India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. AAP వ్యవస్థాపక సభ్యుడు దినేశ్ వాఘేలా(73) మృతి చెందారు. బాబాజీగా ప్రసిద్ధి చెందిన వాఘేలా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే సోమవారం రాత్రి పనాజీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుజరాత్‌కు చెందిన ఆయన ఆప్ క్రమశిక్షణా కమిటీకి నేతృత్వం వహించారు. గోవాలో పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
AP: వివేకాను ఎవరు చంపారో ప్రజలందరికీ తెలుసన్న CM జగన్ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు. ‘నా తండ్రి హత్యను రాజకీయంగా జగన్ వాడుకున్నారు. 5 ఏళ్లు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం మాట్లాడుతున్నారు. MP అవినాశ్‌ను అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని CMకు భయమా? ఆయన ఎందుకు భయపడుతున్నారు? ఈ ప్రభుత్వం రక్తంలో మునిగి ఉంది. దీని నుంచి బయటకొస్తేనే రాష్ట్రాభివృద్ధి’ అని తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో 30 ప్రాంతాలకు చైనా పేర్లు మార్చడంపై విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ‘నేనొచ్చి ఒకరి ఇంటికి ఉన్న పేరును మార్చేస్తే, ఆ ఇల్లు నాదవుతుందా? అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మన సైన్యం కాపలా ఉంది’ అని గుర్తుచేశారు.
TG: కేసీఆర్ పొలం బాట పట్టడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షమేనని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు ప్రభుత్వ నేతలకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మాని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
TG: రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో రైతు దీక్ష చేపట్టిన ఆయన.. ‘రైతులను ఆదుకోవాలి. కర్షకులు లేనిదే రాజ్యం లేదు. అన్నదాతలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. పంట ఎండిన రైతులకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలి’ అని కోరారు.
AP: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని.. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినమని వెల్లడించింది.
TG: తనపై వస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై KTR స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, మంత్రిపై పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తనపై నిరాధార వార్త రాసిన పత్రికపైనా ఫిర్యాదు చేస్తానన్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ కస్టడీ ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిద్దరికి ఈ నెల 6వరకు రిమాండ్ విధించింది. వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా నుంచి ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ రానుంది. పుష్ప మాస్ జాతర ఈరోజు నుంచి మొదలుకానుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆ అప్డేట్ ఏంటా? అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ బర్త్ డే (APR 8) ఉండటంతో ఫ్యాన్స్‌లో జోష్ నింపేందుకు ఏదైనా సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత వల్లే కరవు వచ్చిందని ప్రతిపక్ష BRS ఆరోపిస్తుంటే.. ఇది గత ప్రభుత్వం చేసిన పాపమే అని కాంగ్రెస్ అంటోంది. ఎండిన పంటలను పరిశీలించేందుకు కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే.. అసెంబ్లీకి రాని కేసీఆర్ అరెకరం కోసం రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నష్టపోయిన రైతులను గాలికి వదిలేసి ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సరికాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.