News April 6, 2024

12 నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

image

AP: ఈ నెల 12వ తేదీ నుంచి టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.

News April 6, 2024

ఐపీఎల్‌లో జడేజా పేలవ ప్రదర్శన!

image

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నిరాశపరుస్తున్నారు. వేగంగా పరుగులు చేయాల్సిన సమయంలో తేలిపోతున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఇవాళ SRHతో జరిగిన మ్యాచ్‌లోనూ 4 ఓవర్లు ఆడి 31 పరుగులే చేశారు. అటు బౌలింగ్‌లోనూ తన మార్క్ చూపించలేకపోతున్నారు. దీంతో జడేజాకు ఏమైందంటూ ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

News April 6, 2024

హత్యా రాజకీయాల్ని జగన్ ప్రోత్సహిస్తున్నారు: సునీత

image

AP: షర్మిలను చూస్తుంటే సీఎం జగన్‌కు భయం కలుగుతోందని దివంగత YS వివేకా కుమార్తె సునీత అన్నారు. ‘జగన్ జైలులో ఉన్నప్పుడు YCPని బతికించిన షర్మిలను పక్కనపెట్టారు. హత్యా రాజకీయాలను జగన్ ప్రోత్సహిస్తున్నారు. వివేకాను హత్య చేయించిన MP అవినాశ్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. హంతకులకు శిక్ష పడాలంటే అధికారం ఉండకూడదు. అవినాశ్‌ను ఓడించి.. షర్మిలను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

News April 6, 2024

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, LIC హౌసింగ్ ఫైనాన్స్‌కి RBI ఫైన్

image

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌తో పాటు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఫైన్ విధించింది. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కి రూ.కోటి జరిమానా విధించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మార్గదర్శకాలను పాటించకపోవడంతో LIC హౌసింగ్‌కు రూ.40లక్షల ఫైన్ విధించింది. అలాగే నాలుగు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రిజిస్ట్రేషన్‌ను ఆర్బీఐ రద్దు చేసింది.

News April 6, 2024

ఏప్రిల్ 6: చరిత్రలో ఈరోజు

image

1886: హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జననం
1928: డీఎన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ జననం
1956: భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ జననం
1975: దర్శకుడు వీరభద్రం చౌదరి జననం
2011: తెలుగు నటి సుజాత మరణం
1896: తొలి ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్‌లో ప్రారంభం

News April 6, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 6, శనివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:54 సూర్యోదయం: ఉదయం గం.6:07
జొహర్: మధ్యాహ్నం గం.12:18
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.44
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 6, 2024

పింఛన్ల వ్యవహారంపై ఈసీకి చంద్రబాబు లేఖ

image

AP: కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పథకాలు అందించాలన్న సీఈసీ సూచనలను అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ‘నిబంధనలకు విరుద్దంగా సచివాలయాల దగ్గర పింఛన్లు ఇస్తున్నారు. టీడీపీని దోషిగా చూపిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు విష ప్రచారం చేస్తున్నారు. 40డిగ్రీల ఎండలో వృద్ధులను సచివాలయాలకు పిలిపించారు’ అని మండిపడ్డారు.

News April 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 6, 2024

పెళ్లి చేసుకున్నా.. మాజీ లవర్లతో ఫ్రెండ్లీగానే ఉంటా: సుస్మితా సేన్

image

తన జీవితం తెరిచిన పుస్తకమని, నిజాయితీగా జీవిస్తున్నానని మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ వెల్లడించారు. తన బ్రేకప్స్, పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘మనం తీసుకునే నిర్ణయాలు బాధపెట్టాయా? తప్పు చేశామా? అనేది పట్టించుకోను. ఒకవేళ ఎవరినైనా పెళ్లి చేసుకుంటే.. నా మాజీ లవర్లతో ఫ్రెండ్లీగానే ఉంటా. కానీ అది కొంచెం కష్టంగానే ఉంటుంది’ అని పేర్కొన్నారు. 48 ఏళ్లొచ్చినా ఆమె సింగిల్‌గా ఉన్న విషయం తెలిసిందే.

News April 6, 2024

15 లక్షల ఈవీఎంలు మిస్ అంటూ ప్రచారం.. ఈసీ ఖండన

image

ఎన్నికల వేళ ఈసీ పేరుతో ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి. తాజాగా దేశంలో 15 లక్షల ఈవీఎంలు మిస్ అయినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. దీన్ని ఈసీ ఖండించింది. ‘ఈ ప్రచారం తప్పు. ఈవీఎంలు ఎక్కడా మిస్ కాలేదు. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అధికారిక సమాచారం కోసం <>https://www.eci.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు’ అని ట్వీట్ చేసింది.

error: Content is protected !!