News April 4, 2024

జపాన్‌లో భారీ భూకంపం

image

జపాన్‌‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. కాగా పొరుగు దేశం <<12978648>>తైవాన్‌<<>>లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన 24గంటల వ్యవధిలోనే ఈ భూకంపం వచ్చింది. జపాన్‌లోని హోన్షు‌ తూర్పు తీరంలో భూమి కంపించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

News April 4, 2024

కర్ణాటకలో మోదీ వేవ్ లేదు: DK శివకుమార్

image

తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత DK శివకుమార్ అన్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని ఆరోపించారు. తమ రాష్ట్రంలో మోదీ వేవ్ లేదని, ఈ LS ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్‌గా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తీసుకుంటున్న కేంద్రం.. తిరిగిచ్చేది మాత్రం ఏం లేదని ఆయన ఆరోపించారు.

News April 4, 2024

శ్రీదేవి బయోపిక్‌కు అనుమతి ఇవ్వను: బోనీ కపూర్

image

దివంగత నటి శ్రీదేవి బయోపిక్‌పై ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీదేవి చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె జీవితం కూడా ప్రైవేట్‌గానే ఉండాలి. అందుకే నేను బతికి ఉన్నంతవరకు శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించేందుకు అనుమతి ఇవ్వను’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా శ్రీదేవి బయోపిక్ గురించి బాలీవుడ్‌లో పలు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో బోనీ కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

News April 4, 2024

కోతులు పడిన ట్యాంకు నుంచి నీటి సరఫరా జరగలేదు: కలెక్టర్

image

తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటనపై నల్గొండ కలెక్టర్ స్పందించారు. దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ నాగేశ్వరరావు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ‘నందికొండ హిల్ కాలనీలో 2000 లీటర్ల సామర్థ్యం ఉన్న 2 ట్యాంకులతో పాటు ఒకటి వెయ్యి లీటర్ల ట్యాంకు ఉంది. వీటితోపాటు కోతులు పడి చనిపోయిన మరొకటి ఉండగా.. అందులో నుంచి 3 రోజులుగా నీటి సరఫరా జరగలేదు. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు’ అని ప్రకటనలో తెలిపారు.

News April 4, 2024

గాలి కూడా నేరస్థులను పట్టిస్తుంది!

image

నేరం చేసిన చోట తమ వేలిముద్రలతో పాటు ఇతరత్రా ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడే జాదూగాళ్ల ఆటలు ఇక సాగవు. ఎందుకంటే.. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త విధానాన్ని రూపొందించారు. నేర ప్రదేశంలో గాలిలో నుంచి మానవ DNAను సేకరించి విశ్లేషిస్తారట. మనుషులు మాట్లాడినా, శ్వాసించినా వారి DNA ఆనవాళ్లు గాలిలో కలుస్తాయట. ఇలా కలిసిన DNA ద్వారా నేరస్థులను కనిపెట్టవచ్చని చెబుతున్నారు.

News April 4, 2024

IPL: నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

image

ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడబోతున్నాయి. అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య కేవలం 3 మ్యాచులు జరిగాయి. వాటిలో GT రెండింట్లో గెలవగా, PBKS ఒక మ్యాచులో నెగ్గింది. ప్రస్తుత సీజన్‌లో GT ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లో 2, పంజాబ్ 3 మ్యాచుల్లో ఒక విజయం సాధించాయి. నేడు గెలిచేదెవరో కామెంట్ చేయండి.

News April 4, 2024

గురజాల యుద్ధంలో గెలుపెవరిదో?

image

AP: పౌరుషానికి ప్రతీక పల్నాడు(D) గురజాల. గతంలో పల్నాడు యుద్ధం ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 6, TDP 5సార్లు, CPI, YCP ఒక్కోసారి గెలిచాయి. TDP నుంచి Ex MLA యరపతినేని శ్రీనిసరావు(3సార్లు MLA) ఏడోసారి బరిలోకి దిగుతున్నారు. YCP నుంచి మాజీ CM కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు కాసు మహేశ్ మరోసారి పోటీ చేస్తున్నారు. లోకల్ మేనిఫెస్టోతో ఇద్దరు నేతలు రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

ఇవాళ్టి నుంచి జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో ఎండలు నిప్పులకొలిమిలా మారుతున్నాయి. ఈ వేసవిలో తొలిసారిగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భానుడి ప్రతాపం అధికంగా ఉంది. నేటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాల్పులు అధికంగా ఉంటాయని IMD అంచనా వేసింది.

News April 4, 2024

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

image

AP: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను సాంఘిక, సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు 40,853 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 35,629 మంది విద్యార్థులు హాజరయినట్లు పేర్కొంది. ఫలితాల కోసం విద్యార్థులు http:apbragcet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపింది.

News April 4, 2024

19 నుంచి ఇంద్రకీలాద్రిపై బ్రహ్మోత్సవాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 22వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణం నిర్వహిస్తారు. 24న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 19న వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవలో ఆది దంపతులు భక్తులకు దర్శనమిస్తారు.

error: Content is protected !!