News November 1, 2025

ఫ్రీ Ai.. బ్యాగ్రౌండ్ రీజన్స్ ఏంటంటే..?

image

మొన్న Grok Aiని మస్క్, నిన్న perplexity Aiని ఎయిర్‌టెల్, తాజాగా గూగుల్ Gemini Aiని ఫ్రీగా ఇస్తున్నట్లు జియో ప్రకటించాయి. ఎందుకు ఈ ఫ్రీ పోటీ అంటే.. మార్కెట్లో డామినెంట్, డాన్ అయితేనే యాడ్స్ వస్తాయిగా. సో.. మార్కెట్ వాటా పొందడం రీజన్1. R2: యూజర్స్ సెర్చ్ డేటా, బిహేవియర్ అర్థం చేసుకోవడం. R3: ప్రస్తుతం తొలి స్టేజ్‌లోని Ai బ్రౌజింగ్ యూజర్స్ ఇన్‌పుట్స్‌తో స్కిల్స్, సర్వీస్ తదితరాలు ఇంప్రూవ్ చేసుకోవడం.

News November 1, 2025

సూర్యరశ్మి వల్ల ఇన్ని లాభాలా..!

image

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు సూర్యరశ్మి(ఉదయం/సాయంత్రం)లో ఉండటం ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి విటమిన్-Dని అందిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సెరోటోనిన్‌ను విడుదల చేసి మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది. ఉదయం సూర్యకాంతి నిద్ర నాణ్యతను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది’ అని సూచిస్తున్నారు. SHARE IT

News November 1, 2025

తిరుమల కొండపై విశేష పర్వదినాలు

image

నవంబర్ 1: ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
నవంబర్ 2: కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.
నవంబర్ 5: కార్తీక పౌర్ణమి గరుడ సేవ
నవంబర్ 9: కార్తీక వన భోజనం
నవంబర్ 15: సర్వ ఏకాదశి
నవంబర్ 17: ధన్వంతరి జయంతి
నవంబర్ 18: మాస శివరాత్రి
నవంబర్ 25: తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం

News November 1, 2025

DRDOలో 105 పోస్టులు.. అప్లై చేశారా?

image

బెంగళూరులోని DRDO ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE)లో 105 అప్రెంటీస్ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ITI, డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ పాసైనవారు NOV 4లోపు అప్లై చేసుకోవాలి. apprenticeshipindia.gov.in పోర్టల్ ఎన్‌రోల్ చేసుకోవాలి. గేట్ స్కోరు, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News November 1, 2025

కరోండా(వాక్కాయ) మొక్క.. పొలానికి రక్షణ కవచం

image

పంటకు రక్షణకు నేడు ఇనుప వైర్ ఫెన్స్, కాంక్రీటు స్తంభాలు వేయడానికి చాలా ఖర్చవుతుంది. అయితే పంటకు సహజ రక్షణ కవచంలా నిలుస్తోంది ‘కరోండా’. వీటినే వాక్కాయ మొక్కలు అంటారు. ఇది చిన్న పొద రూపంలో పెరుగుతుంది. దీని కాండం, కొమ్మలు ముళ్లతో నిండి ఉంటాయి. ఎండలు, తక్కువ నీరు, ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకొని ఇది పెరుగుతుంది. ఎప్పుడూ పచ్చగా ఉండే ఈ మొక్క పొలానికి సహజమైన గోడలా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది.

News November 1, 2025

కరోండా జీవకంచెతో అనేక ప్రయోజనాలున్నాయ్

image

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.

News November 1, 2025

కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

image

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

News November 1, 2025

శబరిమల గోల్డ్ చోరీ కేసు.. మాజీ ఈవో అరెస్ట్

image

శబరిమల బంగారం చోరీ <<18095448>>కేసులో<<>> మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆలయ మాజీ ఈవో సుధీశ్ కుమార్‌‌ను సిట్ అరెస్ట్ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ మాజీ అధికారి మురళీ బాబును సైతం అదుపులోకి తీసుకుంది. సుధీశ్ 2019లో శబరిమల ఈవోగా పనిచేశారు. ఆ సమయంలోనే బంగారు తాపడాల చోరీ జరిగింది.

News November 1, 2025

తీవ్ర పేదరికం నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ: సీఎం

image

తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా CM పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచినట్లు పేర్కొన్నారు. 2021లో ‘తీవ్ర పేదరిక నిర్మూలన’ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 64వేల కుటుంబాలను గుర్తించి, ఆర్థిక లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అటు దీన్ని ‘ప్యూర్ ఫ్రాడ్’గా పేర్కొన్న INC అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.

News November 1, 2025

మొదటి మహిళా కామెంటేటర్

image

ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్లుగా మహిళలు కనిపిస్తున్నారు. కానీ 1970ల్లో మగాళ్ల గొంతే వినిపించే క్రికెట్‌ వ్యాఖ్యానంలోకి వచ్చారు చంద్రనాయుడు. దేశపు తొలి టెస్ట్‌మ్యాచ్‌ కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు కూతురామె. క్రికెట్‌ పట్ల ఆసక్తితో కొన్నాళ్లు ప్లేయర్‌గా రాణించారు. దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరైన ఆమె BCCI, ICC ఈవెంట్లలో పాల్గొని భారత తొలిమహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు.