India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై గెలిచిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈసారి విజయానికి దూరమవుతున్నారు. అమేథీలో ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీలాల్ శర్మ 50వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
TG: పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీ దిశగా దూసుకెళుతున్నారు. నల్గొండలో 3,44,000 ఓట్ల ఆధిక్యంతో రఘువీర్‌రెడ్డి కొనసాగుతున్నారు. అటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 3,24,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ లీడ్‌లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరిపై 5వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అధిర్ రంజన్ ఇక్కడ 2009 నుంచి గెలుస్తూ వస్తున్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం టీఎంసీ 27, బీజేపీ 13, కాంగ్రెస్ 1, లెఫ్ట్ పార్టీలు ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లో కనీవినీ ఎరగని పతనం కనిపిస్తోంది. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 6,135 పాయింట్లు నష్టపోయింది. 7.49 శాతం నష్టంతో 70,736 వద్ద కొనసాగుతోంది. చరిత్రలో ఒకరోజులో ఇదే కనీవినీ ఎరగని నష్టం కావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.36 లక్షల కోట్లమేర సంపద నష్టపోయారు.
ఏపీలో మంత్రులందరూ ఓటమి దిశలో ఉన్నారు. 25 మందిలో దాదాపు 24 మంది వెనుకంజలో కొనసాగుతున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 2314 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు.
చంద్రబాబు కేంద్రంలో మళ్లీ కింగ్ మేకర్ అయ్యే అవకాశముందని జాతీయ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇండియా కూటమి 250 సీట్ల వద్ద ఆగిపోతే తదుపరి ప్రభుత్వం సహా ప్రధాన మంత్రిని నిర్ణయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించవచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన డిమాండ్లను సాధించుకొని ఒక వేళ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపితే ఏదైనా జరగవచ్చని అభిప్రాయపడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందనుండటంతో టాలీవుడ్ హీరో నితిన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించడం కోసం మీరు చేసిన కృషికి నేను ఓ అభిమానిగా, సోదరుడిగా ఎంతో సంతోషిస్తున్నా. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. ఈ విజయం కోసం మీరెంతో పోరాడారు. ఈ విజయానికి మీరు అర్హులు. మీరెప్పటికీ మా పవర్ స్టారే.. మీకిప్పుడు మరింత పవర్ లభించనుంది’ అని ట్వీట్ చేశారు.
ఉమ్మడి విజయనగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో YCP 9 స్థానాలకు 9 స్థానాలను కైవసం చేసుకోగా.. టీడీపీకి శూన్య హస్తమే మిగిలింది. 2024లో ఇక్కడి ఫలితాలు పూర్తిగా తారుమారయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అన్ని స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది. YCP అభ్యర్థులు ఓటమి దిశగా పయనిస్తున్నారు. ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకతకు కారణం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల పట్టుదల, ప్రణాళిక ఇప్పుడు అధికారం తెచ్చి పెడుతోందని క్రికెటర్ హనుమా విహారి తెలిపారు. ‘ఘన విజయం దిశగా సాగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌కు అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘కర్మ ఎప్పుడూ విఫలం కాదు’ అంటూ వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు.
AP: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకబడ్డారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 64,953 ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 5,281 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.