India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించాలని యూట్యూబర్ అన్వేష్ చేసిన ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన వందలాది మంది హృదయ విదారక కథలను వింటున్నా. వీటిని ఆపేయాలి. నిరంతర అవగాహన, కఠినంగా వ్యవహరించడమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారం. దేశానికే ఆదర్శంగా నిలిచేలా బెట్టింగ్ వ్యతిరేక విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
నార్త్ కరోలినాలోని(USA) షార్లెట్‌కు చెందిన నటాలియా టారియన్ అనే 8 నెలల గర్భిణికి ChatGPT చేసిన హెచ్చరిక ఆమె ప్రాణాలను కాపాడేలా చేసింది. తన దవడ బిగుతుగా అనిపిస్తోందని ఇందుకు కారణమేంటని నటారియా ChatGPTని అడగ్గా ఆమె బీపీని చెక్ చేసుకోవాలని తెలిపింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని Ai సూచించింది. ఆస్పత్రిలో బీపీ 200/146గా ఉండటంతో వెంటనే ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు.
AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి కిందటే విజయవాడలోని సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్‌కు కసిరెడ్డి రాజశేఖరే కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారించేందుకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.
కోలీవుడ్ హీరో విక్రమ్ నటించిన ‘వీర ధీర శూర’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుందని తెలిపింది. అరుణ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా గత నెల 27న థియేటర్లలో విడుదలైంది.
TG: ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూలగొడతామంటూ KCR అనుచరులు పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి ఫైరయ్యారు. సంతలో కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నారని, కానీ అది జరగదని స్పష్టం చేశారు. ములుగు(D) వెంకటాపూర్‌లో రెవెన్యూ సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్న పొంగులేటి.. పేదల కన్నీటిని తుడిచేందుకే భూ భారతి తీసుకొచ్చామన్నారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా? అని ప్రశ్నించారు.
AP: గోశాలలో గోవుల మరణంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి విమర్శించారు. సీఎం చంద్రబాబు ఛైర్మన్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘టీటీడీ పాలన అధ్వానంగా ఉంది. గోవుల మరణం వెనుక కుట్ర ఉంది. టీటీడీ వ్యాపార ధోరణి వల్లే ఈ దారుణం జరిగింది. వయసు పెరిగి గోవులు చనిపోయాయంటున్నారు. మీరు చనిపోతే కూడా మిమ్మల్ని వదిలేయాలా?’ అని ఆయన ఫైర్ అయ్యారు.
TG: పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, MBNR, నారాయణపేట్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.
సౌతాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఇన్‌స్టాలో యెల్లో కలర్ ఇమేజ్‌ను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అతడు IPLలో CSK జట్టులో చేరనున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు CSK అభిమానులు సోషల్ మీడియా వేదికగా బ్రెవిస్‌కు స్వాగతం చెబుతున్నారు. అయితే అతడు నిజంగానే CSKలో చేరుతారా? మరేదైనా విషయమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబీ ఏబీగా పాపులరైన బ్రెవిస్ గతంలో MIకి ఆడారు.
TG: గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి పరీక్షను మళ్లీ నిర్వహించాలని సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల జీవితాలు అగాధంలోకి పడిపోయాయని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహించిన తీరు, ఫలితాల వెల్లడిపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయన్నారు.
హీరోయిన్ నజ్రియా నజీమ్, ఫహాద్ ఫాజిల్ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. SMలో నజ్రియా పెట్టిన ఓ పోస్ట్ దీనికి బలం చేకూరుస్తోంది. ‘నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. ‘సూక్ష్మదర్శిని’ విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయా. ఇది చాలా కఠినమైన సమయం. పూర్తిగా కోలుకుని మళ్లీ మీ ముందుకొస్తా’ అంటూ రాసుకొచ్చారు. ఫహాద్‌తో విడాకుల వ్యవహారంతోనే ఆమె డిప్రెషన్‌లో వెళ్లారేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.