News April 1, 2024

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగంగా జరగాలి: సుప్రీం

image

AP: సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యంపై కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. దీనిపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల జాప్యం అవుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలియజేయగా.. రాజకీయ నేత, CM అన్న కారణాలతో విచారణ జాప్యం కావొద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ ప్రక్రియ వేగంగా జరగాలని సీబీఐని ఆదేశించిన కోర్టు.. విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.

News April 1, 2024

హార్దిక్ కెప్టెన్సీకి నేడు అగ్ని పరీక్ష

image

నేడు రాజస్థాన్‌ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై తప్ప అన్ని జట్లూ పాయింట్స్ టేబుల్‌లో ఖాతా తెరిచాయి. రెండు మ్యాచులూ ఘోరంగా ఓడిన ముంబైని కెప్టెన్ హార్దిక్ పాండ్య ఏ విధంగా నడిపించనున్నారన్నది ఆసక్తికరం. హోం స్టేడియమైన వాంఖడేలో కూడా తనపై వచ్చే తీవ్ర స్థాయి వ్యతిరేకతను ఆయన అధిగమించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ముంబైని విజయతీరాలకు చేర్చడం పాండ్యకు అగ్ని పరీక్షేనని విశ్లేషకులు అంటున్నారు.

News April 1, 2024

OTTలోకి టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే?

image

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ థియేటర్లలో సూపర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత మాత్రమే OTTలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీని ప్రకారం ఏప్రిల్ చివరి వారం లేదా మే తొలి వారంలో టిల్లు స్క్వేర్ OTTలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సుంది.

News April 1, 2024

ముగిసిన కస్టడీ.. నేడు కోర్టుకు కేజ్రీవాల్

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో CM కేజ్రీవాల్ ED కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను Mar21న ED అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. Mar28 వరకు కస్టడీకి ఇచ్చింది. మరోసారి దాన్ని Apr1కి పొడిగించింది. అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు April 3కి వాయిదా వేసింది.

News April 1, 2024

కొత్త పన్ను విధానంపై ప్రభుత్వం క్లారిటీ

image

కొత్త పన్ను విధానంలో నేటి నుంచి మార్పులుంటాయనేది తప్పుడు ప్రచారమని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈమేరకు ఒక టేబుల్‌ను ట్విటర్‌లో షేర్ చేసింది. కొత్త పన్ను విధానం డీఫాల్ట్ అని, అయినప్పటికీ ట్యాక్స్ పేయర్లు తమకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది. కొత్త పన్ను విధానం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

News April 1, 2024

డీఎంకే, కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు

image

‘కచ్చతీవు దీవి’ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై PM మోదీ విమర్శలకు దిగారు. తమిళనాడు ప్రజల ప్రయోజనాలపై డీఎంకేకు ఎలాంటి ఆసక్తి లేదని విమర్శించారు. కచ్చతీవు అంశంలో బయటకు వస్తున్న కొత్త విషయాలు DMK ద్వంద్వ ప్రమాణాలను బయటపెడుతున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్, డీఎంకే వంటి కుటుంబ పార్టీలు వారి వారసులకే రక్షణ కల్పిస్తాయని విమర్శించారు. వేరే అంశాలను పట్టించుకోవని మండిపడ్డారు.

News April 1, 2024

MI ఫ్యాన్స్ దాడి.. CSK అభిమాని మృతి

image

ముంబై ఇండియన్స్ అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని మృతిచెందారు. మ‌హారాష్ట్ర‌లోని కొల్హాపూర్‌లో కొంత‌మంది ఒక‌చోట చేరి హైద‌రాబాద్‌, ముంబై మ్యాచ్‌ను చూశారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన సమయంలో సీఎస్‌కే అభిమాని అయిన 63 ఏళ్ల‌ బండోపంత్ హేళ‌న‌గా మాట్లాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఆగ్రహించిన MI ఫ్యాన్స్ అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బండోపంత్ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.

News April 1, 2024

ఫేక్ న్యూస్‌కు చెప్పండి చెక్

image

యూజర్లకు ముఖ్య గమనిక. మన Way2News లోగోతో కొందరు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మా లోగోతో వచ్చే ఫార్వర్డ్స్ వెరిఫై చేశాక మాత్రమే ఇతరులకు షేర్ చేయండి. మా ప్రతి ఆర్టికల్‌కు యునిక్ కోడ్ ఉంటుంది. మీరు పొందిన స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. సెర్చ్‌లో మరో వార్త వచ్చినా, ఏది రాకపోయినా మీరు పొందినది ఫేక్ వార్త. వీటిని grievance@way2news.comకు మెయిల్ చేయండి.

News April 1, 2024

FY25 షురూ.. స్టాక్ మార్కెట్ల జోరు

image

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గరిష్ఠంగా 22,529 మార్క్ తాకి ఆల్ టైమ్ హై నమోదు చేసిన నిఫ్టీ ప్రస్తుతం 22,468 వద్ద కొనసాగుతోంది. మరోవైపు సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా లాభాన్ని నమోదు చేసి గరిష్ఠంగా 74,254ను తాకింది. JSWస్టీల్, టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, దివిస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.

News April 1, 2024

ఐపీఎల్ టికెట్ల విషయంలో జాగ్రత్త: HCA వార్నింగ్

image

ఈ నెల 5న హైదరాబాద్‌లో సీఎస్కేతో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ టికెట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ ప్రేమికుల్ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ట్విటర్‌లో హెచ్చరించారు. ‘SRHvsCSK మ్యాచ్‌కు ఫేక్ టికెట్లు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాంటివేమైనా మీ దృష్టికి వస్తే వెంటనే మాకు తెలియజేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని సూచించారు.

error: Content is protected !!