News October 22, 2024

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు

image

అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలు చూడవచ్చు. NOV 16న ఉ.8 గంటలకు SCలో బయల్దేరే ఈ రైలుకు NLG, పిడుగురాళ్ల, GNT, తెనాలి, OGL, NLR, గూడూరు, రేణిగుంట, TPTY, చిత్తూరులో రైలు ఎక్కొచ్చు. 5 పగళ్లు, 4 రాత్రులు రోడ్డు రవాణాతో పాటు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్ ఛార్జ్ ₹11,475, థర్డ్ AC ₹18,790.

News October 22, 2024

INDతో రెండో టెస్టుకూ కేన్ మామ దూరం

image

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ భారత్‌తో పుణేలో జరిగే రెండో టెస్టుకూ దూరమయ్యారు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. కేన్ పూర్తిగా కోలుకోకపోవడంతో నెక్స్ట్ టెస్టుకూ రెస్ట్ ఇస్తున్నట్లు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. నవంబర్ 1న ముంబైలో జరగనున్న మూడో టెస్టుకు విలియమ్సన్ ఆడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 22, 2024

బుక్ ఫెయిర్‌కు వచ్చి బిర్యానీలు లాగించారు!

image

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నిర్వహించిన బుక్ ఫెయిర్ కాస్తా ఫుడ్ ఫెస్ట్‌గా మారింది. సాహిత్యం- సంస్కృతిని ప్రోత్సహించేందుకు, బుక్స్ చదివే అలవాట్లను పెంపొందించేందుకు నిర్వాహకులు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి వేలాది మంది తరలిరాగా కేవలం 35 పుస్తకాలే అమ్ముడయ్యాయి. కానీ, 1200 షావర్మాలు, 800 బిర్యానీలు అమ్ముడయ్యాయి. దీంతో పుస్తకాల కంటే తిండే ముఖ్యమైందని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

News October 22, 2024

WOW: 5 రెట్లు పెరిగిన కరోడ్‌పతి ITR ఫైలర్స్

image

దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. AY2013-14లో రూ.కోటికి మించి Taxable Income చూపినవారి సంఖ్య 44,078. పదేళ్లలో (AY2023-24) వీరు 2.3 లక్షలకు చేరారు. ఆదాయం పెరగడం, ITR ఫైలింగ్ ఈజీ అవ్వడమే ఇందుకు కారణాలు. AY2023-24లో రూ.కోటిగా పైగా ITR ఫైల్ చేస్తున్నవారిలో ఉద్యోగులు 52% ఉన్నారు. చాలామందికి రూ.1-5 కోట్ల వరకు శాలరీ వస్తోంది. మొత్తంగా ITR ఫైల్ చేస్తున్నవారు పదేళ్లలో 3.3 కోట్ల నుంచి 7.5 కోట్లకు చేరారు.

News October 22, 2024

వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కాదు: బన్నీ

image

AP: హైకోర్టులో దాఖలు చేసిన <<14413512>>పిటిషన్‌లో<<>> అల్లు అర్జున్ పలు విషయాలను ప్రస్తావించారు. MLAగా పోటీ చేస్తున్న స్నేహితుడు కిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్లడం తన వ్యక్తిగత పర్యటన అని వివరించారు. ఆయన్ను అభినందించేందుకు మాత్రమే వెళ్లానని, బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఎన్నికల టైంలో వ్యక్తిగత సందర్శన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

News October 22, 2024

టెస్టు క్రికెట్‌: డౌన్ ట్రెండ్‌లో భారత బ్యాటింగ్!

image

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌కు కేరాఫ్‌గా పేరున్న టీమ్ ఇండియా క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. 2020 నుంచి సొంతగడ్డపై టెస్టుల్లో యావరేజ్ రన్స్ పర్ వికెట్ తగ్గిపోతూ వస్తోంది. 2015-19లో తొలి ఇన్నింగ్స్‌ సగటు 48.57 ఉంటే ఇప్పుడు 32.62కి పడిపోయింది. 2వ ఇన్నింగ్స్‌లో 53.93 నుంచి 36.58 రన్స్‌కి తగ్గింది. అటు మన పిచ్‌లపై విదేశీ బ్యాటర్ల రన్‌రేట్ పెరుగుతూ వస్తోంది. NZతో టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది.

News October 22, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 22, 2024

BRICS శత్రు కూటమేమీ కాదు: అమెరికా

image

సంయుక్త లక్ష్యాలను సాధించేందుకు అనేక దేశాలతో US కలిసి పనిచేస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరిన్ జీన్ పియరీ అన్నారు. BRICSను తాము జియో పొలిటికల్ రైవల్‌గా చూడటం లేదని పేర్కొన్నారు. భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. PM మోదీ సైతం ‘బ్రిక్స్ యాంటీ వెస్ట్రన్ కూటమి కాదు, నాన్ వెస్ట్రన్ కూటమి మాత్రమే’ అని అభిప్రాయపడటం తెలిసిందే. G7తో పోలిస్తే BRICS బలంగా మారింది.

News October 22, 2024

కేజీబీవీలకు రూ.24 కోట్లు రిలీజ్

image

AP: కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) అదనపు గదులు, లేబొరేటరీలు ఇతర సివిల్ పనుల కోసం సమగ్ర శిక్ష రూ.24.84 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.20.61 కోట్లు నిర్మాణాలకు, రూ.4.23 కోట్లు రిపేర్ల కోసం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అన్ని పనులను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

News October 22, 2024

వినేశ్, బజరంగ్ స్వార్థంతో ఉద్యమానికి చెడ్డ పేరు: సాక్షి మాలిక్

image

రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్‌భూష‌ణ్‌ను తొలగించాలంటూ చేసిన ఉద్యమంలో తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు’ అని తన పుస్తకం విట్‌నెస్‌లో వెల్లడించారు.