News June 3, 2024

లిక్కర్‌ స్కామ్ కేసు.. నేడు కోర్టుకు ఎమ్మెల్సీ కవిత

image

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. మరోవైపు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

News June 3, 2024

AFCAT: భారీ జీతంతో 304 ఉద్యోగాలు

image

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT)-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్, NCC స్పెషల్ ఎంట్రీ ఆఫీసర్ విభాగాల్లో 304 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తుకు ఈ నెల 28 చివరి తేదీ. ఇంటర్, 60% మార్కులతో డిగ్రీ, బీటెక్ పాసైనవారు అర్హులు. AUG 9-11 తేదీల్లో పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి ₹56,100-₹1,77,500 పేస్కేల్ ఇస్తారు.
వెబ్‌సైట్: <>https://afcat.cdac.in/<<>>

News June 3, 2024

కౌంటింగ్ ప్రక్రియలో ఫామ్‌లు.. ప్రాధాన్యతలు

image

✒ ఫామ్-17C: ప్రతి బూత్‌లో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలతో పీవో సంతకం చేసి పార్టీల ఏజెంట్లకు ఇస్తారు. వీటిని కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలి.
✒ ఫామ్ 18: ఇది కౌంటింగ్ ఏజెంట్ నియామక పత్రం. ఆర్వో జారీచేసిన ఈ సర్టిఫికెట్ ఉంటేనే ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
✒ ఫామ్ 21 C: ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు నమోదు చేసే పత్రం.

News June 3, 2024

కౌంటింగ్ ప్రక్రియలో ఫామ్‌లు.. ప్రాధాన్యతలు

image

✒ అనెగ్జర్ 38: ఓట్ల లెక్కింపునకు నియమితులైన పర్యవేక్షకులు, హెల్పర్స్‌కు జారీ చేసే సర్టిఫికెట్.
✒ ఫామ్ 21 E: సెగ్మెంట్‌లో ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎవరు గెలిచారు అనే వివరాలు ఇందులో ఉంటాయి.
✒ ఫామ్ 22: గెలిచిన అభ్యర్థికి ఆర్వో జారీ చేసే సర్టిఫికెట్. దీన్ని అందుకున్న వ్యక్తులు అధికారికంగా ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికైనట్లు.

News June 3, 2024

కౌంటింగ్ ప్రక్రియలో ఫామ్‌లు.. ప్రాధాన్యతలు

image

✒ అనెగ్జర్ 58: పార్ట్-1లో పోలింగు బూత్‌ల వారీగా మొత్తం ఓట్లు, పోలైన ఓట్ల వివరాలుంటాయి. పార్ట్-2లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల లెక్కింపు, ఆధిక్యాలు, ఫలితాల వివరాలుంటాయి.
✒ అనెగ్జర్ 39: నియోజకవర్గ తుది ఫలితం వివరాలు ఇందులో సమగ్రంగా ఉంటాయి. పోలింగ్ కేంద్రాల వారీగా ఓట్ల ఆధిక్యతలు నోటాతో సహా పొందుపరుస్తారు. ఆర్వో సంతకం చేసిన తర్వాత దీన్ని అధికారికంగా విడుదల చేస్తారు.

News June 3, 2024

ORRపై పెరిగిన టోల్‌ఛార్జీలు

image

HYD ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్‌ఛార్జీలు 5% పెరిగాయి. వాహనాలను బట్టి ఆరు కేటగిరీలుగా విభజించగా.. కారు, జీపు, వ్యాను, ఎల్ఎంవీ, ఎస్వీయూ వాహనాలకు ప్రతి కి.మీకి రూ.2.34, ఎల్‌సీవీ, మినీ బస్సుకు రూ.3.77, బస్సు, 2 యాక్సిల్ ట్రక్కుకు రూ.6.69, 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు రూ.8.63, భారీ నిర్మాణ యంత్రాలు-4,5,6 యాక్సిల్ ట్రక్కులకు రూ.12.40, ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్ ఉండే వాహనాలకు కి.మీకు ₹15.09 వసూలు చేస్తారు.

News June 3, 2024

ALERT.. ఇవాళ, రేపు భారీ వర్షాలు

image

TG: ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ <<13365571>>వర్షాలు<<>> కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, NLG, సూర్యాపేట, RR, VKB, MBNR, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-50కి.మీ గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు 2 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రానికి రానున్నాయి.

News June 3, 2024

భద్రాచలంలో వృద్ధులకు నేరుగా దర్శనం

image

TG: భద్రాచలం శ్రీరామచంద్రస్వామి దర్శనాలకు EO కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఇకపై 60ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులు, వారికి సాయంగా వచ్చేవారు నేరుగా దర్శించుకోవచ్చు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు బేడా మండపంలో వేచి ఉండేందుకు వీరికి సదుపాయాలు కల్పిస్తారు. ప్రొటోకాల్ అర్హత ఉన్నవారి కోసమూ ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆఫీసులో వివరాలు అందించి కోరుకున్న దర్శనం, పూజ చేయించుకోవచ్చు.

News June 3, 2024

బెంగాల్‌లో రెండు బూత్‌లలో నేడు రీపోలింగ్

image

పశ్చిమ బెంగాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. బారాసాత్, మథురాపుర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ బూత్‌లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు EC ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ రీపోలింగ్ జరుగనుంది. కాగా శనివారం బెంగాల్‌లో ఆఖరి దశ పోలింగ్‌ జరగ్గా చాలా ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఓ బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు.

News June 3, 2024

93ఏళ్ల వయసులో ఐదో పెళ్లి!

image

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్దోక్ (93) ఐదోసారి వివాహం చేసుకున్నారు. USలో తన కంటే 25ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. మర్దోక్‌కు మొదట పాట్రీషియా బుకర్‌‌‌తో పెళ్లి కాగా 1960ల్లో విడిపోయారు. ఆ తర్వాత మరియామన్, విన్‌డీ డెంగ్, జెర్రీ హాల్‌‌లనూ వివాహం చేసుకుని పలు కారణాలతో విడాకులు తీసుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్ తదితర సంస్థలను మర్దోక్ గ్రూప్ నిర్వహిస్తోంది.