News November 1, 2025

కన్నడను కాదనే వారందరూ మన వ్యతిరేకులే: సిద్దరామయ్య

image

హిందీ, సంస్కృతాల ప్రోత్సాహానికి అధిక నిధులు కేటాయిస్తూ ఇతర భాషలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కర్ణాటక CM సిద్దరామయ్య విమర్శించారు. ‘రాష్ట్రం నుంచి ₹4.5 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్తుండగా మనకు సరైన వాటా మేరకు నిధులు అందడం లేదు. అరకొరగా విదిలిస్తున్నారు’ అని మండిపడ్డారు. కన్నడను వ్యతిరేకించే వారందరినీ మనమూ వ్యతిరేకించాల్సిందేనని రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో ఆయన పిలుపునిచ్చారు.

News November 1, 2025

కాశీబుగ్గ ఘటనపై విచారణకు ఆదేశం

image

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయం వద్ద తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో 9 మంది చనిపోవడం, పలువురు గాయపడటంతో ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలకు దిగింది. స్థానిక, జిల్లా యంత్రాంగం కూడా అక్కడికి తరలింది. ప్రైవేటు ఆలయమైన ఇక్కడ యాజమాన్యం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

News November 1, 2025

హోమ్ మేడ్ క్యారెట్ సీరం

image

ఈ మధ్యకాలంలో ఫేస్‌గ్లో పెంచుకోవడం కోసం సీరంను ఎక్కువగా వాడుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే సీరంలు కొందరికి సరిపడవు. కాబట్టి సహజంగా ఇంట్లోనే క్యారెట్ సీరం ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 తాజాక్యారెట్‌లు తురుముకోవాలి. ఒక పాత్రలో కొబ్బరి, ఆలివ్/ బాదంనూనె వేడి చేసి క్యారెట్ తురుము వేసి 10నిమిషాలు మరిగించాలి. తర్వాత దీన్ని వడకట్టి పొడి సీసాలో భద్రపరచాలి. దీన్ని రోజూ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

News November 1, 2025

ఏపీలో ఎక్కువ సాగవుతున్న ఆయిల్ పామ్ రకాలు

image

☛ కోస్టారికా: ఏపీలో ఎక్కువగా సాగవుతున్న ఆయిల్ పామ్ రకం ఇది. ఈ చెట్లు చాలా పొడవుగా పెరుగుతాయి. గెలల పరిమాణం పెద్దగా వస్తాయి. ఎక్కువ బరువు ఉంటాయి. ☛ సిరాడ్ షార్ట్: ఈ రకం మొక్క మట్టలు తక్కువ సైజులో వస్తాయి. ఈ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగవు. గెలల సంఖ్య ఎక్కువ. గెలల బరువు తక్కువ బరువు ఉన్నా.. ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల రైతులు ఈ రకం సాగుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

News November 1, 2025

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్ రోహిత్

image

నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ టాలీవుడ్ సింగర్ పీవీఎన్‌ఎస్ రోహిత్ తన ప్రియురాలు డాక్టర్ శ్రేయను వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు వీరి వివాహ వేడుకకు హాజరయ్యారు. ‘బేబీ’ చిత్రంలోని ‘ప్రేమిస్తున్నా’ పాటకు గానూ ఆయన జాతీయ ఉత్తమ గాయకుడి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. రోహిత్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News November 1, 2025

కార్తీక వ్రతం మహిమిదే..

image

కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగుల వలె భయంతో పారిపోతారు. వందల కొద్దీ యాగాలు చేసిన వారికి స్వర్గ లోకం మాత్రమే ప్రాప్తిస్తుంది. కానీ ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించే పుణ్యాత్ములు నేరుగా వైకుంఠ ధామాన్ని చేరుకుంటారు. కాబట్టి ఇతర యాగాదుల కన్నా పవిత్రమైన, ఉత్తమమైన మోక్ష మార్గం ఈ కార్తీక మాస వ్రతమే అని తెలుసుకొని, ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. <<-se>>#Karthikam<<>>

News November 1, 2025

APPLY NOW: CSIR-IMMTలో సైంటిస్ట్ పోస్టులు

image

భువనేశ్వర్‌లోని CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(IMMT)లో 30 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.immt.res.in/

News November 1, 2025

‘ఇంటికో ఉద్యోగం’… ఇచ్చి చూపిస్తా: తేజస్వీ యాదవ్

image

వయసులో చిన్నవాడినే అయినా పరిణతితోనే ఎన్నికల హామీలు ఇచ్చానని RJD నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. బిహార్‌ను ఆర్థికంగా అభివృద్ధి చేసి ఇంటికో ఉద్యోగాన్ని కల్పిస్తానని స్పష్టం చేశారు. అందుకు తగ్గ ప్రణాళిక తన దగ్గరుందని వివరించారు. ‘ఇక్కడి యువత ఉపాధికోసం వలస పోతున్నారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు ఏర్పాటుచేసి వారికి ఇక్కడే ఉపాధి దొరికేలా చూస్తాం’ అని తెలిపారు. రాష్ట్రాన్ని నం.1గా తీర్చిదిద్దుతామన్నారు.

News November 1, 2025

తొక్కిసలాట ఘటన కలచివేసింది: చంద్రబాబు

image

AP: శ్రీకాకుళం(D)లోని కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసిందని CM చంద్రబాబు అన్నారు. భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అటు మంత్రి లోకేశ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందని చెప్పారు.

News November 1, 2025

షట్‌డౌన్ ఎఫెక్ట్.. అమెరికాలో $7 బిలియన్లు ఆవిరి

image

అమెరికా గవర్నమెంట్ <<17882827>>షట్‌డౌన్ <<>>సంక్షోభం మరింత ముదురుతోంది. అక్టోబర్ 1 నుంచి ఇప్పటిదాకా $7 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) తాజాగా అంచనా వేసింది. ఈ ప్రతిష్టంభన ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై అంత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. షట్‌డౌన్ ఆరు వారాలు కొనసాగితే $11 బిలియన్లకు, 8 వారాలు కొనసాగితే $14 బిలియన్లకు నష్టాలు పెరుగుతాయని హెచ్చరించింది.