News April 4, 2024

1962లోనే 38వేల చ.కి.మీ భూమిని కోల్పోయాం: జైశంకర్

image

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందని ఇండియా కూటమి చేస్తోన్న విమర్శలను విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. 1962లోనే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయామని చెప్పారు. 2000 తర్వాత ఆక్రమణ జరిగిందని ఆరోపించడం సరి కాదన్నారు. పాక్, చైనాను మినహాయిస్తే మిగతా పొరుగుదేశాలతో భారత సంబంధాలు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయని తెలిపారు. POK ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.

News April 4, 2024

రేపు కేసీఆర్ కీలక ప్రకటన

image

TG: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు కీలక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ ‘పొలం బాట’లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మగ్దూంపూర్, బోయినపల్లి గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అలాగే మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో మీడియాతో మాట్లాడనున్నారు. అందులోనే కీలక ప్రకటన చేస్తారని BRS శ్రేణులు చెబుతున్నాయి.

News April 4, 2024

ఇండిపెండెంట్లు వద్దు.. పార్టీల అభ్యర్థులే ముద్దు!

image

లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను ఓటర్లు ఆదరించట్లేదు. హామీలు నెరవేర్చడం పార్టీలతోనే సాధ్యమని భావిస్తున్నారు. 1951లో 533 మంది పోటీ చేస్తే 37 మంది(6శాతం), 1957లో 1,519 మంది బరిలో నిలిస్తే 42 మంది(8శాతం) గెలిచారు. 2019లో ఏకంగా 8వేల మంది స్వతంత్రులు పోటీ చేస్తే.. నలుగురు(సుమలత-మండ్య, నవనీత్ రాణా-అమరావతి, నభకుమార్-కోక్రాఝార్‌, మోహన్ భాయ్-దాద్రానగర్‌ హవేలీ) మాత్రమే విజయం సాధించారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

మరో 2 రోజులే ఛాన్స్

image

TG: EAPCETకు భారీగా <>దరఖాస్తులు<<>> వస్తున్నాయి. FEB 26న అప్లికేషన్ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటివరకు 3,21,604 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్ కోసం 2,33,517, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో 87,819, మూడు విభాగాలకు 268 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులకు ఇంకా 2 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది మూడు విభాగాలకు కలిపి 3,20,683 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2024

విజయ్ దేవరకొండ బూతుపై అనసూయ స్పందనిదే..

image

‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మాట్లాడిన <<12982348>>బూతు<<>> పదంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఇష్టం వచ్చినట్లు వాగడం, తర్వాత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారని PR మాఫియాతో సింపతీ డ్రామాలు చేయడం, ఇందులో అనసూయను లాగడం’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి అనసూయ స్పందిస్తూ.. ‘ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను చాలాసార్లు చెప్పి వదిలేశా. ఈ ట్వీట్‌నూ వారి స్వార్థానికి వాడుకుంటారు’ అని పేర్కొన్నారు.

News April 4, 2024

పాసులు ఇవ్వనందుకే కరెంట్ కట్ చేశారు: HCA

image

SRH-CSK మ్యాచుకు 24 గంటల ముందు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రూ.1.63 కోట్ల బకాయిలు ఉండటం వల్లే విద్యుత్ సరఫరా నిలిపివేశామని అధికారులు తెలిపారు. అయితే విద్యుత్ అధికారులు మ్యాచ్ పాసులు అడిగారని, ఇవ్వకపోవడంతో కరెంట్ కట్ చేశారని HCA ప్రతినిధులు చెబుతున్నారు. కాగా, ప్రస్తుతం జనరేటర్ల సాయంతో స్టేడియంలో లైట్లు వెలిగిస్తున్నారు.

News April 4, 2024

వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయ్.. లేకపోతే లావైపోతాం అన్న: బండ్ల గణేశ్

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘గత పాలకులు నిన్ను పెట్టిన కష్టాలు మర్చిపోకు, నీకు జరిగిన అవమానాలు అంతకంటే మర్చిపోకు. గతంలో జరిగిన ప్రతి ఒక్కదాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయ్.. లేకపోతే లావైపోతాం అన్న’ అని పోస్ట్ చేశారు.

News April 4, 2024

BREAKING: పంజాబ్ టార్గెట్ 200 రన్స్

image

పంజాబ్‌తో మ్యాచులో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. కెప్టెన్ గిల్ 89* పరుగులతో అదరగొట్టగా, సాయి సుదర్శన్ 33, విలియమ్సన్ 26, సాహా 11, విజయ్ శంకర్ 8, తెవాటియా 23* రన్స్ చేశారు. రబడ 2 వికెట్లు, హర్‌ప్రీత్ బార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 200 పరుగులు చేయాలి.

News April 4, 2024

మృతుల కుటుంబాలకు రూ.40లక్షల చొప్పున పరిహారం

image

TG: నిన్న సంగారెడ్డి జిల్లాలోని SB కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు <<12982731>>ఘటనలో<<>> మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షలు చెల్లించేలా మంత్రి దామోదర రాజనర్సింహా కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కుటుంబంలో ఒకరికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చేలా ఒప్పించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించారు.

News April 4, 2024

హార్దిక్ పాండ్యకు లాస్ట్ ఛాన్స్?

image

IPL: ప్రస్తుత సీజన్‌లోనే హార్దిక్ పాండ్యను ముంబై కెప్టెన్సీ నుంచి తొలగించవచ్చని వార్తలు వస్తున్నాయి. పాండ్యకు రెండు అవకాశాలు ఇవ్వాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు ‘NEWS 24’ తెలిపింది. తర్వాత జరిగే 2 మ్యాచుల్లో ముంబై నెగ్గడంతో పాటు వ్యక్తిగతంగానూ రాణించాలని హార్దిక్‌కు షరతు విధించిందట. లేదంటే నాయకత్వంలో మార్పులు చేస్తామని చెప్పినట్లు సమాచారం. కాగా, తొలి 3 మ్యాచుల్లో ముంబై ఓడిపోయింది.

error: Content is protected !!