News June 4, 2024

ఎస్టీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ డీలా

image

AP: ఎస్టీ నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ చతికిలపడింది. రాష్ట్రంలో ఏడు ఎస్టీ రిజర్వుడు(పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పోలవరం) నియోజకవర్గాలున్నాయి. వీటిలో ప్రస్తుతం పాలకొండ, అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. మిగతా చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాగా గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను వైసీపీ గెలుచుకుంది.

News June 4, 2024

నవ్వుతున్న PHOTO పోస్ట్ చేసిన మంత్రి రోజా

image

AP ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న వేళ మంత్రి రోజా Xలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘భయాన్ని విశ్వాసంగా, ఎదురుదెబ్బలను మెట్లుగా, మన్నింపులను నిర్ణయాలుగా, తప్పులను పాఠాలుగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అని ఈ ఉదయం Xలో ఆమె చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో నగరి నుంచి ఆమె ఓటమి దిశగా పయనిస్తున్నారు.

News June 4, 2024

ఆ మూడు రాష్ట్రాలే ఆదుకుంటున్నాయి

image

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీలో మూడు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో క్లీన్‌స్వీప్ దిశగా సాగుతుండగా, గుజరాత్‌లో 24 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. బిహార్‌లోనూ NDA కూటమి 30కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమిపై మెజారిటీలో ఈ రాష్ట్రాల్లోని ఆధిక్యమే(దాదాపు 80 స్థానాలు) కీలకంగా ఉంది.

News June 4, 2024

హ్యాట్రిక్ కొట్టిన నిమ్మల

image

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మూడో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. అటు ఇప్పటికే రాజమహేంద్రవరం రూరల్, సిటీల్లోనూ టీడీపీ గెలిచింది. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు.

News June 4, 2024

ప్రకాశంలో 11 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం

image

AP: ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 స్థానాలకుగానూ 11 సీట్లలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అద్దంకి (TDP) 7318, చీరాల (TDP) 6440, దర్శి (TDP) 305, గిద్దలూరు(TDP) 447, కందుకూరు (TDP) 2729, కనిగిరి (TDP) 992, కొండపి (TDP) 3078, మార్కాపురం (TDP) 4559, ఒంగోలు (TDP) 4022, పర్చూరు (TDP) 2753, సంతనూతలపాడు (TDP) 17540, యర్రగొండపాలెంలో (YCP) 441 ఓట్ల లీడింగ్‌లో ఉన్నాయి.

News June 4, 2024

స్మృతి ఇరానీకి షాక్!

image

గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై గెలిచిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి విజయానికి దూరమవుతున్నారు. అమేథీలో ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ 50వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీలు

image

TG: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. నల్గొండలో 3,44,000 ఓట్ల ఆధిక్యంతో రఘువీర్‌రెడ్డి కొనసాగుతున్నారు. అటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 3,24,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

News June 4, 2024

5వేల ఓట్ల ఆధిక్యంలో యూసుఫ్ పఠాన్

image

పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ లీడ్‌లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరిపై 5వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధిర్ రంజన్ ఇక్కడ 2009 నుంచి గెలుస్తూ వస్తున్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం టీఎంసీ 27, బీజేపీ 13, కాంగ్రెస్ 1, లెఫ్ట్ పార్టీలు ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.

News June 4, 2024

Stock Market: సెన్సెక్స్ 6వేలకు పైగా పతనం

image

స్టాక్ మార్కెట్లో కనీవినీ ఎరగని పతనం కనిపిస్తోంది. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 6,135 పాయింట్లు నష్టపోయింది. 7.49 శాతం నష్టంతో 70,736 వద్ద కొనసాగుతోంది. చరిత్రలో ఒకరోజులో ఇదే కనీవినీ ఎరగని నష్టం కావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.36 లక్షల కోట్లమేర సంపద నష్టపోయారు.

News June 4, 2024

మంత్రుల్లో పెద్దిరెడ్డి ఒక్కరే లీడింగ్

image

ఏపీలో మంత్రులందరూ ఓటమి దిశలో ఉన్నారు. 25 మందిలో దాదాపు 24 మంది వెనుకంజలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 2314 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.