India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: గత అసెంబ్లీ ఎన్నికల్లో <<13372262>>రాయలసీమ<<>> జిల్లాల నుంచి 52 సీట్లకుగాను వైసీపీకి ఏకంగా 49 సీట్లు రాగా, ఈసారి పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లాలోనూ ఆరు చోట్ల వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. 4 జిల్లాల్లో 40+ స్థానాల్లో కూటమి నేతలు లీడింగులో కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే సరికి దాదాపుగా ఇవే రిజల్ట్స్ ఉంటాయని అంచనా.
సౌతిండియాలో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీకి తమిళ ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 39 స్థానాలుండగా BJP 19 చోట్ల పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలోనూ లీడింగ్‌లో కొనసాగడం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా వెనుకంజలో కొనసాగుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం BJP మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అలాగే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (272) సాధించకపోతే బాబు కీలకంగా మారుతారు. ఎందుకంటే 16 సీట్లతో ఇప్పుడు ఎన్డీయేలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించేలా ఉంది. ఢిల్లీలో మోదీ అధికారంలో ఉంటే ఏపీకి ప్రాధాన్యం ఇవ్వకతప్పదు.
మెదక్‌లో BRS, BJP మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. పదో రౌండ్‌లో ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 679 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అంతకు కొద్దిసేపటి క్రితం బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆధిక్యం సాధించి, మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు.
AP: కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఆదిమూలపు సురేశ్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి డీబీవీ స్వామి 699 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే కనిగిరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ 662 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెనుకంజలో ఉన్నారు. గిద్దలూరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి 692 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
AP: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజనీ వెనుకంజలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి 5745 ఓట్ల ముందంజలో ఉన్నారు. గురజాలలో టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ 19వేల ఓట్లు, అమరావతి ప్రాంతమైన తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ 18,272 ఓట్ల భారీ ఆధిక్యంలో ఉన్నారు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 6,969 ఓట్ల ముందంజలో ఉన్నారు.
రాజస్థాన్ ఒంటె ఎటువైపు తిరిగిందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2019 ఎన్నికల్లో రాజస్థాన్‌ను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక్కడి 25 స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 11, ఇతరులు 3 స్థానాల్లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఎర్లీ ట్రెండ్స్ ఉండడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ లీడింగ్‌లో కొనసాగుతోంది. 42 స్థానాల్లో TMC 24 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 16 చోట్ల, కాంగ్రెస్ కూటమి 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలు, బీజేపీ 18 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
AP: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తుండటంపై మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంలో నారా లోకేశ్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది’ అని ట్వీట్ చేశారు.
AP: సర్వేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్దన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. అలాగే మార్కాపురంలో టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి 1029 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు వెనకంజలో ఉన్నారు. సంతనూతలపాడులో విజయ్ కుమార్ 7940 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.