India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను నెరవేర్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారికి నా నివాళులు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారతను చేకూర్చాలనే ‘ప్రజా తెలంగాణ’ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాల మేరకు వెలువడటంతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తొలిసారి Xలో స్పందించారు. ‘ఎన్నికలు, రాజకీయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పుడు నకిలీ జర్నలిస్టులు, స్వయం ప్రకటిత మేధావులు, నేతల పనికిమాలిన విశ్లేషణలు చూస్తూ మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు’ అని రాసుకొచ్చారు. ఎన్నికల్లో BJPకి 300+ సీట్లు ఖాయమని, APలో కూటమిదే అధికారమని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.
TG: లోక్‌సభ ఫలితాల్లో BRSకు ఎన్ని సీట్లయినా రావొచ్చని ఆ పార్టీ అధినేత KCR అన్నారు. ‘ఇవాళ CM సొంత జిల్లాలోనే గెలిచాం. రాకేశ్ రెడ్డి కూడా గెలవబోతున్నారు. లోక్‌సభ సీట్లలో ఎన్ని వస్తాయో చూద్దాం. ఒకడు మనకు 11 వస్తాయన్నాడు. ఇంకొకడు ఒకటే వస్తదన్నాడు. మరొకడు 2-4 అన్నాడు. ఇదో పెద్ద గ్యాంబ్లింగ్ అయిపోయింది. మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. 11 వస్తే పొంగిపోయేది లేదు. 2 వస్తే కుంగిపోయేది లేదు’ అని తెలిపారు.
IIT, NITల్లో ప్రవేశాల కోసం మే 26న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని IIT మద్రాస్ విడుదల చేసింది. విద్యార్థులు <
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సిక్కిం క్రాంతికారీ మోర్చా(SKM) ఘన విజయం సాధించింది. 32 సీట్లకుగాను ఆ పార్టీ ఇప్పటికే 18 చోట్ల గెలిచి మేజిక్(17) ఫిగర్‌ను దాటేసింది. మరో 13 స్థానాల్లో లీడింగులో ఉంది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానానికే పరిమితమైంది. BJP, కాంగ్రెస్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. SKM అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి సీఎం పదవి చేపట్టడం ఖాయమైంది.
TG: బీఆర్ఎస్‌ను మహావృక్షం, మహాసముద్రంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అభివర్ణించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు సహజంగా నైరాశ్యం వస్తుంది. కానీ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెడితే మళ్లీ అదే గర్జన కనిపించింది. ఇటీవల ఓ వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎన్నికలొస్తే 105 సీట్లు గెలుస్తామని చెప్పాడు. మనం డంబాచారాలు చెప్పలేదు. PR స్టంట్లు చేయలేదు. మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సే’ అని KCR తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీ దిశగా సాగుతోంది. అక్కడ 60 స్థానాలు ఉండగా, ఇప్పటికే మేజిక్ ఫిగర్(31) సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో లీడింగులో ఉంది. దీంతో కమలం పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. NPP రెండు, PPA, ఇండిపెండెంట్ చెరో స్థానంలో విజయం సాధించారు. కాగా పోలింగ్‌కు ముందే 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో YCP గెలవబోతోందని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. 2 శాతం ఓట్ల ఆధిక్యంతో TDP కంటే YCP 20-25 సీట్లు ఎక్కువగా సాధించబోతోందని మస్తాన్ ప్రకటించారు. కానీ ఈ సర్వే పట్ల రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలూ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా మస్తాన్ ఒక్కరే YCPకి అనుకూలంగా ప్రకటించారు. దీంతో మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
టీమ్ ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటి వాడయ్యారు. తన స్నేహితురాలు – శృతి రంగనాథన్‌ను ఆయన వివాహమాడారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కాగా వెంకటేశ్ అయ్యర్ భారత్ తరఫున 9 టీ20లు, 2 వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 50 మ్యాచులు ఆడి 1326 పరుగులు బాదారు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.
USA ఆటగాడు అరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించారు. టీ20 WCలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జోన్స్ (10) రికార్డు నెలకొల్పారు. కెనడాతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (10 vs SA) సరసన నిలిచారు. అలాగే WC హిస్టరీలో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా జోన్స్ (94*) నిలిచారు.
Sorry, no posts matched your criteria.