News June 4, 2024

యూపీని గెలిచినోడికే ‘ఢిల్లీ’ పీఠం

image

అతి పెద్ద బ్యాటిల్ గ్రౌండులో ఆరితేరినవాడే విజేతగా ఆవిర్భవిస్తాడు. లోక్‌సభ ఎన్నికల్లోనూ అంతే. అత్యధిక సీట్లున్న యూపీని ఒడిసిపడితేనే పార్లమెంటులో జయకేతనం ఎగరేస్తారు. నరేంద్ర మోదీ, అమిత్‌షాకు ఇది బాగా తెలుసు. అందుకే ఈ జోడీ అంతలా శ్రద్ధపెట్టింది. కుల, మత, వర్గ సమీకరణాలతో పాటు సంక్షేమం, శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏకు 80కి 70+ సీట్లు వస్తాయని అంచనా.

News June 4, 2024

ఉరవకొండ, సింగనమల ‘స్పెషాలిటీ’ రిపీటయ్యేనా?

image

AP: రాష్ట్రంలో ఉరవకొండ, శింగనమల(అనంతపురంD) సెగ్మెంట్లకు ఓ ప్రత్యేకత ఉంది. ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోతుంది. శింగనమలలో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీంతో వీటి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. శింగనమలలో వీరాంజనేయులు(YCP), శ్రావణి(TDP), శైలజానాథ్(INC), ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి(YCP), పయ్యావుల కేశవ్(TDP) బరిలో ఉన్నారు.

News June 4, 2024

కుప్పంలో చంద్రబాబుకు ఆధిక్యం

image

AP: పోస్టల్ బ్యాలెట్ కౌంటింగులో టీడీపీ అధినేత చంద్రబాబు 1,549 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాసేపట్లో ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అక్కడ వైసీపీ నుంచి KRJ భరత్ బరిలో ఉన్నారు.

News June 4, 2024

ఢిల్లీలో దూసుకెళ్తున్న బీజేపీ

image

దేశ రాజధాని పరిధిలోని 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీలో అధికార పార్టీగా ఉన్న ఆప్ కనీసం ఒక్క చోట కూడా లీడ్ కనబర్చడం లేదు. కేజ్రీవాల్ ఎన్నికల ముందు బెయిల్‌పై బయటకు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేదు అన్పిస్తోంది.

News June 4, 2024

టీడీపీ పరిస్థితి మారేనా?

image

AP:ఉత్తరాంధ్రలో 2019 ఫలితాల్లో TDP 34 స్థానాలకు గాను 6 స్థానాల్లోనే గెలిచింది. SKLMలో 10 స్థానాలకు గాను 2, ఉమ్మడి VSPలో 15 స్థానాలకు గాను 4 స్థానాల్లోనే గెలిచింది. VZMలో 9 స్థానాలుండగా TDP ఖాతా తెరవలేదు. ఈ ఎన్నికల్లో TDP, జనసేన, BJP కూటమిగా బరిలో దిగడంతో పరిస్థితి మారుతుందని ఆయా పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విజయనగరంలో కూటమి ప్రభావం ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

News June 4, 2024

సీమలో పోటీలో ఉన్న ప్రముఖులు

image

AP: రెండు ప్రధాన పార్టీల(YCP, TDP) అధ్యక్షులు వైఎస్ జగన్(పులివెందుల), చంద్రబాబు(కుప్పం) సహా పలువురు ప్రముఖులు రాయలసీమ నుంచి బరిలో ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(రాజంపేట ఎంపీ), బాలకృష్ణ(హిందూపురం) గెలుపోటములపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కిరణ్ తొలిసారి ఎంపీ బరిలో నిలిచారు.

News June 4, 2024

రెండు చోట్ల టీడీపీ ముందంజ

image

రాజమండ్రి రూరల్ స్థానంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ 900కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

ఫస్ట్ ఫలితం నిజామాబాద్‌దే..

image

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో మొదటి ఫలితం నిజామాబాద్ నుంచే వెలువడనుంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున మరోసారి బరిలో నిలిచారు. అధికార కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ పోటీలో ఉన్నారు. ఓట్ల కౌంటింగ్ కోసం 140 టేబుళ్లు ఏర్పాటు చేయగా 15రౌండ్లలో ఫలితం తేలనుంది.

News June 4, 2024

ట్రెండింగ్‌లో #400Paar

image

ఎన్నికల కౌంటింగ్ మొదలైన వేళ ట్విటర్‌లో ‘400 పార్’ ట్రెండ్ అవుతోంది. ఆ పార్టీ శ్రేణులు #400Paar అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘అబ్కీ బార్ 400 పార్’ అంటూ ఎన్నికల సమరంలోకి దిగిన బీజేపీ 400 స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరికొన్ని గంటల్లోనే వారి నినాదం నిజమవుతుందో లేదో తేలిపోనుంది.

News June 4, 2024

2019, 2014 ఎన్నికల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు?

image

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 సీట్లకు ప‌రిమిత‌మైంది. 2014లో బీజేపీ 282 స్థానాల్లో గెలిచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 44 సీట్లు ద‌క్కించుకుంది. ఇక 2024 ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఎన్ని సీట్లు ద‌క్కుతాయ‌న్న‌ది మ‌రి కొద్దిసేప‌ట్లో తేల‌నుంది.