News October 16, 2024

వచ్చింది తినమన్న జొమాటో.. జనం ఆగ్రహం

image

హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి జొమాటోలో చికెన్ మంచూరియా ఆర్డర్ పెట్టగా చికెన్-65 వచ్చింది. జొమాటో ప్రతినిధికి ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించలేదు సరికదా వచ్చిన ఆర్డర్‌ తిని చూడాలంటూ సూచించారు. ఆమెకు నచ్చుతుందని ఉచిత సలహా ఇచ్చారు. ఆ స్క్రీన్ షాట్‌ను ఆమె నెట్టింట పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఆర్డర్ తప్పుగా డెలివర్ చేసి, పైగా అదే తినాలని చెప్పడమేంటంటూ జొమాటోపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

News October 16, 2024

సుభాష్ చంద్రబోస్ అన్న కుమార్తె కన్నుమూత

image

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న శరత్ చంద్ర బోస్ కుమార్తె రోమా రే(95) స్వర్గస్థులయ్యారు. దక్షిణ కోల్‌కతాలోని వారి నివాసంలో వృద్ధాప్య కారణాలతో ఆమె కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. రోమాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. స్వాతంత్ర్య సమరంలో నేతాజీ పోరాటానికి రోమా ప్రత్యక్ష సాక్షి. ఆయన భార్య ఎమిలీ షెంకిల్‌తోనూ రోమాకు స్నేహం ఉంది.

News October 16, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు సెలవు ఉండనుంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News October 16, 2024

రాష్ట్రంలో ఈ రోడ్లకు మహర్దశ

image

APలో పలు రహదారులను కేంద్రం అభివృద్ధి చేయనుంది. కొండమోడు-పేరేచర్ల మధ్య 49.91K.M దూరాన్ని రూ.883.61కోట్లతో 4 లేన్లుగా అభివృద్ధి చేయనుంది. సత్తెనపల్లి, మేడికొండూరులో బైపాస్‌లు నిర్మించనుండడంతో, HYD-గుంటూరు మధ్య రాకపోకలకు సులువు అవుతుంది. సంగమేశ్వరం-నల్లకాలువ, వెలుగోడు-నంద్యాల మధ్య 62.571K.Mను రూ.601.14 కోట్లతో, నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దుల మధ్య 62.01K.M దూరాన్ని ₹691.81 కోట్లతో అభివృద్ధి చేయనుంది.

News October 16, 2024

తెలంగాణలో రిపోర్టు చేసిన ఏపీ ఐఏఎస్‌లు

image

ఏపీ ఐఏఎస్‌లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లనున్నారు. ఐపీఎస్‌లకు కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో అంజనీ కుమార్, అభిలాష బిస్త్ TGలోనే కొనసాగనున్నారు.

News October 16, 2024

నాలెడ్జ్ హబ్‌గా విశాఖ: సీఎం చంద్రబాబు

image

AP: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా విశాఖను మారుస్తామని CM చంద్రబాబు చెప్పారు. ‘భావనపాడులో 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేస్తాం. విశాఖ నుంచి భావనపాడు(శ్రీకాకుళం) వరకు రోడ్డు నిర్మిస్తాం. 2025లోగా భావనపాడు పోర్టు పూర్తి చేస్తాం. వంశధార నుంచి నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా వరకు అన్ని నదులు అనుసంధానం కావాలి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాం’ అని సీఎం వెల్లడించారు.

News October 16, 2024

మంచి మైలేజీకి ఈ టిప్స్ పాటించండి

image

* బైక్‌ వేగాన్ని పదేపదే పెంచుతూ, తగ్గించడం వద్దు. ఒకే స్పీడుతో వెళ్లేందుకు ప్రయత్నించండి.
* సడన్ బ్రేకులు, వేగంగా గేర్లు మార్చడమూ మంచిది కాదు.
* టైర్లలో గాలి చాలినంత ఉందో లేదో చూసుకోండి.
* బైక్ చైన్ క్లీన్‌&స్మూత్‌గా ఉండాలి.
* మీ బైక్‌ను క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించండి. బైక్ కంపెనీ సిఫార్సు చేసిన ఇంజిన్ ఆయిల్‌నే ఉపయోగించండి.

News October 16, 2024

రూ.30లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం: చంద్రబాబు

image

APకి రూ.30లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 10 బిలియన్ డాలర్ల FDIలను తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. 40బిలియన్ డాలర్ల ఎగుమతులు రాష్ట్రం నుంచి వెళ్లేలా చూస్తామన్నారు. MSMEలను బలోపేతం చేసి, 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

News October 16, 2024

ఆక్వా కల్చర్ హబ్‌గా AP: చంద్రబాబు

image

దెబ్బతిన్న AP బ్రాండ్‌ను పునర్మిర్మించాల్సి ఉందని CM చంద్రబాబు తెలిపారు. ‘APని ఆక్వా హబ్‌గా మారుస్తాం. ఫుడ్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమను మారిస్తే రత్నాలసీమగా తయారవుతుంది. సీమలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తే, అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. అభివృద్ధిలో మిన్నగా మారుతుంది. నవంబర్‌లో స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ విడుదల చేస్తాం. భారీగా విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి’ అని సీఎం వెల్లడించారు.

News October 16, 2024

హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేం: హైకోర్టు

image

TG: హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తెలిపింది. హైడ్రా ఏర్పాటును తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. జీవో 99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు GHMC చట్టంలోని విశేషాధికారాలను హైడ్రాకు కల్పిస్తూ పురపాలక శాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.