India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* రేపే ఎన్నికల కౌంటింగ్.. సర్వత్రా ఉత్కంఠ
* నటి హేమ అరెస్ట్.. 14 రోజుల కస్టడీ
* ఎమ్మెల్సీ కవిత కస్టడీ ఈనెల 7 వరకు పొడిగింపు
* తెలంగాణను తాకిన రుతుపవనాలు
* కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు: CBN
* వైసీపీ శ్రేణులు రేపు అప్రమత్తంగా వ్యవహరించాలి: జగన్
* YCPకి 123 స్థానాలు వస్తాయి: పరిపూర్ణానంద
* రూ.8 లక్షల కోట్లు దాటిన ఎస్బీఐ మార్కెట్ విలువ
* T20 WC-2024 విజేతకు ప్రైజ్‌మనీ ₹20.36కోట్లు
లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇద్దరు ఎంపీలు మాత్రమే సింగిల్ డిజిట్ ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో ఉమ్మడి ఏపీలోని అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కొణతాల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలిచారు. 1998లో బిహార్‌లోని రాజ్‌మహల్ స్థానం నుంచి BJP నేత సోమ్ మరండి 9 ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. 1996లో బరోడా నుంచి కాంగ్రెస్ నేత గైక్వాడ్ సత్యజీత్ సిన్హా 17 ఓట్ల తేడాతో గెలుపొందారు.
భారత జట్టు 2007, 2011 WCలు గెలవడంతో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషించారని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఒకవేళ తాను టీమ్‌ఇండియా కోచ్ అయితే స్పెషలిస్ట్ బ్యాటర్లందరూ అవసరమైనప్పుడు కచ్చితంగా బౌలింగ్ చేయాలనే రూల్‌ను తీసుకొస్తానని చెప్పారు. ఆనాటి జట్టులో సచిన్, యువీ, రైనా బౌలింగ్ చేసేవారని, ఇప్పటి జట్టులో రోహిత్, విరాట్, సూర్య ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్ చేసినా టీమ్‌కు కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాకా 97.82 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని పేర్కొంది. ఇప్పటికీ కొందరు పోస్ట్ ద్వారా నోట్లను పంపుతున్నట్లు తెలిపింది. 2016లో పాత రూ.1,000, 500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను RBI తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
భారత జట్టు కోచ్‌గా తనకు T20WC చివరి టోర్నమెంట్ అని ద్రవిడ్ వెల్లడించారు. హెడ్ కోచ్ పదవికి మరోసారి దరఖాస్తు చేసే ఆలోచన తనకు లేదని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. కోచ్‌గా ఉండటాన్ని తాను ఎంజాయ్ చేశానని, రాబోయే కాలంలో టీమ్ షెడ్యూల్స్‌ను దృష్టిలో ఉంచుకుని మరోసారి అప్లై చేయొద్దని డిసైడ్ అయినట్లు చెప్పారు. WCలో రోహిత్, జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారని, కోహ్లీ కూడా ఓపెనర్‌గా రావొచ్చని చెప్పారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. గతంలో TSPSC పేపర్ లీకేజీ కేసులో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ను సైతం ట్యాప్ చేసినట్లు పోలీసు అధికారి భుజంగరావు అంగీకరించారు. దీనిపై మీడియాలో వార్తలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి ఆలోక్ అరాధే ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. దీనిపై రేపు మధ్యాహ్నం విచారణ జరపనుంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఐదేళ్లపాటు CM, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నవారికి ఈ ఒక్కరాత్రే మిగిలి ఉంది. రేపు వారంతా మళ్లీ గెలుస్తారా? లేక కొత్తవారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. మరి రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచి అధికారం చేపడుతుందని మీరనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎలక్షన్ రిజల్ట్స్ ఎక్స్‌క్లూజివ్‌గా WAY2NEWSలో తెలుసుకోండి.
TGSRTCలో 3వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. అనుమతి రాగానే ఆయా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ దృష్ట్యా కొత్తగా వచ్చే 2వేల డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ పథకం వచ్చాక రోజుకు 55 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు.
AP: ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రేపు YCP నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని CM జగన్ సూచించారు. ‘ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలి. ప్రజలు మనకు వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి, అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 తేదీల్లో కలిపి మొత్తం 140.7mm వర్షపాతం నమోదైందని, ఏటా జూన్ నెల మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని (110.3mm) ఇప్పటికే అధిగమించినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని తెలిపింది.
Sorry, no posts matched your criteria.