలిపి ఇప్పటివరకు 3 సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వహించిన ఆయన 4వ సారి బాధ్యతలు చేపట్టనున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అంచనాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ పార్టీ ఆధిక్యం భారీగా తగ్గిపోయింది. సర్వేలు కూడా ఎన్డీఏకు అనుకూలంగా వచ్చినా ఓటర్లు మాత్రం ప్రాంతీయ పార్టీలకు, INDIA కూటమికి అనుకూలంగా ఓటేసినట్లు ట్రెండ్స్ సాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ 296, INDIA కూటమి 228 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
తెలంగాణలో మరోసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలే ఫలితాల రూపంలో నిజమవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పగా అలాగే ఆ పార్టీ అధికారం చేపట్టింది. ఇప్పుడు అవే ఎగ్జిట్ పోల్స్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, BJP మధ్యే పోటీ అని అంచనా వేశాయి. ప్రస్తుత ఆధిక్యాల తీరు చూస్తుంటే మరోసారి సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్, BJP చెరో 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.
ఇండియా కూటమి అనూహ్య రీతిలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండడం వెనుక అనేక ఫ్యాక్టర్స్ పనిచేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను ఈ ఎన్నికల్లో అజెండాగా ఎత్తుకొని ప్రయోజనం పొందడంలో కొంతవరకు సక్సెస్ అయ్యింది. ఇక ఈ ఎన్నికల్లో 2014, 2019లో మాదిరి బీజేపీ ఒక బలమైన నెరేటివ్‌ని సెట్ చేయలేకపోవడం కూడా ఇండియా కూటమికి లాభించింది.
Sorry, no posts matched your criteria.