India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
1920: సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం
1942: బాలీవుడ్ నటుడు జితేంద్ర జననం
1962: సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జననం
1962: నటి కోవై సరళ జననం
1991: కవి కొండవీటి వెంకటకవి మరణం
* ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
తేది: ఏప్రిల్ 7, ఆదివారం
బ.త్రయోదశి: ఉదయం 6:54 గంటలకు, చతుర్దశి: తెల్లవారుజామున: 3:21 గంటలకు
పూర్వాభాద్ర: మధ్యాహ్నం 12:58 గంటలకు
దుర్ముహూర్తం: సాయంత్రం 4:39 నుంచి సాయంత్రం 5.28 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 9:28 నుంచి రాత్రి 10:53 గంటల వరకు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎప్పటికప్పుడు, సరికొత్త హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తుంటారు. ఇందుకోసం ఆయన భారీగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది. కాగా కోహ్లీ నుంచి హెయిర్ కట్‌కు కనీసం రూ.లక్ష ఫీజుగా తీసుకుంటున్నట్లు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తెలిపారు. పలువురు సినీ, స్పోర్ట్స్, బిజినెస్ సెలబ్రిటీల దగ్గర నుంచి కూడా దాదాపు ఇదే ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
✒ 2047 కోసం 24/7 పనిచేస్తా: మోదీ
✒ అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్: రాహుల్
✒ TG: KCRకు చెర్లపల్లి జైలులో ఇల్లు కట్టిస్తా: రేవంత్
✒ TG: కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది: హరీశ్
✒ AP: జగన్ పాలన ఓ పీడ కల: చంద్రబాబు
✒ AP: పేదల కోసం ఒక్క పథకమైనా తెచ్చావా బాబూ?: జగన్
✒ AP: పెన్షన్ల పంపిణీ గడువు 2 రోజులు పొడిగింపు
✒ RRvsRCB: కోహ్లీ సెంచరీ వృథా.. బెంగళూరు ఓటమి
అకౌంట్ షేరింగ్‌తో డిస్నీ హాట్‌స్టార్‌ను వాడుతున్న వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చింది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను కట్టడి చేసేందుకు జూన్ నుంచి చర్యలు చేపడతామని డిస్నీ సీఈఓ బాబ్ ఐర్ ఇటీవల వెల్లడించారు. కాగా గతంలో నెట్‌ఫ్లిక్స్ సైతం ఇదే తరహాలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఆంక్షలు విధించింది. ఫలితంగా ఆ సంస్థకు యూజర్లు పెరిగారు. 2023 ద్వితీయార్థంలోనే ఏకంగా 22 మిలియన్ సబ్‌స్క్రైబర్లు యాడ్ అయ్యారు.
రాజస్థాన్ చేతిలో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడిపోయింది. 184 పరుగుల టార్గెట్‌ను RR 19.1 ఓవర్లలో ఛేదించింది. జోస్ బట్లర్(100*), సంజూ శాంసన్ (69) రాణించడంతో ఆ జట్టు సునాయాస విజయం అందుకుంది. కాగా తొలి ఇన్నింగ్సులో కోహ్లీ(113*), డుప్లెసిస్(44) మినహా అందరూ విఫలమవడంతో RCB 183/3 పరుగులకే పరిమితమైంది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. ‘క్రికెట్‌లో ధోనీ మాదిరి రాజకీయాల్లో రాహుల్ బెస్ట్ ఫినిషర్. ఆయన కాంగ్రెస్‌ను అంతం చేసే వరకు విశ్రమించబోరు. ఆయన వల్లే కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు రెండు, మూడు చిన్న రాష్ట్రాలకే INC పరిమితమైంది. హస్తం పార్టీకి, అవినీతికి విడదీయలేని బంధం ఉంది’ అని పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో ఈ నెల 3వ తేదీ నుంచి 6 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో దాదాపు 95 శాతం మందికి పంపిణీ పూర్తయ్యింది. ఇంకా మిగిలిన వారికోసం 2 రోజులు గడువు పొడిగించింది.
మధ్యప్రదేశ్‌లో LS ఎన్నికలు భార్యాభర్తల మధ్య <<12960420>>చిచ్చు<<>> పెట్టాయి. అక్కడ కాంగ్రెస్ MLA అనుభా భర్త కంకర్ ముంజరే BSP తరఫున బాలాఘాట్ MPగా పోటీ చేస్తున్నారు. విభిన్న సిద్ధాంతాలున్న వ్యక్తులు ఓచోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్‌గా ప్రజలు భావిస్తారని కంకర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. APR 19న పోలింగ్ పూర్తయ్యాకే తిరిగెళ్తానని ప్రకటించారు. బాలాఘాట్‌లో INC విజయానికి కృషి చేస్తానని అనుభా స్పష్టం చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.