India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPLలో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన 3మ్యాచుల్లోనూ RR టాప్2లో ఉంటే.. RCB 4మ్యాచుల్లో 1 మాత్రమే గెలిచి 8వ ప్లేస్‌లో ఉంది. వరుస ఓటములతో డీలాపడ్డ RCBకి ఈరోజు జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ను దాని సొంతగడ్డపైనే ఎదుర్కోనుండటం సవాలే. వీటి మధ్య 30మ్యాచులు జరగ్గా.. RR 15, RCB 12 మ్యాచుల్లో గెలిచాయి. మూడింట్లో ఫలితం తేలలేదు.
AP: పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. నియోజకవర్గంలో ఇల్లు కొనుక్కుంటానని ఇటీవల ప్రచార సభలో తెలిపారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయన నివసించే భవనానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉంటుందని దీన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జ్వరం బారిన పడ్డ పవన్.. రేపటి నుంచి తిరిగి ప్రచారంలో పాల్గొంటారు.
రష్యాను ఉక్రెయిన్ చావుదెబ్బ కొట్టింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ SBU, సైన్యం కలిసి భారీ డ్రోన్లతో రష్యాపై దాడి చేశాయి. ఈ దాడిలో సౌత్ రోస్టోవ్‌లోని మోరోజోవ్స్క్ వైమానిక స్థావరంలోని ఆరు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. మరో 8 వరకూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. భద్రతా దళాలకు చెందిన దాదాపు 20 మంది సిబ్బంది మరణించినట్టు తెలుస్తోంది. కాగా ఈ దాడి తామే చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
TG: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. ఈరోజు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా సమరశంఖం పూరించనుంది. సాయంత్రం 4.30గంటలకు ‘జన జాతర’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించనుంది. నిన్న ఢిల్లీలో ప్రకటించిన మేనిఫెస్టోను రాహుల్ గాంధీ, CM రేవంత్ తెలుగులో విడుదల చేస్తారు. సభకు 10లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు. రేవంత్‌రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే విషయంలో ఆర్బీఐ నిర్ణయాలను బాగున్నాయని ఆర్థికవేత్త సిద్ధార్థ సన్యాల్ కొనియాడారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. ఆగస్టు తర్వాతే రెపో రేటు (ప్రస్తుత 6.5శాతం) కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 4శాతం తగ్గొచ్చని.. దీంతో రెపో రేటు 50-100 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చని అన్నారు.
AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. ఉదయం 9గంటలకు చింతరెడ్డిపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. కొవ్వూరు క్రాస్, గౌరవరం మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్‌రోడ్, ఓగూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.
గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో జరిమానాల రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. టికెట్ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్ చేయకుండా లగేజ్ తరలించడం, తదితర కారణాలతో మొత్తం 46.26 లక్షల కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. ముంబయి డివిజన్ పరిధిలో 20.56 లక్షల కేసులకు గాను రూ.115.29కోట్లు వసూలు చేసి తొలిస్థానంలో నిలిచింది. భుసావల్ డివిజన్‌లో 8.34లక్షల కేసులకు గాను రూ.66.33 కోట్లు వసూలయ్యాయి.
AP: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని టీడీపీ నేతల దేవినేని ఉమ, వర్ల రామయ్య కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. ‘కొందరు పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లు పని చేస్తున్నారు. దాడులు చేస్తుంటే హత్యాయత్నం కాకుండా పెట్టి కేసులతో సరిపెడుతున్నారు. జగన్ ఓటమి భయంతో రెచ్చగొట్టేలా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు’ అని నేతలు ఫైర్ అయ్యారు.
AP: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. ‘రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేలు, అన్ని పంటలకు రూ.500 బోనస్ హామీలు ఏమయ్యాయి. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసింది’ అని దుయ్యబట్టారు.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణకు చట్టం తీసుకొస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. AI నియంత్రణ అనేది చట్టబద్దంగానే జరగాలని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పరిశ్రమల వర్గాలతో చర్చించామని ఎన్నికల తర్వాత మరో దఫా చర్చిస్తామని తెలిపారు. డీప్‌ఫేక్‌లను కట్టడి చేసేలా, సరికొత్త ఆవిష్కరణలకు ఎలాంటి విఘాతం కలగకుండా చట్టాన్ని రూపొందిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.