India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: దివ్యాంగులకు అందించే పరికరాలకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయాలని తెలంగాణ వికలాంగుల సహకారం సంస్థ నిర్ణయించింది. గతంలో 75శాతం వైకల్యం ఉన్నవారికే పరికరాలు అందించగా, దానిని 40% శాతానికి తగ్గించేలా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మోటరైజ్డ్ వాహనాలు, బ్యాటరీ వీల్‌చైర్లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, అంధ విద్యార్థులు, బధిరులకు ఫోన్లు, బ్రెయిలీ కిట్స్ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ కమిటీ నిర్ణయించింది.

AP: రాష్ట్రంలోని 21 జిల్లాల విద్యాశాఖ అధికారుల(DEO)ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌ఫర్ అయిన వారిలో ఏడుగురు డీఈవోలను పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వయసు నిర్ధారణకు ఆధార్ కార్డ్ చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. స్కూల్ సర్టిఫికెట్లను ప్రమాణికంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వయసు నిర్ధారణకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకుంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి తరఫు కుటుంబానికి పరిహారం నిర్ణయించేందుకు ఆధార్‌ను ప్రమాణికంగా తీసుకోవడంతో పరిహారం తగ్గడంపై ఆ కుటుంబం పిటిషన్ దాఖలు చేసింది.

HYD నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులు ఇక MMTS సర్వీస్‌ను ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్రం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇది యాదాద్రి వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. MMTS ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.800కోట్లు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం సహకరించకపోయినా సెకండ్ ఫేజ్ కింద సర్వీస్‌ను పొడిగిస్తున్నట్లు చెప్పారు.

TG: కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏటా 600 కోచ్‌లు రూపొందించేలా సిద్ధం చేయనున్నారు. ఇక్కడే గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్‌లు తయారవుతాయి. ఆధునిక LHB కోచ్‌లు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే EMU(ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు)లు ఇక్కడే రూపొందిస్తారు. 3వేల మందికి ఉపాధి లభించనుంది. ₹680 కోట్లతో దీనిని చేపడుతున్నామని, 2025 ఆగస్టులోగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

TG: దీపావళి బోనస్‌ను ఈరోజు సింగరేణి కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఒక్కో కార్మికుడికి ₹93,750 అందనుంది. మొత్తంగా ₹358Cr విడుదల చేయాలని సింగరేణిని ఆదేశించింది. ఈ బోనస్ సింగరేణిలో పనిచేస్తున్న 40వేల మందికి అందనుంది. ఇటీవల సంస్థ పొందిన లాభాల్లో 33% వాటా పంచగా ఒక్కో కార్మికుడికి ₹1.90లక్షలు అందాయి. పండుగ అడ్వాన్స్ కింద మరో ₹25వేలు అందాయి. మొత్తంగా ఒక్కొక్కరికి ₹3లక్షల ప్రయోజనం అందింది.

AP: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును రూ.26వేల కోట్లతో 189కి.మీ మేర నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిన్న సీఎంతో NHAI అధికారుల భేటీలో ORRతో పాటు కుప్పం-హోసూర్-బెంగళూరు రోడ్డును రూ.300 కోట్లతో 56కి.మీ మేర, మూలపేట-విశాఖ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును రూ.8300 కోట్లతో 165కి.మీ మేర, హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.8వేల కోట్లతో 6/8 వరుసలతో 226కి.మీ మేర నిర్మించే అంశాలపై చర్చించారు.

TG: ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నవంబర్ 5న ‘ఛలో హైదరాబాద్’ మహాధర్నాకు తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు ఇస్తామన్న రూ.12 వేలు హామీని అమలు చేయాలని కోరారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫాన్‌గా మారింది. వాయవ్య దిశగా గంటకు 13కి.మీ వేగంతో కదులుతూ పారాదీప్‌కు ఆగ్నేయంగా 80కి.మీ దూరంలో ఉంది. ఇవాళ ఉదయం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఏపీపై దీని ప్రభావం లేకపోయినా శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపటి నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

TG: ఉపాధ్యాయ నియోజకవర్గ MLC ఎన్నికల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల జాబితాలో వాళ్లు పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కాగా ఇప్పటివరకు హైస్కూల్‌లో బోధించే స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉండేది.
Sorry, no posts matched your criteria.