News June 4, 2024

బోసిపోయిన వైసీపీ కార్యాలయం

image

AP: ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉండటంతో మంగళగిరిలోని వైసీపీ కార్యాలయం బోసిపోయింది. ఆ పరిసరాల్లో నేతలు, కార్యకర్తల జాడ కనిపించడం లేదు. ఊహించని ఫలితాలు వెలువడుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉండిపోయాయి. మరోవైపు పలు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఆ పార్టీ అభ్యర్థులు ఇంటి బాట పడుతున్నారు. తాడేపల్లిలోని నివాసంలో ఓఎస్డీతో కలిసి సీఎం జగన్‌ ఫలితాలు వీక్షిస్తున్నట్లు సమాచారం.

News June 4, 2024

మచిలీపట్నంలో వైసీపీ వెనుకంజ

image

AP: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు, వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర 6,691 ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇటు కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

1.50 లక్షల ఓట్ల మెజార్టీలో శివరాజ్ సింగ్

image

ఎంపీగా పోటీ చేసిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విదిశాలో తన సమీప ప్రత్యర్థి ప్రతాప్ భాను శర్మ(కాంగ్రెస్)పై ఆయన 1,50,870 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే శివరాజ్‌కు కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

News June 4, 2024

BJP 242 vs INC 105: పెరిగిన కాంగ్రెస్ సీట్లు

image

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటములు నువ్వా నేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఎన్డీయే 288, ఇండియా 225 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పార్టీల వారీగా చూస్తే బీజేపీ డామినేటింగ్ పొజిషన్లో ఉంది. 240 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాంగ్రెస్ 105 సీట్లకు పెరిగింది. దాదాపుగా పదేళ్ల తర్వాత రాహుల్ సేన సీట్లు వందకు పెరగడం గమనార్హం.

News June 4, 2024

మహబూబాబాద్‌లో బలరాంనాయక్ ముందంజ

image

TG: మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 33,753ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం.

News June 4, 2024

పంజాబ్‌లో బీజేపీ డీలా!

image

పంజాబ్‌లో బీజేపీ డీలా పడింది. 13 చోట్ల ఒక్క స్థానంలోనూ ఆధిక్యం ప్రదర్శించట్లేదు. కాంగ్రెస్ 5, ఆప్ 3, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లో బీజేపీ 13, కాంగ్రెస్ 9, ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక హరియాణాలో కాంగ్రెస్ 5, బీజేపీ 4, ఇతరులు ఒక స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతున్నాయి.

News June 4, 2024

అయోధ్యలో బీజేపీ వెనుకంజ

image

అయోధ్యలో రామ మందిరం నిర్మించిన తర్వాత ఆ సీటు బీజేపీకేనని అంతా భావించారు. అయితే, అందరి అంచనాలు తలకిందులయ్యేలా అయోధ్య ప్రజలు ఓటేశారు. అక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ వెనుకంజలో ఉన్నారు. సింగ్ దాదాపు 600 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. ఈసీ లెక్కల ప్రకారం యూపీలో INDIA కూటమి 40 సీట్లలో ముందంజలో ఉంది.

News June 4, 2024

ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం

image

నల్గొండలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 90వేల ఓట్ల ఆధిక్యంలో రఘువీర్‌రెడ్డి ఉన్నారు. ఇటు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 26వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రెండూ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు.

News June 4, 2024

ఇండియా కూట‌మి వైపు జాట్లు

image

హ‌రియాణ‌ా, రాజస్థాన్ రాష్ట్రాల‌ ఎర్లీ ట్రెండ్స్‌లో జాట్ సామాజిక వ‌ర్గం ఇండియా కూట‌మి వెనుక ర్యాలీ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. లైంగిక వేధింపుల‌పై మ‌హిళా రెజ్ల‌ర్ల ఉద్య‌మం, అగ్నివీర్‌పై యువ‌త‌లో వ్య‌తిరేక‌త‌, జాట్ల మ‌ద్ద‌తు అధికంగా ఉండే జేజేపీతో బీజేపీ తెగ‌దెంపులు చేసుకోవ‌డం లాంటి కార‌ణాలు బీజేపీకి జాట్ల‌ను దూరం చేసిన‌ట్టు ఎర్లీ ట్రెండ్స్ స్ప‌ష్టం చేస్తున్నాయి.

News June 4, 2024

ఒడిశాలో అధికారం దిశగా బీజేపీ!

image

ఒడిశా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ మొత్తం 147 స్థానాలుండగా బీజేపీ 47 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికార బీజేడీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 6, సీపీఐ(ఎం) 1, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ముందంజలో ఉన్నారు.