India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,110 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కు చేరింది.
మళ్లీ కమల ప్రభంజనమే అని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంగా ప్రకటించడంతో బీజేపీ గెలుపు సంబరాలకు ప్లాన్ చేస్తోంది. రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం నుంచి బీజేపీ జాతీయ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ర్యాలీలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం గెలుపు ప్రసంగంలో తొలి 100 రోజుల ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో <<13364354>>సుప్రీంకోర్టులోనూ<<>> వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన <<13358298>>తీర్పును<<>> వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నోటా ఓట్లు కూడా అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే.. గత రెండు ఎన్నికల్లోనూ నోటా ఓట్లు భారీగానే పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,02,942 మంది, 2019లో 65,22,772 మంది నోటా బటన్ నొక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ ఓట్లు అభ్యర్థులకు పడితే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉండేది.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. Way2News యాప్‌లో సులభంగా, వేగంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. మే 24న జరిగిన ఈ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
AP: జనసేన పోటీ చేసిన 21 MLA స్థానాల్లో 14-15 సీట్లు, 2 ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. పిఠాపురం, పెందుర్తి, విశాఖ సౌత్, యలమంచిలి, అనకాపల్లి, నెల్లిమర్ల, పాలకొండ, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో JSP ఎక్కడెక్కడ గెలుస్తుందో కామెంట్ చేయండి.
AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే <<13354570>>పిన్నెల్లి<<>> రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆయనను ఆదేశించింది. అలాగే బెయిల్‌ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. EVM ధ్వంసం కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్‌ను చూడాలనే లేదని క్రికెటర్ రియాన్ పరాగ్ వ్యాఖ్యానించారు. ‘జట్టులో నేను ఉండి ఉంటే ఏమవుతుందనే కంగారు ఉండేది. టీమ్‌లో నేను లేను కాబట్టి మ్యాచ్‌లపై పెద్దగా ఆసక్తి లేదు. చివరకు ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దానితోనే సంతోష పడతా’ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ఐపీఎల్‌లో రియాన్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. WCకి ఎంపిక చేస్తారనే చర్చ నడిచినా జట్టులో చోటు దక్కలేదు.
పాకిస్థాన్ ఆర్మీలో బ్రిగేడియర్‌గా తొలిసారి ఓ మహిళ, క్రైస్తవ వర్గానికి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు. ఆర్మీ మెడికల్ కేర్‌లో సీనియర్ పాథాలజిస్ట్‌గా 26 ఏళ్లుగా పనిచేస్తున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. దీంతో మేరీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. కాగా 2021 గణాంకాల ప్రకారం పాక్‌లో 96.47 శాతం ముస్లింలు, 2.14 శాతం హిందువులు, 1.27 శాతం క్రైస్తవులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.