News June 3, 2024

జూన్ 3: చరిత్రలో ఈరోజు

image

1924: తమిళనాడు సీఎం కరుణానిధి జననం
1930: మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ జననం
1943: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా జననం
1952: రచయిత బండి నారాయణస్వామి జననం
1965: నటి రాధ జననం
1972: BRS నేత హరీశ్ రావు జననం
2016: బాక్సింగ్ ఛాంపియన్ మొహమ్మద్ అలీ మరణం
>> ప్రపంచ సైకిల్ దినోత్సవం

News June 3, 2024

T20WC: పపువా న్యూగినియాపై విండీస్ విజయం

image

టీ20 ప్రపంచకప్‌లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌‌లో వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ ప్రత్యర్థిని 136 పరుగులకు కట్టడి చేసింది. అయితే లక్ష్యాన్ని ఛేదించడంలో విండీస్ ఆటగాళ్లు చెమటోడ్చారు. సునాయాసంగా గెలుస్తారని అనుకున్న మ్యాచ్‌ 19వ ఓవర్ వరకు కొనసాగింది. బ్రాండన్ కింగ్ 34(29), ఛేస్ 42*(27) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

News June 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 3, 2024

టాటా స్టీల్‌లో 2500 ఉద్యోగాల కోత

image

యూకేలో టాటా స్టీల్ భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2500 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్కు తయారీ విధానంలో సమూల మార్పులు చేస్తుండటంతో ఉద్యోగాల కోతలు తప్పడం లేదని పేర్కొంది. ఈ చర్యను అక్కడి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నాయి. భారత్ కేంద్రంగా పని చేస్తున్న టాటా స్టీల్ యూకేలో అతి పెద్ద ఉక్కు తయారీ కంపెనీ. 8000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

News June 3, 2024

రోహిత్‌తో అతడే ఓపెనింగ్ చేయాలి: గవాస్కర్

image

టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు కెప్టెన్‌ రోహిత్‌తో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. జైస్వాల్ ఫామ్‌లో లేనందున ఇదే సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో విరాట్ అద్భుతంగా ఆడారన్నారు. ఉత్తమ ప్లేయర్లు ఎక్కడ ఆడినా మంచి ప్రదర్శనే చేస్తారని తెలిపారు. కాగా బంగ్లాతో వార్మప్ మ్యాచులో రోహిత్‌తో సంజూ శాంసన్ ఓపెనింగ్ చేశారు.

News June 3, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 3, సోమవారం ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు అసర్: సాయంత్రం 4:50 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:48 గంటలకు ఇష: రాత్రి 8.09 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 3, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 3, సోమవారం బ.ద్వాదశి: అర్ధరాత్రి 12.18 గంటలకు అశ్విని: అర్ధరాత్రి 12:05 గంటల వరకు దుర్ముహూర్తం: సాయంత్రం గం.12:31 నుంచి 01:23 వరకు తిరిగి మధ్యాహ్నం గం.03.06 నుంచి 03.58 వరకు వర్జ్యం: రాత్రి 08:20 నుంచి 09:50 వరకు

News June 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 3, 2024

TODAY HEADLINES

image

* ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
* TG: మూడు జోన్లుగా తెలంగాణ: రేవంత్ రెడ్డి
* TG: ఇప్పుడు ఎన్నికలొస్తే BRSకు 105 సీట్లొస్తాయని అంచనా: KCR
* TG: ‘జయ జయహే తెలంగాణ’ పాటను ఖూనీ చేశారు: శ్రవణ్
* అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: అరుణాచల్ ప్రదేశ్‌లో BJP, సిక్కింలో SKM గెలుపు
* ఏపీలో కూటమిదే అధికారం: ఇండియా టుడే
* ఏపీని తాకిన రుతుపవనాలు

News June 3, 2024

2019 ఎగ్జిట్ పోల్స్: ఇండియా టుడే ఏం చెప్పిందంటే?

image

తాజాగా India Today Axis My India వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌‌లో ఏపీలో <<13363723>>కూటమి<<>> ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 37-40, వైసీపీకి 130-135, జనసేనకు 0-1 వస్తాయని ఈ సంస్థ పేర్కొంది. తుది ఫలితాల్లో వైసీపీకి 151, టీడీపీ 23, జనసేనకు 1 సీట్లు వచ్చాయి. దీంతో ఈ సారి ఫలితాల్లో ఇండియా టుడే సర్వే నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి.