India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమ సంస్థ నిబంధనలు ఉల్లంఘించే యూజర్ల ఖాతాలను నిషేధిస్తామని వాట్సాప్ మరోసారి హెచ్చరించింది. APR 1 నుంచి 30 వరకు దేశంలో 71 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. వీటిలో అత్యధిక ఖాతాలను వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల ఆధారంగా తొలగించింది. 13 లక్షల అకౌంట్లను మాత్రం సంస్థ నిబంధనలు ఉల్లంఘించినందుకు నిషేధించింది. గతంలోనూ వాట్సాప్ కోట్ల సంఖ్యలో ఖాతాలను బ్యాన్ చేసింది.
రేపటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత క్రికెటర్, కాకినాడకు చెందిన హనుమ విహారి సైతం టెన్షన్ పడుతున్నట్లుగా ఉండే ‘ఫింగర్స్ క్రాస్డ్’ ఎమోజీని ట్వీట్ చేశారు. దీంతో ‘మనమే గెలుస్తున్నాం’ అంటూ YCP.. ‘హల్లో ఏపీ.. బై బై వైసీపీ’ అని TDP అభిమానులు ఆయన పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కాగా మరో క్రికెటర్ అంబటి రాయుడు ఎన్నికల ముందు జనసేనలో చేరిన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 6వ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను ED దాఖలు చేసింది. మొత్తం 36 మంది నిందితుల్లో MLC కవితను 32వ నిందితురాలిగా చేర్చింది. కవితతో పాటు ఇతర నిందితుల ఆస్తులు జప్తు చేయాలని కోరింది. ఆమె 9 ఫోన్లను ధ్వంసం చేశారని, AAPకు ₹100 కోట్లు చెల్లించేలా సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఇలా మొత్తం ₹292.8cr విలువైన క్రైమ్ కార్యకలాపాల్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యారని పేర్కొంది.
ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు ఒడిశా అసెంబ్లీని గవర్నర్ రఘుబర్ దాస్ రద్దు చేశారు. ఇప్పటికే బీజేడీ ప్రభుత్వ పదవీకాలం పూర్తయింది. దీంతో అసెంబ్లీ రద్దుకు ఇవాళ ఉదయం కేబినెట్ ఆమోదం తెలపడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నవీన్ పట్నాయక్ చూస్తున్నారు.
రేపు ఫలితాల తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వీరంతా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ అయిన విషయం తెలిసిందే. రేపు కూడా సమావేశం కావాలని నిర్ణయించిన నేతలు.. ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది.
TG: తెలంగాణ టెట్ ప్రిలిమినరీ కీ విడుదలైంది. నిన్నటితో టెట్ పరీక్షలు ముగియడంతో ఇవాళ పేపర్ల వారీగా కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల చేశారు. జూన్ 12న ఫలితాలు విడుదల కానున్నాయి. కీ కోసం ఇక్కడ <
రాష్ట్రంలో పలు లోక్‌సభ స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 17 స్థానాల్లో HYD, మల్కాజిగిరి, సికింద్రాబాద్, KNR, భువనగిరి, NZMB, ఖమ్మం, WGLలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోరు తప్పదని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో BRS 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, MIM ఒక స్థానంలో గెలిచాయి. ఈ సారి ఫలితాలు మారిపోతాయని సర్వేలు పేర్కొనగా రేపు దీనిపై క్లారిటీ రానుంది.
TG: ఈ నెల 9న జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు TSPSC పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్‌పై పాస్‌పోర్టు సైజ్ ఫొటోను తప్పనిసరిగా అతికించాలని TSPSC అధికారులు తెలిపారు. ఈ ఫొటో 3 నెలలలోపు దిగినదే అయి ఉండాలన్నారు. హాల్ టికెట్‌పై ఫొటో అతికించకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని పేర్కొన్నారు. ఈ నిబంధనను HTలో పొందుపరిచినట్లు వెల్లడించారు.
AP: కౌంటింగ్ కేంద్రాల్లో కూటమి ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ‘లెక్కింపులో అనుమానం వస్తే వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి. అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బయటకు రావొద్దు. పోలైన, లెక్కింపులో వచ్చిన ఓట్లను సరిచూసుకోవాలి. ఓటమిని తట్టుకోలేక వైసీపీ నేతలు హింసకు పాల్పడే ప్రమాదం ఉంది. కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు’ అని టెలికాన్ఫరెన్స్‌లో చెప్పారు.
ఈనెల 4, 6న రెండు గంటల చొప్పున HDFC డెబిట్(ATM), క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల సర్వీసులు నిలిచిపోనున్నాయి. 4న అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు, 6న అర్ధరాత్రి 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు సేవల్లో అంతరాయం కలగనున్నట్లు ఖాతాదారులకు HDFC మెసేజ్‌లు పంపిస్తోంది. ఆయా సమయాల్లో సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొంది. మరి ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?
Sorry, no posts matched your criteria.