News November 21, 2024

ఏపీలో ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్: సీఎం చంద్రబాబు

image

AP: గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని CM చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానివెనుక గంజాయి బ్యాచ్ ఉందన్నారు. నాసిరకం మద్యం విక్రయించడం వల్లే ప్రజలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పారు. విద్యాసంస్థల ప్రాంగణాలకు కూడా గంజాయి, డ్రగ్స్ చేరాయని ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.

News November 21, 2024

ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే?

image

దేశంలోనే మోస్ట్ పాపులర్ నటుడి(అక్టోబర్)గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచినట్లు ORMAX మీడియా పేర్కొంది. అక్టోబర్‌లో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న పలు సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తర్వాత దళపతి విజయ్, షారుఖ్, జూ.ఎన్టీఆర్, అజిత్ కుమార్, అల్లుఅర్జున్, మహేశ్‌బాబు ఉన్నారు. ఇక మోస్ట్ పాపులర్ నటిగా సమంత నిలిచారు. ఆమె తర్వాత ఆలియా, నయనతార, దీపికా పదుకొణె, త్రిష ఉన్నారు.

News November 21, 2024

STOCK MARKETS: ఎంత నష్టపోయాయంటే!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా కోర్టులో అదానీపై కేసులు, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు పెరగడమే ఇందుకు కారణాలు. సెన్సెక్స్ 77,155 (-422), నిఫ్టీ 23,349 (-168) వద్ద క్లోజయ్యాయి. ADANIENT, ADANI PORTS, SBILIFE, SBI, NTPC టాప్ లూజర్స్. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. IT, REALTY సూచీలు పుంజుకున్నాయి.

News November 21, 2024

భారత AQI రాజధానిగా ఏ నగరం బెటరంటే..

image

కాలుష్యం కారణంగా దేశ రాజధానిగా ఢిల్లీ సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాక క్యాపిటల్‌గా ఏ నగరాలు సెట్ అవుతాయి? వాయు నాణ్యత సూచీ(AQI) ఆధారంగా ఏ నగరాలైతే బెటర్ అన్నదానిపై ఇండియా టుడే ఓ జాబితాను ప్రచురించింది. అవన్నీ ఈశాన్యరాష్ట్రాలకు చెందినవే కావడం విశేషం. ఇంఫాల్(AQI-38), ఐజ్వాల్(52), ఈటానగర్(56), షిల్లాంగ్(58), దిస్పూర్(64), అగర్తల(65), గ్యాంగ్‌టక్(AQI-70) వాటిలో ఉన్నాయి.

News November 21, 2024

ధనుష్-ఐశ్వర్య విడాకులపై తుది తీర్పు ఆరోజే..

image

తమ విడాకుల కేసు విచారణ కోసం నటుడు ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. వారు మళ్లీ కలవబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి దీంతో ఫుల్‌స్టాప్ పడింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి తుది తీర్పును ఈ నెల 27కి వాయిదా వేశారు. 2004లో వీరిద్దరికీ పెళ్లైంది. యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులున్నారు. తాము విడిపోనున్నట్లు 2022, జనవరి 17న సోషల్ మీడియా వేదికగా ధనుష్ ప్రకటించారు.

News November 21, 2024

వాలంటీర్లు YCP కోసం పని చేయలేదు: కన్నబాబు

image

AP: వాలంటీర్లు YCP కోసం పని చేయలేదని, కానీ వారిని ప్రభుత్వం తమ పార్టీ సానుభూతిపరులుగా చూస్తోందని వైసీపీ నేత కన్నబాబు మండిపడ్డారు. ‘అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్య పెట్టారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక వారికి జీతాలెలా ఇచ్చారు. వ్యవస్థే లేకపోతే న్యూస్ పేపర్‌కు ఇచ్చే రూ.200 ఎలా రద్దు చేశారు’ అని ఆయన ప్రశ్నించారు.

News November 21, 2024

తొలిసారి ఉక్రెయిన్‌పై మిసైల్ దాడి చేసిన రష్యా

image

ఉక్రెయిన్ క్షిపణి దాడులకు రష్యా ప్రతీకార దాడులు ఆరంభించింది. డినిట్రో సిటీ లక్ష్యంగా ICBM క్షిపణిని ప్రయోగించింది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ సేన మిసైల్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈస్ట్రన్ ఉక్రెయిన్‌లోని డల్నె గ్రామాన్ని రష్యా సేనలు ఆక్రమించాయని కీవ్ తెలిపింది.

News November 21, 2024

‘పుష్ప 2’:శ్రీలీల స్పెషల్ సాంగ్‌‌పై బిగ్ అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 5.49 గంటలకు ‘కిస్సిక్’ సాంగ్ రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు వేశారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న మూవీ విడుదల కానుంది.

News November 21, 2024

మండలానికి 2 అంబులెన్సులు: మంత్రి రాజనర్సింహ

image

TG: రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడారు. ‘మండల కేంద్రంలోనే రోగికి 90 శాతం చికిత్స జరగాలి. రోగులను వైద్యులు తమ క్లయింట్లుగా భావించాలి. రాష్ట్రంలో ఇప్పటికే 7 వేలకుపైగా నర్సు పోస్టులు భర్తీ చేశాం. ఇకపై మెడికల్ స్టాఫ్ కొరత ఉందని, అందుబాటులో లేరనే విమర్శలు రావొద్దు’ అని పేర్కొన్నారు.

News November 21, 2024

హారతి కర్పూరంలా కరిగిపోయిన అదానీ సంపద

image

గౌతమ్ అదానీపై న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో 11 కంపెనీల స్టాక్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్లు తగ్గి $59.3 బిలియన్లకు చేరుకుంది.